వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cyclonic circulations: తెలంగాణకు భారీ వర్ష సూచన: కోస్తా కర్ణాటక సహా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లో పలుచోట్ల వచ్చే 72 గంటల్లో ఎండ తీవ్రత కాస్తంత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు పడటానికి ఆస్కారం ఉంది. మధ్యప్రదేశ్, తీర ప్రాంతం (కొమొరిన్ ఏరియా)లో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం వల్ల కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ తుఫాన్ తరహా వాతావరణం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొన్నారు.

ఉలిక్కిపడ్డ విశాఖపట్నం: భారీ అగ్నిప్రమాదం: అలముకున్న పొగ: దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరిఉలిక్కిపడ్డ విశాఖపట్నం: భారీ అగ్నిప్రమాదం: అలముకున్న పొగ: దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి

ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకుని, మధ్యప్రదేశ్‌ గగనతలంపై సైక్లోనిక్ సర్కులేషన్ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఇది మరింత విస్తరించే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని ప్రభావంతో కేరళలో సోమవారం నాడు 80 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దక్షిణాదిలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడొచ్చని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి కేరళ, కర్ణాటక, తెలంగాణల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని అన్నారు. కేరళ, కర్ణాటకల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. అలాగే- పశ్చిమ రాష్ట్రాల్లో వేడి గాలుల తీవ్రత కొనసాగుతుందని అన్నారు.

 widespread rainfall including coastal and southern interior Karnataka and Telangana

Recommended Video

Innovative Auto Driver Jakkaiah Growing Plants In Auto

కోస్తా పశ్చిమ తీరప్రాంతాలైన సౌరాష్ట్ర, కఛ్, కొంకణ్, గోవాల్లో వేడి గాలుల ఉధృతి సాధారణం కంటే అధికంగా ఉంటుందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుందని వివరించారు. హిమాలయన్ రేంజ్‌ పరిధిలోని హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, లఢక్‌లల్లో సోమవారం నుంచి 15వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కోస్తా కర్ణఆటక, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఇదే తరహా వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతం, తెలంగాణ, గోవా, లక్షద్వీప్‌లల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొన్నారు.

English summary
Fairly widespread rainfall with isolated heavy rains of up to 80 mm is likely in Kerala on Monday with possible risks of flooding and inundation. Cyclonic circulations over Madhya Pradesh and Comorin area is the cause for rainfall including coastal and southern interior Karnataka and Telangana till April 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X