వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ కిలాడి: భర్తకే బ్లాక్ మెయిల్, వెంట తండ్రి, ఫ్రెండ్, రూ. 50 లక్షలు స్వాహా, మరో రూ. కోటికి స్కెచ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భర్త బలహీనతలు ఆసరాగా చేసుకున అతన్ని బ్లాక్ మెయిల్ చేసి రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేసిన మహిళను కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే నిందితులు రూ. 50 లక్షలు భాదితుడి నుంచి లాక్కోని స్వాహా చేశారని పోలీసులు అన్నారు.

ఉల్లాలలో గణేష్ నాయక్, అంబికా నాయక్ అలియాస్ అంబికా ఆశా దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య కుటుంబ సమస్యలు ఉన్నాయి. గణేష్ నాయక్ శ్రీమంతుడు. గణేష్ నాయక్ దక్షిణ కన్నడ జిల్లాలో వ్యాపారం చేస్తున్నాడు. భర్త గణేష్ నాయక్ నుంచి ఎలాగైనా డబ్బులు లాక్కోవాలని అతని భార్య అంబికా నాయక్ నిర్ణయించింది.

 A wife herself threatens husband for money near manipal in Mangalore

మండ్యకు చెందిన స్నేహితుడు మంజునాథ్ ను అంబికా నాయక్ కలిసింది. తన భర్త గణేష్ నాయక్ ను బ్లాక్ మెయిల్ చేసి రూ. 50 లక్షలు వసూలు చెయ్యాలని అంబికా నాయక్ అతనికి చెప్పింది. అంబికా నాయక్ కు ఆమె తండ్రి కే. వాసుదేవ ప్రభు (70) సహకరించాడు.

గణేష్ నాయక్ రహస్య సమాచారాన్ని లంబికా నాయక్ ఆమె స్నేహితుడు మంజునాథ్ కు ఇచ్చింది. గణేష్ నాయక్ రహస్యాలు తెలుసుకున్న మంజునాథ్ అతన్ని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. రూ. 50 లక్షలు ఇవ్వకుంటే నీరహస్యాలు మొత్తం బయటపెడుతానని, సమాజంలో నీపరువు పోతుందని గణేష్ నాయక్ ను హెచ్చరించాడు.

గణేష్ నాయక్ ను బెదిరించి రూ. 50 లక్షలు లాక్కొన్నారు. రూ. 50 లక్షలు అంబికా నాయక్, ఆమె తండ్రి వాసుదేవ ప్రభు, మంజునాథ్ పంచుకున్నారు. అయితే గణేష్ నాయక్ నుంచి మరింత డబ్బు వసూలు చెయ్యాలని వీరు నిర్ణయించారు. గణేష్ నాయక్ కు ఫోన్ చేసి రూ. 1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గణేష్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలుకోణాల్లో విచారణ చెయ్యగా గణేష్ నాయక్ భార్య అంబికా నాయక్ మీద అనుమానం వచ్చింది. అంబికా నాయక్ మీద నిఘా వెయ్యడంతో ఆమే అసలు నిందితురాలు అని వెలుగు చూసింది. అంబికా నాయక్, ఆమె తండ్రి వాసుదేవ ప్రభు, మండ్యకు చెందిన మంజునాథ్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
Ullal police have a persona and they are searching two others in a blackmail case. A wife herself threatens husband for money. The incident took place in Manipal, Mangaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X