
Wife: భర్తకు హ్యాండ్ ఇచ్చి పుట్టింటిలో మకాం వేసిన భార్య, మరదలిని లేపుకుపోయిన భర్త, మతిపోయింది !
పాట్నా/బీహార్: కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్న సమయంలో ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలతో కలిసి దంపతులు సంతోషంగానే ఉన్నారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త తీరుతో అతని భార్య విసిగిపోయింది. కొన్ని నెలల క్రితం భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి పిలుచుకుని రావాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే పుట్టింటి దగ్గరే బాగుంది అనుకున్న భార్య నేను నీతో రాను అని భర్తకు తేల్చి చెప్పింది. భార్య పోతేపోయింది అంటూ భర్త అతని మేనత్తకూతురిని లేపుకుని వెళ్లిపోయాడు. నా కూతురిని కిడ్నాప్ చేశాడు అంటూ మేనల్లుడి మీద అమ్మాయి తండ్రి కేసు పెట్టాడు. పోలీసులు అత్తకూతురిని లేపుకుపోయిన యువకుడిని పట్టుకున్నారు. అయితే తనకు బాల్య వివాహం చెయ్యాలని తన తల్లిదండ్రులు ప్రయత్నించారని, తనను తన బావ రక్షించాడని అమ్మాయి ఆమె తల్లిదండ్రుల మీద రివర్స్ కేసు పెట్టింది. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, అమ్మాయి మైనర్ కావడంతో పోలీసులకు మతిపోవడంతో పై పోలీసు అధికారులు ఎంట్రీ ఇచ్చారు.

సంతోషంగా పెళ్లి చేసుకున్నారు
బీహార్ లోని ఛప్రా జిల్లాలోని గ్రామంలో క్రిష్ణరామ్ అలియాస్ రామ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 12 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన సంకాతి దేవి అలియాస్ దేవి అనే యువతిని క్రిష్ణరామ్ వివాహం చేసుకున్నాడు. క్రిష్ణరామ్ అతని భార్య దేవితో సంతోషంగా కాపురం చేశాడు. క్రిష్ణరామ్, దేవి దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్న సమయంలో ఇద్దరు పిల్లలు పుట్టారు.

భర్తకు హ్యాండ్ ఇచ్చి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
పిల్లలతో కలిసి క్రిష్ణరామ్, దేవి దంపతులు చాలా సంతోషంగానే ఉన్నారు. రానురాను క్రిష్ణరామ్, దేవి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త క్రిష్ణరామ్ తీరుతో అతని భార్య దేవి విసిగిపోయింది. కొన్ని నెలల క్రితం దేవి ఆమె భర్త క్రిష్ణరామ్ తో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్య కాపురానికి రాలేదని మరదలితో ఎస్కేప్
భార్య దేవి ఇంటికి పిలుచుకుని రావాలని ఆమె భర్త క్రిష్ణరామ్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే పుట్టింటి దగ్గరే బాగుంది అనుకున్న దేవి నేను నీతో రాను అని ఆమె భర్త క్రిష్ణరామ్ కు తేల్చి చెప్పింది. భార్య దేవి పోతేపోయింది అంటూ ఆమె భర్త క్రిష్ణరామ్ అతని మేనత్తకూతురిని లేపుకుని వెళ్లిపోయాడు.

అల్లుడి మీద కిడ్నాప్ కేసు పెట్టిన మామ
నా కూతురిని కిడ్నాప్ చేశాడు అంటూ మేనల్లుడు క్రిష్ణరామ్ మీద అమ్మాయి తండ్రి కేసు పెట్టాడు. పోలీసులు అత్తకూతురిని లేపుకుపోయిన క్రిష్ణరామ్, మైనర్ అమ్మాయిని పట్టుకున్నారు. అయితే తనకు బాల్య వివాహం చెయ్యాలని తన తల్లిదండ్రులు ప్రయత్నించారని, తనను తన బావ క్రిష్నరామ్ రక్షించాడని అమ్మాయి ఆమె తల్లిదండ్రుల మీద రివర్స్ కేసు పెట్టింది.

పోలీసుల మతిపోయింది
ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, అమ్మాయి మైనర్ కావడంతో పోలీసులకు మతిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు క్రిష్ణరామ్, అతని మరదలకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరు ఎంత చెప్పినా మాట వినకుండా ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద కేసు పెట్డంతో ఇక లాభం లేదని బీహార్ పోలీసు అధికారులు ఎంట్రీ ఇచ్చారు.