వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో రాష్ట్ర్రపతి పాలన విధిస్తారా...? గవర్నర్ త్రిపాఠీ, మోడీ, అమిత్ షాలను కలవడం వెనుక అంతర్యం

|
Google Oneindia TeluguNews

బెంగాల్ గవర్నర్ కేశరీ నాథ్ త్రిపాఠి ప్రధానమంత్రి మోడీ,హోంశాఖ మంత్రి అమిత్ షాలను ఎందుకు కలిశాడు ?..బెంగాల్ లో రాష్ట్ర్రపతి పాలన విధిస్తారా...పార్లమెంట్ ఎన్నికల తర్వాత బెంగాల్లో ఏం జరుగుతుంది...గవర్నర్ త్రిపాఠి కేంద్రానికి ఏం నివేదిక ఇచ్చాడు..శనివారం జరిగిన అల్లర్ల నేపథ్యంలోనే కేంద్రం పావులు కదుపుతుందా... బెంగాల్లో జరిగే అల్లర్లపై కేంద్రహోంశాఖ వివరణ కొరిన తర్వాతి రోజే గవర్నర్ నివేదిక ఇవ్వడం వెనుక అంతర్యం ఏమిటి...

పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రారంభమైన ఘర్షణలు

పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రారంభమైన ఘర్షణలు

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర్రంలో గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ, త‌ృణముల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఘర్షణల్లో అటు బీజేపీ, ఇటు తృణముల్ కార్యకర్తలు మృత్యువాత పడుతున్నారు. దీంతోపాటు రాష్ట్ర్ర రాజకీయాల్లో కూడ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే మమతా సర్కార్ బీజేపీపై ఫైర్ అవుతుంది. రాష్ట్ర్రంలో రాజకీయ కుట్రలకు బీజేపీ తెరలేపుతుందని ఆమే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. దీంతో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఆమే మండిపడుతోంది.

తాజగా జరిగిన అల్లర్లో 8మంది మృతి

తాజగా జరిగిన అల్లర్లో 8మంది మృతి

ఇందుకు అనుగుణంగానే తాజగా బెంగాల్‌ రాష్ట్ర్రంలో శనివారం ఉత్తర 24 పరగణ జిల్లాలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.దీంతో బీజేపీకి చెందిన నలుగురు తృణముల్ పార్టీకి చెందిన మరో ముగ్గ్రురు కూడ మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్ర్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు సోమవారం బ్లాక్‌డే ను పాటిస్తూ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు.

దీంతో అక్కడ మరింత ఉద్రిక్తలు నెలకోన్నాయి.అయితే మమత మాత్రం ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మృతి చెందితే బీజేపీ అయిదుగురు కార్యకర్తలు చనిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందని ఆమే మండిపడ్డారు.

బెంగాల్ పరిణామాలపై క్షుణ్ణంగా పరీశీలిస్తున్న కేంద్రం

బెంగాల్ పరిణామాలపై క్షుణ్ణంగా పరీశీలిస్తున్న కేంద్రం

దీంతో బెంగాల్లో అటు బీజేపీ ఇటు తృణముల్ కాంగ్రెస్ పార్టీలు తమ పట్టు సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మమత సర్కార్ బీజేపీని ఎదుర్కోనేందుకు నేరుగా రంగంలోకి దిగింది. ఆ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటుంది. ఈనేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలు ఆక్రమించుకున్న కార్యాలయాలకు ఆమే స్వతహగా సందర్శించి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ఇక బీజేపీ కూడ బెంగాల్‌లో పావులు కదుపుతుంది. ఇందుకోసం శనివారం జరిగిన అల్లర్లపై రాష్ట్ర్ర హోంశాఖ నేరుగా స్పందించి రాష్ట్ర్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది.అనంతరమే గవర్నర్ నివేదిక కోరింది.ఇందులో భాగంగానే గవర్నర్ త్రిపాఠి నివేదికను అందించారు. సాధరణంగా గవర్నర్లు హోంశాఖ మంత్రులను, అధికారులను కలసి నివేదికను ఇస్తారు,కాని బెంగాల్ అల్లర్లపై మోడీ కూడ దృష్టి సారించడంతో ఆయన్ను కూడ గవర్నర్ కలిశాడు.

2021లో బెంగాల్ ఎన్నికలు...

2021లో బెంగాల్ ఎన్నికలు...

దీంతో బెంగాల్లో రాష్ట్ర్రపతి పాలనను విధించేందుకు కేంద్రం పావులు కదుపుతుందా అనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. కాగా బెంగాల్ లో 2021వరకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. దీంతో మరో రెండు సంవత్సరాలు సమయం ఉంది.ఇలాంటీ నేపథ్యంలో గవర్నర్ పాలనకు అవకాశం ఉంటుందా అనేది వేచిచూడాలి. కాగా బెంగాల్‌లో గత సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 42 ఎంపీ స్థానాలకు గాను 17 స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే...దీంతో అక్కడ పాగ వేసేందుకు బీజేపీ స్కెచ్ వేస్తుంది.

English summary
West Bengal Governor Keshari Nath Tripathi met Prime Minister Narendra Modi and Home Minister Amit Shah in the national capital on Monday and apprised the duo of the situation in the state where post-poll clashes have claimed three lives so far
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X