వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో డౌట్: గుజరాత్ పోరులో ఓడినా.. గెలిచినా రాహుల్‌దే పైచేయి

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల కోసం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భారీగా ఆశలు పెట్టుకున్నాయి. సోమవారం గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ బ్రాండ్ రాజకీయాల ల్యాబోరేటరీగా పేరొందిన 'గుజరాత్' అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇరు పక్షాలకు భారీగా ఆశలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి, దానికి సంస్థాగతంగా సవాల్‌ గట్టి సవాల్ విసిరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్‌మీడియాలోనూ, క్షేత్రస్థాయిలో విస్త్రుత ప్రచారం చేయడం ద్వారా శక్తి సామర్థ్యాలు ప్రదర్శించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు అధికార బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గట్టి సవాల్‌గా పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ నిలిచారు. కానీ ఈ నెల 12న ఎన్నికల ప్రచారం ముగిసే సరికి ప్రధాని నరేంద్రమోదీకి సరైన పోటీ ఇవ్వగల ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు తాను నిరూపించుకున్నారు.

రాహుల్ గాంధీ ప్రచార సరళితో కమలనాథుల్లో కలవరం మొదలైంది. ప్రారంభంలో వికాస్, గుజరాత్ మోడల్ తదితర అంశాలపై ప్రచారం సాగించిన ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చివరిదశకు వచ్చే సరికి సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తనను ఓడించేందుకు కుట్ర పన్నిందని, ఆ కుట్రలో పాకిస్థాన్ సాయం తీసుకున్నదని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు భాగస్వాములని గుజరాతీలను నమ్మించేందుకు ప్రయత్నించారు.

 రాహుల్‌ను పరిణతి గల నేతగా నిలిపిన గుజరాత్ ఎన్నికలు

రాహుల్‌ను పరిణతి గల నేతగా నిలిపిన గుజరాత్ ఎన్నికలు

ఒకవేళ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడంలో కాంగ్రెస్ విజయవంతమైతే అది ఖచ్చితంగా రాహుల్ గాంధీ సాధించిన చారిత్రక విజయమని చెప్పక తప్పదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అన్నీ తానై వ్యవహరించారు మరి. సమాజంలో వివిధ వర్గాల వారితో విస్తృత ప్రాతిపదికన మమేకం అయ్యారు. రైతులు, వ్యాపారులు, గిరిజనులతో ఇష్టాగోష్టిగా సమావేశమవుతూ వారి సమస్యలను లేవనెత్తారు. సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోదీని సవాల్ చేస్తూ రోజువారీగా ప్రశ్నలు సంధిస్తూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. ఏది ఏమైనా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పరిణతి సాధించిన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దింది. కాంగ్రెస్ పార్టీని ఆయన శక్తి, సామర్థ్యాలు మరింత బలోపేతం చేసే స్థాయికి చేరుకున్నారు.

 సౌరాష్ట్ర నార్త్ గుజరాత్‌ల్లో కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతుందా?

సౌరాష్ట్ర నార్త్ గుజరాత్‌ల్లో కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతుందా?

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందుతుందని ఆరోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్నా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగవుతుందని సంకేతాలిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం 2012 ఎన్నికల ఫలితాల కంటే మరిన్ని ఓట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఓట్లశాతంలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గల తేడా కూడా తగ్గుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 39 శాతం ఓట్లు పొందగా, బీజేపీకి అధికంగా తొమ్మిది శాతం ఓట్లు లభించాయి. ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి 42 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేశాయి. ఇది గత ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం పెరుగుదల. కానీ బీజేపీ ఓటింగ్ లో దాదాపుగా ఎటువంటి మార్పు లేదు. సుమారు 47 శాతం ఓట్లు కమలనాథులకు పడతాయిన అంచనా వేసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి లభించే ఓట్లకంటే ఐదు శాతం ఎక్కువ. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారమే సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో అధికార బీజేపీకంటే కాంగ్రెస్ పై చేయి సాధించినట్లు వార్తలొచ్చాయి. ఈ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా ఆ పార్టీకి సారథ్యం వహించగల సామర్థ్యం గల నేతగా రాహుల్ గాంధీ నిలిచారు.

కమలానికి ధీటుగా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం

కమలానికి ధీటుగా కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం

రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం అంటేనే గుజరాత్‌లో బీజేపీ నేతల్లో ఆందోళన పెంచింది. అధికార బీజేపీకి వ్యతిరేకంగా తొలిసారి ఒక్కమాటలో చెప్పాలంటే కమలనాథుల కంటే ఎక్కువగా, దూకుడుగా సోషల్ మీడియాలో బీజేపీపై విజయవంతంగా ఎదురు ప్రచారం చేయగలిగింది. అవిశ్రాంతంగా రాహుల్‌ ప్రచారాన్ని ఢీకొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రంలో 34 బహిరంగ సభల్లో పాల్గొనాల్సి వచ్చింది. ఆసుపత్రుల ప్రారంభంతో మొదలైన మోదీ ప్రచారం.. సబర్మతి నదిపై ఫెర్రీ సర్వీస్ ప్రారంభంతో సాగింది. ప్రధాని నరేంద్రమోదీ అంతకుముందు 12 సంవత్సరాల పాటు గుజరాత్ సీఎంగా పని చేశారు. గుజరాత్‌లో అభివ్రుద్ధి మోడల్‌కు ప్రధాని మోదీ ఒక ఆర్కిటెక్‌గా వ్యవహరించారు. ఇప్పటికీ సొంత పార్టీని, సొంత రాష్ట్రంలో బీజేపీని ఓటమి బారీ నుంచి తప్పించేందుకు నేరుగా తోటి గుజరాతీల మనస్సు చూరగొనేందుకు రంగంలోకి దిగారు.

ఇక బీజేపీ హిందుత్వ నినాదం వినియోగం ఇబ్బందే

ఇక బీజేపీ హిందుత్వ నినాదం వినియోగం ఇబ్బందే

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తరుచుగా రాహుల్ గాంధీ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయడంపై అధికార బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కానీ గుజరాత్ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల సందర్శనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రచారంలో భాగంగా కనీసం 27 దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారాయన. అదీ తానూ గుజరాతీలు క్షేమంగా ఉండాలని ప్రార్థించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించడం కమలనాథులను ఆత్మరక్షణలో పడేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ.. ‘బీజేపీ గేమ్‌ప్లాన్'ను ఎదుర్కోవడానికి వెనుకాడలేదు. హిందువులకు అనుకూల నాయకుడిగా అవతారం ఎత్తారు. దీనికి తోడు ఎన్నికల ప్రచారంలో ముస్లింల ఊసే ఎత్తలేదు. ఈ దఫా బహిరంగంగా ముస్లింల పట్ల బుజ్జగింపు ధోరణి ప్రదర్శించిన దాఖలాలు లేవు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకల్లా రాహుల్ గాంధీ తాను ఒక శివభక్తుడినని గుజరాతీలందరికీ.. దేశ ప్రజలందరికీ స్పష్టమైన సంకేతాలిచచారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేతలు గానీ, నెహ్రూ - గాంధీ కుటుంబ సభ్యులు గానీ బహిరంగంగా ఏనాడూ ఇలాంటి వ్యూహం అమలు చేయలేదు. రాహుల్ తన వ్యూహాత్మక వైఖరితో ఇక మున్ముందు హిందుత్వకు వారసులమని బీజేపీ చెప్పుకునే అవకాశాలే లేకుండా చేశారు.

అందుకు భిన్నంగా ప్రేమతో గెలుస్తామని రాహుల్ సవాల్

అందుకు భిన్నంగా ప్రేమతో గెలుస్తామని రాహుల్ సవాల్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (ఎన్నికల ప్రచారం నాటికి పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు)పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దారుణరీతిలో వ్యక్తిగత వ్యతిరేక ప్రచారం చేసేందుకు వెనుకాడలేదు. నెహ్రూ - గాంధీ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పరోక్షనిందల ద్వారా దాడి చేయడానికి ప్రాధాన్యం ఎత్తేశారు. కానీ రాహుల్ గాంధీ పరోక్ష నిందలతో కూడిన ప్రచారానికి దూరంగా ఉన్నారు. ‘వికాస్ వ్యతిరేక' ప్రచారానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ‘నేను వికాస్' అన్న ప్రధాని మోదీ ప్రచారానికి ధీటుగా రాహుల్ గాంధీ ‘వికాస్ ఒక పిచ్చిగా మారింది' అని చేసిన ప్రచారానికి భారీగా ఆదరణ లభించింది. ప్రధాని మోదీతోపాటు కమలనాథులపై వ్యక్తిగత దాడులు చేయబోనని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారం చివరి దశలో ప్రధాని నరేంద్రమోదీపై మణిశంకర్ అయ్యర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై ఏమాత్రం ప్రతికూల ప్రభావం చూపకుండా తక్షణం నిర్ణయాలు తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీతో అనుబంధం గల మణిశంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆగమేఘాలపై సస్పెండ్ చేసేందుకు వెనుకాడలేదు. తద్వారా సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీలో నూతన నియమావళి అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు రాహుల్ గాంధీ.

 మూడు విభిన్న వర్గాల నేతల మధ్య అంగీకారంలో కీలకం

మూడు విభిన్న వర్గాల నేతల మధ్య అంగీకారంలో కీలకం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రాహుల్ గాంధీ.. సర్దుబాటు తత్వాన్ని అలవాటు చేసిన నేతగా అవతరించారు. గుజరాత్ రాష్ట్రంలో పరస్పరం విభిన్నమైన సామాజిక వర్గాలను ఏకతాటిపైకి తేగలిగారు. దళిత హక్కుల నాయకుడు జిగ్నేశ్ మేవానీ, ఓబీసీ హక్కుల పరిరక్షణ నేత అల్పేశ్ ఠాకూర్‌లతోపాటు పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ మధ్య విస్త్రుత ప్రాతిపదికన ఐక్యత రూపొందించారు. ఓబీసీ కోటాలో పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆందోళనకు హార్దిక్ పటేల్ శ్రీకారం చుడితే.. దాన్ని వ్యతిరేకిస్తూ అల్పేశ్ ఠాకూర్ ఓబీసీల హక్కుల పరిరక్షణ ఉద్యమానికి సారథ్యం వహించారు.గుజరాత్ రాష్ట్రంలో దళితులు, పాటిదార్లు పరస్పరం వ్యతిరేకులు. గుజరాత్‌లో వారిని ఐక్యం చేయగలిగారు. వారిని ఏకతాటిపైకి తేవడంతోపాటు అల్పేశ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. జిగ్నేశ్ మేవానీకి వ్యతిరేకంగా అభ్యర్థిగా నిలబెట్టకుండా జాగ్రత్త వహించారు. కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీకి అసలు సిసలు వారసుడిగా ముందుకు రావడంతోపపాటు విపక్షాలన్నింటిని ఐక్యంగా నిలిపే సామర్థ్యం గల నేతగా నిలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి సరైన ప్రత్యర్థిగా రుజువు చేసుకున్నారు రాహుల్ గాంధీ.

English summary
The ruling BJP and a hopeful Congress are anxiously waiting for December 18, when the votes will be counted in both Gujarat and Himachal Pradesh. Stakes are high in Gujarat simply because it has been a result-oriented laboratory of BJP brand of politics for over two decades.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X