Wife: భర్త ఇంట్లో శవమైన భార్య, ఆధోని ప్రియుడు చంపేశాడని రివర్స్ కేసు, పక్కింటి పెళ్లికాని కుర్రాడితో !
బెంగళూరు/బళ్లారి/ఆధోని: పెళ్లి వయసుకు వచ్చిన యువతికి వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో పక్క రాష్ట్రంలో ఉంటున్న యువకుడితో అమ్మాయి పెళ్లి చేస్తే ఆమె జీవితాంతం సుఖంగా ఉంటుందని బంధువులు సూచించారు. ఆంధ్రా అమ్మాయి, కర్ణాటక అబ్బాయికి వివాహం జరిగింది. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్త ఇంటికి చేరుకుని అతనితో కాపురం చేస్తోంది. పండుగలు, శుభకార్యాలు, బంధువుల కోసం అంటూ భార్య ఆమె పుట్టింటికి వెళ్లి వస్తోంది. అప్పుడప్పుడు భర్త కూడా అతని భార్య పుట్టింటికి వెళ్లి వస్తున్నాడు. అయితే భర్త ఇంట్లో వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. మా కూతురిని అల్లుడు, అతని కుటుంబ సభ్యులు చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రాలోని పుట్టింటి దగ్గర ఉన్న ప్రియుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని, అదే విషయంలో ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైయ్యిందని భర్త, అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రియురాలు అనుమానాస్పద స్థితిలో శవమైన తరువాత ఆమె కంటే వయసులో చిన్నవాడైన ఆమె ప్రియుడు మాయం అయ్యాడని పోలీసులు అంటున్నారు.
IT
HUB:
శివరాత్రి
రోజు
సినిమా
చూపించిన
కాంగ్రెస్,
భారీ
ట్రాఫిక్
దెబ్బతో
ప్రజలు
హడల్,
పండుగ
రోజు
!

పెళ్లిసంబంధాలు చూసిన పెద్దలు
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని ఆధోనిలో సునితా (25) అనే యువతి నివాసం ఉంటున్నది. పెళ్లి వయసుకు వచ్చిన సునితాకు వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. సునితాకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో కర్ణాటకలోని బళ్లారి నగరంలోని హంద్రాళ కాలనీలోని డీసీ క్యాంపులో నివాసం ఉంటున్న సురేష్ అనే యువకుడితో సునితా పెళ్లి చేస్తే ఆమె జీవితాంతం సుఖంగా ఉంటుందని బంధువులు సూచించారు.

ఆంధ్రా అమ్మాయి.... కర్ణాటక అబ్బాయి
ఐదు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో సురేష్, సునితాల వివాహం గ్రాండ్ గా జరిగిందని తెలిసింది. వివాహం చేసుకున్న సునితా ఆమె భర్త సురేష్ నివాసం ఉంటున్న బళ్లారిలోని ఇంటికి చేరుకుని అతనితో కాపురం చేస్తోంది. పండుగలు, శుభకార్యాలు, బంధువుల కోసం అంటూ సునితా ఆధోనిలోని ఆమె పుట్టింటికి వెళ్లి వస్తోంది. అప్పుడప్పుడు సురేష్ కూడా అధోనిలోని అతని భార్య సునితా పుట్టింటికి వెళ్లి వస్తున్నాడు.

భర్త ఇంట్లో శవమైన మహిళ
భర్త సురేష్ ఇంట్లో ఉంటున్న సునితా కొన్ని రోజుల నుంచి అదోరకంగా ఉంటోందని తెలిసింది. ఇదే సమయంలో భర్త సురేష్ ఇంట్లో సునితా అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. సునితా గొంతును తాడుతో బిగించిన స్థితిలో శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు
భర్త
సురేష్
ఇంట్లో
వివాహిత
మహిళ
సునితా
అనుమానాస్పద
స్థితిలో
శవమై
కనిపించడం
కలకలం
రేపింది.
మా
కూతురు
సునితాను
అల్లుడు
సురేష్,
అతని
కుటుంబ
సభ్యులు
చంపేశారని
ఆమె
కుటుంబ
సభ్యులు
ఆరోపిస్తున్నారు.
ఆంధ్రాలోని
ఆధోనిలో
పుట్టింటి
దగ్గర
ఉన్న
ప్రియుడు
మూర్తితో
సునితా
అక్రమ
సంబంధం
పెట్టుకుందని
సురేష్
తో
పాటు
అతని
కుటుంబ
సభ్యులు
ఆరోపిస్తున్నారు.

ప్రియుడితో లేచిపోవాలని స్కెచ్ ?
ఆధోనిలో పక్కపక్క ఇళ్లల్లో సునితా, మూర్తి నివాసం ఉంటున్నారు. సునితా కంటే మూర్తి వయసులో మూడు సంవత్సరాలు చిన్నవాడని, తన భర్త సురేష్ కు దూరంగా తనను పిలుచుకుని వెళ్లిపోవాలని సునితా ఆమె ప్రియుడు మూర్తి మీద ఒత్తిడి చేసిందని, ఇదే విషయంలో ఇద్దరి మద్య గొడవలు ఎక్కువ అయ్యాయని ఆమె భర్త సురేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రియుడు చంపేశాడని ఆరోపణలు
ఇదే విషయంలో సునితా ఆమె ప్రియుడు మూర్తి చేతిలో హత్యకు గురైయ్యిందని భర్త సురేష్, అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సునితా కుటుంబ సభ్యులు, సురేష్ కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడంతో బళ్లారిలోని ఏపీఎంసీ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రియురాలు సునితా అనుమానాస్పద స్థితిలో శవమైన తరువాత ఆమె కంటే వయసులో చిన్నవాడైన ఆమె స్నేహితుడు మూర్తి మాయం అయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని బళ్లారి పోలీసులు అంటున్నారు.