వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీకి తగలని పెద్ద నోటు రద్దు సెగ! ఎందుకంటే..

పాత నోట్ల రద్దు వల్ల ప్రధాని మోడీ పైన విమర్శలు ఎక్కువగా రావడం లేదు. అందుకు పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా దేశం కోసం ఈ నిర్ణయం అని చాలామంది భావిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంతో ఇబ్బందుల కారణంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీ నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు. అయితే ఇబ్బందుల నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి.

విమర్శలు వస్తున్నా.. ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పైన ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కావడం లేదని అంటున్నారు.

పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండెననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50, రూ.100 నోట్లు ఎక్కువగా తీసుకు వస్తే బాగుండునని, రూ.500 నోట్లు కూడా ఎక్కువగా విడుదల చేస్తే బాగుండునని అంటున్నారు.

 Why PM Modi has already won the demonetisation gambit?

పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల ముందు జనాలు క్యూలు కడుతున్నారు. జనాల వద్ద డబ్బు ఉన్నా, కావాల్సిన నోటు రూపంలో లేకపోవడం వల్ల ఓ విధంగా ఆర్ధిక సంక్షోభం తలెత్తింది.

దీంతో పాటు పలుచోట్ల క్యూల్లో వృద్ధులు మరణించారనీ, కొన్ని దుకాణ సముదాయాలు సంక్షోభంలో పడ్డాయని అంటున్నారు. దీంతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు ప్రధాని మోడీని మాత్రం బాధ్యులుగా చేయడం లేదు.

అలా ఆయన ముందుగానే ఈ మార్పు కోసం దేశాన్ని సిద్ధం చేశారని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కనుక వేసవిలో తీసుకుని ఉంటే మాత్రం హింసాత్మంగా కూడా మారేదని అంటున్నారు. ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజలు భావించడంతో, దీనిని వివాదం చేయడం వైరివర్గాలకు కూడా కష్టంగా మారిందని అంటున్నారు.

మీడియా కూడా పెద్దనోట్ల రద్దు తటస్థంగా ఉంది. అయితే ప్రజల ఇబ్బందులను మాత్రం చెబుతోంది. మీడియా కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలను కళ్లకు కట్టినట్టు ప్రజలకు చెబుతోంది. ప్రభుత్వం సైతం విస్తృతంగా ప్రచారం చేయడం కూడా వ్యతిరేకతను సద్దుమణిగేలా చేసిందని అంటున్నారు.

అందుకే ప్రభుత్వం నిర్ణయం కారణంగా తమకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ ప్రజలు సంయమనం పాటిస్తున్నారని చెబుతున్నారు. కొన్ని వర్గాలు మినహా ఎక్కువ మంది సాధారణ ప్రజలు పూర్తి మద్దతు పలుకుతున్నట్టుగా కనిపిస్తోంది.

English summary
Why PM Modi has already won the demonetisation gambit?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X