వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిదే ..? ఎన్నికల షెడ్యూల్ ఆలస్యంపై ఈసీ ..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ పై ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. వాస్తవానికి ఈ సమయంలో షెడ్యూల్ విడుదల చేయాలి. కానీ మోదీ ఎన్నికల హామీ కోసం .. ఆయన పర్యటన ముగించేవరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ ఆలస్యానికి గల కారణం ఈసీ వివరిస్తోంది.

జమ్ము బస్టాండ్ లో పేలుడు .. ఒకరు మృతి, 29 మందికి గాయాలుజమ్ము బస్టాండ్ లో పేలుడు .. ఒకరు మృతి, 29 మందికి గాయాలు

 సొంత ప్రణాళికతో ముందుకు ..

సొంత ప్రణాళికతో ముందుకు ..

వివక్షాల ఆరోపణలతో ఈసీ స్పందించింది. ఎన్నికల తేదీ సమయం ప్రకటించేందుకు ఇంకా సమయం ఉంది. కానీ కొన్ని పార్టీలు ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం చెప్పినట్టు ఓ వార్తాసంస్థ పేర్కొన్నది. 'మేం ప్రధానమంత్రి షెడ్యూల్ ను పర్యవేక్షించడం లేదు, ఎన్నికలకు సంబంధించి మాకు సొంతంగా ప్రణాళిక ఉంది అని ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఎన్నికల్లో మార్చి 5 షెడ్యూల్ విడుదల చేశారని ప్రశ్నిస్తే .. ఎన్నికల సన్నాహాల పనుల్లో ఉన్నామని .. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలంటే ... పూర్తి ప్రణాళికతో ఉండాలి కదా అని ఉదహరించారు.

ఆలస్యం ఎందుకు ?

ఆలస్యం ఎందుకు ?

ఇదివరకు గుజరాత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పథకాలను ప్రవేశపెట్టారని .. ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరిస్తున్నారని విమర్శిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలను అధికార బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని .. తిరిగి అధికారం చేపట్టేందుకు చివరి క్షణంలో పర్యటనలు, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ట్వీట్ చేశారు. 'ఎన్నికల సంఘం ప్రధానమంత్రి అధికార కార్యక్రమాల కోసం ఎదురుచూస్తుంది .. వాటి పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత‘ .. పర్యటన ముగిసిన అనంతరం తీరిగ్గా షెడ్యూల్ విడుదల చేస్తుందని మార్చి 4న ట్వీట్ చేశారు. గత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఒకరోజు ముందు కాంగ్రెస్ నేత ట్వీట్ చేసి .. అధికార బీజేపీని విమర్శించారు.

 కారణం ఏంటంటే

కారణం ఏంటంటే

గత లోక్ సభ మే 31 లోపు కొలువుదీరాలి .. అందుకే మార్చి 5న షెడ్యూల్ విడుదల చేశాం. ఇప్పుడు అది జూన్ 3 మారినందున .. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎక్కువ సమయం ఉందని ఈసీ అధికారులు గుర్తుచేస్తున్నారు. దీంతోపాటు అన్ని రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కసరత్తు జరుగుతోందని చెప్పారు. ఇటు కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోన్నందున ... ఇటీవల ఈసీ బృందం సందర్శించిందని చెప్పారు.

English summary
There is enough time to announce election dates and the allegations of deliberate delay by some political parties are unwarranted, sources in the Election Commission told NDTV on Wednesday. "We don't operate as per PM's schedule, we have our own schedule," a senior official of the Election Commission told NDTV. For the 2014 national elections, the election dates were announced on March 5. Taking note of that, opposition parties have accused the Commission of deliberate delay to ensure that government can announce a series of programmes and welfare measures that would not be possible once the model code of conduct comes into effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X