వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ స్త్రీ సంగతేమిటి: అపైర్లపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధాల విషయంలో వివాహితుడైన పురుషుడు మాత్రమే నేరస్థుడా అని అడిగింది. వివాహేతర సంబంధాల నేరాల్లో శిక్షలకు సంబంధించిన చట్టాన్ని సుప్రీంకోర్టు పునఃసమీక్షించాలని నిర్ణయించింది.

వివాహేతర సంబంధాల విషయంలో మహిళల భాగస్వామ్యం ఉన్నప్పటికీ పురుషులకు మాత్రమే శిక్ష పడుతోందన్న వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని పరిశీలించాలని నిర్ణయించింది.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 497 ఎవరైనా పర పురుషుడి భార్యతో, అతనికి తెలియకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది మానభంగం కాదని, అడల్టరీ అవుతుందని స్పష్టం చేస్తోంది. పక్కింటి పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకునే మహిళ సంగతేమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Why Only A Married Man Is Liable For Adultery, SC Asks

ఈ సెక్షన్‌ ప్రకారం పురుషులకు ఐదేళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దీని ప్రకారం మహిళలు కేవలం బాధితులు మాత్రమే. 157 ఏళ్ల క్రితం నాటి ఈ చట్టాన్ని సవరించాలనే అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన వాదన జరిగింది. అక్రమ సంబంధాల్లో మహిళలే బాధితులని చెప్పడం లింగ వివక్ష కాదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అడల్టరీ అంశంపై విస్తృత స్థాయిలో విచారణ చేపట్టింది. పాత చట్టాలు మహిళలకు, పురుషులకు సమానంగా లేవని స్పష్టం చేసింది. ఐపీసీ 497ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించాలని సుప్రీం అభిప్రాయపడింది.
దీనిపై నాలుగు వారాల్లోగా కేంద్రం వైఖరి తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టు నోటీసుకు నాలుగు వారాల్లో సమాధానం ఇచ్చే అవకాశం ఉంది.

English summary
The Supreme Court on Friday decided to examine a public interest litigation (PIL) challenging Section 497 (adultery law) of the Indian Penal Code (IPC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X