వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎన్ఎక్స్ మీడీయా కేసు ఏమిటి... చిదంబరం పాత్ర ఎంత.... ?

|
Google Oneindia TeluguNews

మాజీ ఆర్ధిక మంత్రి పీ చిదంబరం ఎదుర్కోంటున్న ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లి హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రిం కోర్టును ఆశ్రయించేందుకు సిద్దమయ్యారు. దీంతో కేసును అత్యవసరంగా వాదనలు చేపట్టాలని కోరనున్నారు.. ముందస్తు బెయిలుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చిదంబరంను ప్రశ్నించేందుకు వీలుగా ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ఇప్పటికే కోరింది.

కాగా ఈ కేసుకు సంబందించి, కీలక పాత్రదారిగా ఉన్న కార్తి చిదంబరాన్ని సైతం సిబిఐ అరెస్ట్ చేసింది. అనంతరం కార్తి చిదంబరం బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఐఎన్ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంలో చిదంబరం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి.

అసలు కేసు ఏమిటి

అసలు కేసు ఏమిటి

ఐఎన్ఎక్స్ మీడియా సంస్థను 2007లో ప్రముఖ మీడియా దిగ్గజం పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ప్రారంభించారు. అయితే మిడీయా రంగలో విదేశీ పరోక్ష పెట్టుబడులు స్వీకరించేందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) ఆమోదం తెలిపింది. కాని ఐఎన్ఎక్స్ కంపెనీ ఐటి శాఖ కళ్లుగప్పి ఏకంగా రూ.305 కోట్లను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా తెచ్చుకొంది. అయితే ఈ వ్యవహారంలో ఫిర్యాదు అందుకొన్న ఆదాయపన్ను శాఖ దర్యాప్తు బృందం ఎఫ్ఐపీబీ నుంచి వివరణ తీసుకొంది. ఈనేపథ్యంలోనే ఆ సంస్థలోకి 305 కోట్లు వచ్చి చేరాయని సిబిఐ సైతం గుర్తించింది.

మధ్యవర్తిత్వం కోసం కార్తీకి మూడు కోట్లు

మధ్యవర్తిత్వం కోసం కార్తీకి మూడు కోట్లు

ఈ నేపథ్యంలోనే తమ తప్పులు బయటపడి ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని భావించిన ఐఎన్ఎక్స్ సంస్థ ప్రతినిధులు, ఐటీ శాఖ చేపట్టబోయో చర్యల నుంచి బయట పడేందుకు చిదంబరం కొడుకు కార్తీ చిదంబరాన్ని కలిశారు. దీంతో ఎఫ్ఐపీబీలోని అధికారులను ప్రభావితం చేసి సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని వారు కార్తీని కోరినట్లు సీబీఐ ఆరోపణలు చేస్తోంది. కాగా ఇందుకోసం కార్తీ చిదంబరం తమ దగ్గర రూ.3 కోట్లు తీసుకొని, ఆ డబ్బును తన కంపెనీలోకి అక్రమ మార్గంలో మళ్లించుకున్నాడని పీటర్, ఇంద్రాణి సీబీఐకి తెలిపినట్లు పలు వార్తలు వెలువడ్డాయి.ఇవి కాకుండా మరిన్ని డబ్బులు కూడ ఆయన కన్సల్టెన్సి ఫీజుగా తీసుకున్నట్టు సీబిఐ ఆరోపిస్తోంది. దీంతో తండ్రి ఆర్థిక మంత్రి కావడంతో ఎఫ్ఐపీబీలోని అధికారులను ప్రభావితం చేశారని సిబిఐ చెబుతోంది. ఇందుకు అనుగుణంగానే ఎఫ్ఐపీబీ అధికారులు కోత్తగా మరోసారి పెట్టుబడుల కోసం అనుమతి తీసుకోవాలని అధికారులు సలహ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్న రెవెన్యూ శాఖ ఆదేశాన్ని ఎఫ్ఐపీబీ అధికారులు పెడచెవిన పెట్టారు.

 కార్తీ పై 2017లో కేసు, అరెస్ట్,

కార్తీ పై 2017లో కేసు, అరెస్ట్,

దీంతో రంగంలోకి దిగిన సిబిఐ 2017లో కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది. దీంతో 2018 ఫిబ్రవరి 28న ఆయనను అరెస్ట్ చేసింది. అయితే కార్తీ మూడు కోట్ల రుపాయాల డిపాజిట్ చేసి బెయిల్ పై విడుదలై బయటికొచ్చారు. కేసు విచారణలో భాగంగా ఈడీ చిదంబరంపై 2018 నవంబర్‌లో చార్జీషీటు ధాఖలు చేసింది. ఆయన్ను ప్రధాన నిందితునిగా పేర్కోనడంతో పాటు మరో 9మందిపై కేసులు నమోదు చేసింది. ఇక అప్పటి నుండి కేసుపై వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే చిదంబరం ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో పలు సార్లు అరెస్ట్ కాకుండా కోర్టుల్ వాజ్యాలు వేశాడు.

బెయిల్ పై ఢిల్లీ హై కోర్టులో వాదనలు

బెయిల్ పై ఢిల్లీ హై కోర్టులో వాదనలు

ఈ నేపథ్యంలనే ఈ కేసుల్లో చిదంబరానికి దిల్లీ హైకోర్టులో పలుసార్లు తాత్కాలిక ఊరట కల్పించింది. గత జనవరి 15 వరకు ఆయనను అరెస్టు చేయకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి జనవరి 25న చిదంబరం అరెస్ట్‌పై వాదనలు జరిగాయి. అటు సిబిఐ గాని, ఈడీగాని చిదంబరం తమ కస్టడికి ఇవ్వాలని కోర్టును కోరాయి. అయితే వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. నేడు బెయిల్‌పై తీర్పును వెలువరించిన ఢిల్లీ హైకోర్టు చిదంబరం పెట్టుకున్న పిటిషన్లు తిరస్కరిస్తూ ముందస్తు బెయిల్ నిరాకరించింది. మరోవైపు అరెస్ట్‌కు మూడు రోజుల ముందు అప్పిల్ చేయడానికి అవకాశం ఇవ్వాలన్న పిటిషన్ పై కోర్టు స్పందించలేదు.

English summary
n 2007, the Central Bureau of Investigation (CBI) had registered an FIR alleging irregularities in the Foreign Investment Promotion Board (FIPB) clearance given to INX Media to the tune of Rs 305 crore in 2007 when Chidambaram was the Union finance minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X