• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Wife for sale: పెళైన నెల రోజులకే భార్యను అమ్మేశాడు, రూ. లక్షలు తీసుకుని ఏం చేశాడంటే ?

|
Google Oneindia TeluguNews

జైపూర్/ భువనేశ్వర్: యువతికి వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాల నుంచి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చెయ్యడానికి ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కట్నం లేకుండా అందమైన అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. ఇదే సమయంలో డబ్బులు సంపాధిస్తున్న 17 ఏళ్ల యువకుడు ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. యువతికి 26 సంవత్సరాలు, అబ్బాయికి 17 సంవత్సరాలు. ఇద్దరి మద్య 9 సంవత్సరాలు తేడా ఉన్నా పట్టించుకోకుండా నెల క్రితం ఇద్దరికి పెళ్లి చేశారు. భార్యను పిలుచుకుని అతని భర్త అతను పని చేస్తున్న చోటకు వెళ్లాడు. కొన్ని రోజుల తరువాత రంగురంగు దుస్తులు వేసుకున్న భర్త చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్ పెట్టుకుని జోబులో రూ. 500 నోట్ల కట్టలు పెట్టుకుని వచ్చాడు. నీ భార్య ఎక్కడా అంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ యువకుడిని ప్రశ్నించారు. తనతో సంసారం చెయ్యడం ఇస్టం లేదని తనను వదిలేసి వెళ్లిపోయిందని భర్త చెప్పాడు. భర్త దగ్గర లక్షల రూపాయల డబ్బులు ఉండటం, అతను డబ్బులు విపరీతంగా ఖర్చు చేసి జల్సా చెయ్యడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో భర్త అతని భార్యను పెళ్లి జరిగిన నెల రోజులు కూడా కాకుండానే అమ్మేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

Illegal affair: కోటీశ్వరుడి భార్య, ప్రియుడితో బిజినెస్ మ్యాన్ భార్య జంప్, రెండు నెలలు, క్లైమాక్స్ లో !Illegal affair: కోటీశ్వరుడి భార్య, ప్రియుడితో బిజినెస్ మ్యాన్ భార్య జంప్, రెండు నెలలు, క్లైమాక్స్ లో !

 అమ్మాయికి పెళ్లి కాలేదని ?

అమ్మాయికి పెళ్లి కాలేదని ?

ఒడిస్సాలోని భువనేశ్వర్ సమీపంలో 26 సంవత్సరాల వయసు ఉన్న నిరూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. నిరూపాకు వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాల నుంచి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిరూపాకు పెళ్లి చెయ్యడానికి ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి.

 ఇటుకల బట్టీలో పని చేస్తున్న యువకుడు

ఇటుకల బట్టీలో పని చేస్తున్న యువకుడు

రాజస్థాన్ లో ఇటుకల బట్టీలో పని చేస్తూ డబ్బులు సంపాధిస్తున్న 17 ఏళ్ల యువకుడు నిరూపాను వివాహం చేసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. నిరూపాకు 26 సంవత్సరాలు, అబ్బాయికి 17 సంవత్సరాలు మాత్రమే ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు మొదట ఆలోచించారు. అయితే ఎలాగైనా నిరూపాకు పెళ్లి చెయ్యాలని ఆమె బంధువుల ఆమె తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేశారు.

 నెల ముందు మైనర్ తో యువతి పెళ్లి

నెల ముందు మైనర్ తో యువతి పెళ్లి

నిరూప, ఇటుకల బట్టీల పని చేస్తున్న యువకుడి మద్య 9 సంవత్సరాలు తేడా ఉన్నా పట్టించుకోకుండా నెల క్రితం ఇద్దరికి పెళ్లి చేశారు. కొన్ని రోజులు సొంతఊరిలో భార్య నిరూపాతో కాపురం చేసిన ఆమె మైనర్ మొగుడు తరువాత అతని భార్యను పిలుచుకుని ఇటుకల బట్టీలో పని చెయ్యడానికి వెలుతానని ఇంట్లో చెప్పాడు. మద్యప్రదేశ్ సరిహద్దులోని ఆగ్నేయ రాజస్థాన్ లోని బరాన్ జిల్లాలో అతను పని చేస్తున్న ఇటుల బట్టీ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లాడు.

 భార్యను రూ. 1.80 లక్షలకు అమ్మేశాడు

భార్యను రూ. 1.80 లక్షలకు అమ్మేశాడు

ఇటుకల బట్టీ యజమానికి 55 సంవత్సరాలు ఉంటాయి. నిరూపాను చూసి ఆ ఇటుకల బట్టీ యజమాని మోజుపడ్డాడు. నీ భార్య నిరూపాను జీవితాంతం నాకు అప్పగిస్తే నీకు రూ. 1.80 లక్షలు ఇస్తానని ఇటుకల బట్టీ యజమాని మైనర్ మొగుడికి చెప్పాడు. నెల ముందు పెళ్లి చేసుకున్న భార్య నిరూపాను అమ్మేస్తే ఇంత భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని అనుకున్న మైనర్ మొగుడు ఎగిరిగంత్తేశాడు.

 కొత్త స్మార్ట్ ఫోన్..... రంగురంగు బట్టలు వేసుకుని ?

కొత్త స్మార్ట్ ఫోన్..... రంగురంగు బట్టలు వేసుకుని ?

ఇటుకల బట్టీ యజమానికి నిరూపాను ఆమె మైనర్ మొగుడు అమ్మేశాడు. ఇటుకల బట్టీ యజమాని రూ. 1.80 లక్షల మైనర్ మొగుడి చేతిలో పెట్టాడు. నేరుగా సిటీకి వెళ్లిన మైనర్ మొగుడు కొత్త స్మార్ట్ ఫోన్, పూలుపూలు, రంగురంగులు ఉన్న కొత్త బట్టలు తీసుకున్నాడు. పీకలదా మద్యం సేవించి హోటల్ లో ఫుల్ గా భోజనం చేశాడు.

 ఊపుకుంటూ ఊరికి వెళ్లిన మైనర్ మొగుడు

ఊపుకుంటూ ఊరికి వెళ్లిన మైనర్ మొగుడు

కొన్ని రోజుల తరువాత రంగురంగు దుస్తులు వేసుకున్న మైనర్ మొగుడు చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్ పెట్టుకుని జోబులో రూ. 500 నోట్ల కట్టలు పెట్టుకుని సొంత ఊరికి వెళ్లాడు. నీ భార్య నిరూపా ఎక్కడా అంటూ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ యువకుడిని ప్రశ్నించారు. తనతో సంసారం చెయ్యడం ఇస్టం లేదని తనను వదిలేసి నిరూపా వెళ్లిపోయిందని మైనర్ మొగుడు నిరూపా కుటుంబ సభ్యులకు చెప్పాడు.

 పోలీసులు బెండ్ తీస్తే మ్యాటర్ లీక్

పోలీసులు బెండ్ తీస్తే మ్యాటర్ లీక్

నిరూపా కుటుంబ సభ్యులకు ఆమె భర్త మీద అనుమానం వచ్చి పోలీసు కేసు పెట్టారు. పోలీసులు మైనర్ మొగుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మొదట తనకు ఏమీ తెలీదని చెప్పిన మైనర్ మొగుడు చివరికి నిరూపాను ఇటుకల బట్టీ యజమానికి రూ. 1.80 లక్షలకు అమ్మేశారని ఎదురుతిరిగాడు.

 పోలీసులకు సినిమా చూపించిన రాజస్థాన్ ప్రజలు

పోలీసులకు సినిమా చూపించిన రాజస్థాన్ ప్రజలు

మైనర్ మొగుడిని వెంట పెట్టుకున్న ఒడిస్సా పోలీసులు రాజస్థాన్ వెళ్లారు. అక్కడ ఇటుకల బట్టీ యజమాని నివాసం ఉంటున్న గ్రామస్తులు నిరూపాను పంపించడానికి నిరాకరించి ఒడిస్సా పోలీసులను చుట్టుముట్టారు. ఒడిస్సా పోలీసులు నానా తంటాలు పడి రెండు రోజులు కస్టపడి స్థానిక పోలీసుల సహాయంతో నిరూపాను రక్షించి ఒడిస్సా పిలుచుకుని వచ్చి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 మైనర్ మొగుడికి 70 ఎంఎం సినిమా

మైనర్ మొగుడికి 70 ఎంఎం సినిమా

కట్టుకున్న భార్యను అమ్మేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసిన మైనర్ మొగుడి మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన ఒడిస్సా పోలీసులు అతన్ని బాలనేరస్తుల కోర్టు ముందు హాజరుపరిచి అతన్ని జువైనల్ జైలుకు తరలించామని ఒడిస్సా పోలీసులు చెప్పారు. మొత్తం మీద జల్సాలు చెయ్యడానికి కట్టుకున్న భార్యను అమ్మేసిన మైనర్ మొగుడు జైలు పాలైనారు, ఇదే సమయంలో మైనర్ అని తెలిసినా అతని పెళ్లి చేసిన అబ్బాయి, అమ్మాయి కుటుంబ సభ్యుల మీద పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసింది.

English summary
Wife for sale: Odisha teen sold wife to Rajasthan man month after wedding, bought a smartphone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X