వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘‘నేనెందుకు దాక్కోవాలి.. వాళ్లే సిగ్గుపడాలి.. బేటీ బాచావో అంటూనే..’’

హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా, అతని స్నేహితుడు అశీష్‌ల అకృత్యాన్ని ఎండగడుతూ ఐఎఎస్ అధికారి కుమార్తె వర్ణిక మీడియా ముందుకు వచ్చింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా, అతని స్నేహితుడు అశీష్‌ల అకృత్యాన్ని ఎండగడుతూ ఐఎఎస్ అధికారి కుమార్తె వర్ణిక మీడియా ముందుకు వచ్చింది.

రేప్ నుండి తప్పించుకొన్నా, కానీ, సామాన్యురాలినైతే..రేప్ నుండి తప్పించుకొన్నా, కానీ, సామాన్యురాలినైతే..

బరాలా కుమారునికి శిక్ష పడేంత వరకూ పోరాడతానని ప్రకటించింది. బాధితురాలు మీడియాకు దూరంగా ఉన్నారనే వార్తలు వచ్చిన నేపధ్యంలో ఆమె మీడియా ఎదుటపడి మాట్లాడింది.

"Why Should I hide.. They should feel ashamed.."

'నేనెందుకు దాక్కోవాలి.. వాళ్లే సిగ్గుపడాలి' అని వ్యాఖ్యానించింది. 'బేటీ బచావో' అనే నినాదాన్ని పలుకుతూ వాళ్లు ఒక ఆడ కూతురికి అన్యాయం తలపెట్టారు..' అని వర్ణిక వ్యాఖ్యానించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుశ్చర్యను ఆమె మీడియా ముందుంచింది.

ఈ ఘటన చండీగఢ్ లో జరిగిందని... సమయానికి వచ్చి కాపాడిన పోలీసులకు ధన్యవాదాలని చెప్పింది. ఇదే ఘటన ఏదైనా గ్రామంలో జరిగి ఉంటే తాను బతికి ఉండేదాన్ని కాదని ఆందోళన వ్యక్తం చేసింది.

ఐఎఎస్ అధికారి అయిన వర్ణిక తండ్రి మీడియా ముందుకు రాకపోయినప్పటికీ, తాను తన కుమార్తెకు అండగా ఉంటానని, నిందితులకు శిక్షపడే వరకూ నిద్రపోనని తెలిపారు. బాధితురాలు దీనిపై మాట్లాడుతూ తన తల్లిదండ్రుల సాయంతో న్యాయపోరాటం కొనసాగిస్తానని పేర్కొంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తనకు విపరీతమైన మద్దతు లభిస్తున్నదని, ఏదో ఒక రోజు నిందితులకు శిక్షపడుతుందనే నమ్మకం వ్యక్తం చేసింది.

గూగుల్‌లో ట్రెండింగ్...

హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాస్ బరాలా కుమారుడు... ఐఎఎస్ అధికారి కుమార్తెపై సాగించిన దుశ్చర్య సంఘటన సంచలనంగా మారింది. బాధితురాలి పేరు తెలుసుకునేందుకు ఆదివారం నెటిజన్లు విపరీతంగా ప్రయత్నించారు.

దీని గురించి వివిధ సోషల్ వెబ్ సైట్‌లలో వచ్చిన కథనాల కోసం లక్షల మంది నెటిజన్లు ఆసక్తికరంగా వెతికారు. దీంతో కొన్ని గంటలపాటు ఇది టాప్ 10 వార్తల జాబితాలో నిలిచింది.

English summary
A day after a senior BJP politician’s son and his friend were arrested and later released on bail for stalking DJ Varnika Kundu in Chandigarh at midnight, the politician’s family is resorting to victim shaming on social media. In her complaint, Varnika accused Vikas Barala, son of Haryana BJP chief Subhash Barala, and his friend Ashish Kumar of stalking her through the streets of the city. In a Facebook post, that has now been deleted, a member of the Barala family, Kuldeep Barala – who also describes himself as having “worked at Bharatiya Janata party” – shared a photo of the victim with two men and implied that she was drunk at the time of the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X