వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంల హ్యకింగ్ ఆరోపణలు: సూరత్ కౌంటింగ్ సెంటర్ల వద్ద వైఫై సేవల నిలిపివేత

By Narsimha
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టనున్నారనే విషయం కొద్ది గంటల్లోనే తేలనుంది. అయితే అదే సమయంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించిన ఈశీఎంలను హ్యాకింగ్ చేసే అవకాశం ఉందని పాటీదార్ల నేత హర్ధిక్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కౌంటింగ్ సెంటర్ల వద్ద వైఫై సేవలను నిలిపివేశారు.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెైస్, బిజెపి ల మధ్య హోరా హోరా పోరు సాగింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

అయితే గుజరాత్ రాష్ట్రంలో ఈ దఫా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శాయశక్తులను ఒడ్డింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించక ముందే రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్రంలో సుమారు 4 మాసాల పాటు ప్రచారం నిర్వహించారు.

కౌంటింగ్ సెంటర్ల వద్ద వైఫై సేవల నిలిపివేత

కౌంటింగ్ సెంటర్ల వద్ద వైఫై సేవల నిలిపివేత

కౌంటింగ్ సెంటర్ల వద్ద వైఫై సేవలను నిలిపివేయాలని ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈవీఎంలను హ్యకింగ్ చేసే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సెంటర్ల వద్ద వైఫై సేవలను నిలిపివేశారు

ఈవీఎంల హ్యకింగ్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

ఈవీఎంల హ్యకింగ్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను హ్యాకింగ్‌ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్‌ అభ్యర్థి చేసిన ఫిర్యాదు మేరకు సూరత్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద వైఫై సేవల్ని నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇదే రకమైన అనుమానాల్ని పటీదార్ల ఉద్యమ నేత హర్దిక్ పటేల్ కూడ వ్యక్తం చేశారు.

అందుకే వైపై సేవల నిలిపివేత

అందుకే వైపై సేవల నిలిపివేత

వైఫైతో ఈవీఎంలను తారుమారు చేసే అవకాశమే లేదనీ, అయినా అనుమానాల్ని తొలగించడం కోసం ఆ సేవల్ని నిలిపివేయాల్సిందిగా ఆదేశించామని కలెక్టర్‌ మహేంద్ర పటేల్‌ తెలిపారు.

ఈవీఎంల హ్యకింగ్ కోసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు

ఈవీఎంల హ్యకింగ్ కోసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు

హ్మదాబాద్‌కు చెందిన 150 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు దాదాపు 5 వేల ఈవీఎంలను హ్యాక్‌ చేయబోతున్నారని పాటీదార్‌ రిజర్వేషన్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ ట్విటర్లో ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈవీఎంల హ్యకింగ్‌పై అనుమానాలను వ్యక్తం చేశారు. ఈవీఎంల హ్యాకింగ్ జరగకపోతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
The Wi-Fi service at a college in Surat was suspended after the Congress candidate from the Kamrej Assembly seat complained of possible hacking and tampering with the electronic voting machines (EVMs), used in the recently held Gujarat Assembly polls, kept on its campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X