• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ విషయంలో మోదీ ఎందుకు వెనక్కి తగ్గినట్టు.. ఇప్పటికైనా చేస్తారా.. సాధ్యమేనా...?

|

కరోనా లాక్ డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక రంగాన్ని చక్కదిద్దేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్‌లో అత్యంత ఎఫెక్ట్ అయిన వలస కూలీలను ఈ ప్యాకేజీ విస్మరించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వలస కూలీలకు ప్రభుత్వం ఎంతో కొంత చేయూత అందిస్తుందని భావించినప్పటికీ.. అదేదీ జరగలేదు. ఉద్దేశపూర్వకంగానే మోదీ సర్కార్ వలస కూలీలను విస్మరించిందా.. లేక దీని అమలు అసాధ్యమని భావించి పక్కనపెట్టేసిందా..? తెర వెనుక అసలేం జరిగింది....

కూతురు గెలుపు కోసం ప్రజాస్వామ్యం ఖూనీ.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్.. కూతురు గెలుపు కోసం ప్రజాస్వామ్యం ఖూనీ.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్..

ఎందుకు వెనక్కి తగ్గినట్టు..

ఎందుకు వెనక్కి తగ్గినట్టు..

వలస కూలీలకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై ఉన్నత స్థాయిలో మోదీ సర్కార్ చర్చలు జరిపింది. కానీ వలస కూలీలకు సంబంధించి ప్రభుత్వం వద్ద కచ్చితమైన డేటా లేకపోవడంతో వెనుక అడుగు వేసింది. కేవలం ప్రభుత్వ రిలీఫ్ క్యాంపుల్లో ఆశ్రయం పొందిన 28 లక్షల వలస కూలీల డేటా మాత్రమే ప్రభుత్వం ఉంది. మిగతా వలస కూలీలు దాదాపు 7-8 కోట్లు వరకు ఉంటారని అంచనా. వీరందరి బ్యాంకు ఖాతాలు,ఆధార్ నంబర్స్‌కు సంబంధించిన డేటా ప్రభుత్వం వద్ద లేదు. దీంతో ప్రత్యక్ష నగదు బదిలీ ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది.

ఇప్పటికైనా చేస్తారా.. సాధ్యమేనా..

ఇప్పటికైనా చేస్తారా.. సాధ్యమేనా..


ఇప్పటికైనా వలస కూలీలకు సంబంధించి సమగ్ర డేటాను సేకరించాలని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోంది. అయితే అది చెప్పినంత సులువు కాదని నిపుణులు అంటున్నారు. 2011 జనాభా లెక్కల తర్వాత విశ్వసనీయ గణాంకాలేవీ అందుబాటులో లేవని వారు గుర్తుచేస్తున్నారు. వలస కూలీలకు సంబంధించిన డేటా సేకరణకు సరైన ప్రక్రియ ఏదీ అందుబాటులో లేదని నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ మాజీ చైర్మన్ పీసీ మోహనన్ అన్నారు. కాబట్టి 2021లో నిర్వహించబోయే జనాభా లెక్కల సర్వేలో ఇందుకు సంబంధించిన ప్రశ్నలు కూడా చేర్చాలని అభిప్రాయపడ్డారు. ఆ వ్యక్తి వలస కూలీనా.. లేక సాధారణ కార్మికుడా... లేక స్వయం ఉపాధి పొందుతున్నాడా వంటి వివరాలను సేకరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రత్యక్ష నగదు బదిలీకి బదులు...

ప్రత్యక్ష నగదు బదిలీకి బదులు...

వలస కూలీలకు ప్రత్యక్ష నగదు బదిలీకి బదులు వారికి ఆహారం పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే వారు స్వస్థలాలకు తిరిగొచ్చాక మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం MGNREGA నిధులను రూ.40వేల కోట్ల నుంచి రూ.1లక్ష కోట్లకు పెంచారు. ఇక ఉద్దీపన ప్యాకేజీ కింద రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ప్రతీ వలస కూలీకి/కార్మికుడికి 5కేజీల బియ్యం లేదా గోధుమలు,కుటుంబానికి 1కేజీ శనిగలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది.

  Gold Price Reduced Today, 10 grams Gold Now 47,980
  ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...

  ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు...


  మార్చి 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వలస కూలీలు కాలినడకన,సైకిళ్లపై స్వస్థలాల బాట పట్టారు. లాక్ డౌన్ విధించిన రెండు నెలల తర్వాత.. అంటే, మే 1వ తేదీ నుంచి ప్రభుత్వం వలస కూలీల తరలింపుకు శ్రామిక్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు,హక్కుల కార్యకర్తలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్రూర వికటాట్టహాసం అని అభివర్ణించారు.

  English summary
  When central government announced huge stimulus package of Rs.20 lakh crores,everybody expected that government would transfer cash into their accounts. But the scene is reversed and central was not announced any direct cash transfer them.The reason behind this is lack of data of migrant workers.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X