• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Wife for sale: చెత్తనా కొడుకు, మహాభారతం రిపీట్, పేకాట కోసం భార్య పందెం, జల్సా చేసుకోండి ఫ్రెండ్స్ !

|

పాట్నా/ బీహార్: మహాభారతంలో జూదం ఆడటానికి ధర్మరాజు భార్యను పనంగా పెట్టిన విషయం మనం చిన్నప్పుడు చదువుకున్నాము. ఇక్కడ ఓ మహానుభావుడు జూదం, చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. చేతిలో ఉన్న డబ్బు అయిపోవడంతో భార్యను పనంగా పెట్టి పేకాట ఆడి ఓడిపోయాడు. అంతే wife for sale అంటూ నెల రోజులు పేకాటరాయుళ్లకు భార్యను అప్పగించేశాడు. నాలుగు రోజుల భర్త స్నేహితులు అయిన కామాంధుల కోరిక తీర్చిన భార్య తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. పదిమందిలో నా పరువు పోయింది, నా మాటకు విలువలేకుండా పోయిందని పెద్ద పొలిటీషియన్ లాగా డైలాగులు వేసి రెచ్చిపోయిన భర్త యాసిడ్ తీసుకుని భార్య మీద పోయడం కలకలం రేపింది.

Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!Illegal affair: భర్తను ఇలా కూడా చంపుతారా, ఈ స్కెచ్ యూట్యూబ్ లో కూడా లేదేమో ?, జస్ట్ రాగి ముద్ద!

 వీడి పేరుకే అవమానం

వీడి పేరుకే అవమానం

కరోనా వైరస్ (COVID-19) కాలంలో వసల కార్మికులు, కూలీలను ఆదుకోవడానికి సొంత ఆస్తులు అమ్మి వారిని ఆదుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ అనేక మందికి ఆదర్శంగా నిలిచాడు. బీహార్ లోని భగల్ పూర్ జిల్లాలో నివాసం ఉంటున్న సోను హరిజన్ అనే యువకుడు సోనూ అనే పేరుకే అవమానం తీసుకు వచ్చాడు.

 మందు, పేకాట... ఈ జీవితానికి ఇది చాలు

మందు, పేకాట... ఈ జీవితానికి ఇది చాలు

సోనూ ప్రతిరోజు మద్యం సేవిస్తూ పేకాట ఆడటం అలవాటుగా పెట్టుకున్నాడు. ఇంట్లో భార్యను పీడించి డబ్బులు తీసుకెళ్లి పేకాట ఆడుతూ అయిన డబ్బులు అన్నీ తగలేస్తున్నాడు. కొంతకాలం సోనూకు అతని బంధువులు, తెలిసిన వాళ్లు అప్పులు ఇచ్చారు. పేకాటపాపారావుగా పేరు తెచ్చుకున్న సోనూ విపరీతంగా అప్పులు చెయ్యడంతో ఇప్పుడు అప్పు ఇచ్చే నాథుడే కరువైనాడని తెలిసింది.

 నెల రోజులు wife for sale

నెల రోజులు wife for sale

కొన్ని రోజుల క్రితం సోనూ మద్యం మత్తులో పేకాట ఆడటంతో ఉన్న డబ్బులు మొత్తం పోయింది. పేకాట మీద మోజుతో అతని స్నేహితులు, కొందరు గ్యాంబ్లర్లతో తన భార్యను పందెం కాస్తున్నానని, నేను ఇప్పుడు పేకాట ఆడాలని చెప్పాడు, సోనూ భార్య చూడటానికి దొండపండులాగా ఉండటంతో ఇదే మంచి చాన్స్ అంటూ సోనూ ఫ్రెండ్స్ అందరూ ఓకే ఆన్నారు.

 భార్యను అప్పగించిన భర్త

భార్యను అప్పగించిన భర్త

పేకాటలో సోనూ ఓడిపోయాడు. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నెల రోజుల పాటు తన భార్యను స్నేహితులకు, పేకాటరాయుళ్లకు అప్పగించడానికి సోనూ సిద్దం అయ్యాడు. భార్యను బలవంతంగా నెల రోజులు ఫ్రెండ్స్ దగ్గరకు పంపించాడు. నాలుగు రోజుల పాటు సోనూ భార్యతో పేకాటరాయుళ్లు, వారి స్నేహితులు ఎంజాయ్ చేశారు.

 పరువు పోయిందని యాసిడ్ పోశాడు

పరువు పోయిందని యాసిడ్ పోశాడు

నాలుగు రోజులు కామాంధుల కోరిక తీర్చిన సోనూ భార్య తరువాత ఇంటికి వెళ్లిపోయింది. పదిమందిలో తాను మాట ఇచ్చానని, ఇప్పుడు నువ్వు వచ్చేస్తే నా పరువు పోతుందని సోనూ పెద్దపెద్ద సినిమా డైలాగులు చెప్పాడు. పేకాటరాయళ్ల కోరిక తీర్చనని తేల్చి చెప్పిన భార్య మీద సోనూ రగిలిపోయాడు. కోపంతో యాసిడ్ తీసుకున్న సోనూ అతని భార్య మీద పోయడంతో ఆమెకు తీవ్రగాయాలైనాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని సోనూను అరెస్టు చేసి కోసి కారం పెట్టారు. ప్రస్తుతం సోనూ భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
wife for sale: Police in Bihar have arrested a man for handing his wife to a group of gamblers after he lost her in a bet at his village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X