చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, విసిగిపోయిన భర్త, అత్తతో కలిసి మడతపెట్టి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/టీనగర్: వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య చూడటానికి చామనచాయలో ఉన్నా సన్నగా, చాలా అందంగా ఉంటోంది. వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్న భార్య ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది, విషయం తెలుసుకున్న భర్త అతని భార్యను మందలించాడు.

తరువాత భార్య మరో ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్యకు ఆమె తల్లిదండ్రులు వార్నింగ్ ఇచ్చారు. ఎంతమంది చెప్పినా ఆమె పద్దతి మార్చుకోలేదు. ఇలా భార్య మరో కొంతమందితో రొమాన్స్ చేసింది. భార్య తీరుతో భర్త విసిగిపోయాడు. తరువాత భార్య ఇంటిలో తాడుకు వేలాడుతు శవమై కనిపించింది.

Wife: ప్రియుడు, డ్రగ్స్, మద్యం మోజులో మునిగిపోయిన భార్య, బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపిన భర్త !Wife: ప్రియుడు, డ్రగ్స్, మద్యం మోజులో మునిగిపోయిన భార్య, బెస్ట్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపిన భర్త !

 అందమైన భార్య

అందమైన భార్య

చెన్నై సిటీలోని కాసిమేడు ఫిషింగ్ పోర్ట్ సమీపంలోని బాలక్రిష్ణ నగర్ లోని పుదుపున్నార్ పేట్ లో నివాసం ఉంటున్న సెల్వం అనే వ్యక్తి నివాం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు కుదుర్చిన నాగౌర్ ఎస్టేట్ లో నివాసం ఉంటున్న సుమిత్రా అనే యువతిని సెల్వం వివాహం చేసుకున్నాడు.

సన్నగా, నాజుకుగా ఉన్న భార్య

సన్నగా, నాజుకుగా ఉన్న భార్య

సెల్వం, సుమిత్రా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. వివాహం చేసుకున్న సెల్వం, సుమిత్రా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమిత్రా చూడటానికి చామనచాయలో ఉన్నా సన్నగా, చాలా అందంగా ఉంటోంది. ఇదే సుమిత్రా కొంప ముంచింది. భర్త సెల్వం ఎక్కువగా బయట ఉండటంతో అతని భార్య సుమిత్రా రెచ్చిపోయింది.

భార్యకు అక్రమ సంబంధం

భార్యకు అక్రమ సంబంధం

వివాహం చేసుకుని భర్త సెల్వంతో కాపురం చేస్తున్న సుమిత్రా నాగౌరావ్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది, విషయం తెలుసుకున్న సెల్వం అతని భార్య సుమిత్రాను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని, మనకు పరువు మర్యాదా ఉందని సెల్వం అతని భార్య సుమిత్రాకు గుర్తు చేశాడు.

దిక్కులేనంత మంది బాయ్ ఫ్రెండ్స్

దిక్కులేనంత మంది బాయ్ ఫ్రెండ్స్

కొంతకాం తరువాత సుమిత్రా మరో ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. సుమిత్రా విషయంలో విసిగిపోయిన ఆమె భర్త సెల్వం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. రానురాను సుమిత్రా మరికొంతమందితో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఆమె భర్త సెల్వంను లెక్కచెయ్యకుండా తిరిగింది.

భర్త, తల్లిదండ్రులు కలిసి కిలాడీ లేడీని ?

భర్త, తల్లిదండ్రులు కలిసి కిలాడీ లేడీని ?

సుమిత్రాకు ఆమె భర్త సెల్వంతో పాటు ఆమె తల్లిదండ్రులు రెజీనా, సెల్వకుమార్ వార్నింగ్ ఇచ్చారు. భర్త సెల్వం, తల్లిదండ్రులు రెజీనా, సెల్వకుమార్ వార్నింగ్ ఇచ్చినా సుమిత్రా మాత్రం ఎవ్వరిమాట వినలేదు. రాత్రి సుమిత్రా ఇంటిలో చీరకు వేలాడుతూ శవమై కనిపించింది.

భార్య అంత్యక్రియలు

భార్య అంత్యక్రియలు

మహిళ కడుపునొప్పితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త, ఆమె తల్లిదండ్రులు అందరికి నమ్మించారు. పోలీసులు సుమిత్రా శవానికి స్ట్యాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఏరియాలో సుమిత్రా అంత్యక్రియలు అని ఫ్లెక్సీలు వేసిన కుటుంబ సభ్యులు సుమిత్రా అంత్యక్రియల జరిపించారు.

సొంత తల్లిదండ్రులు, భర్త కలిసి చంపేశారు

సొంత తల్లిదండ్రులు, భర్త కలిసి చంపేశారు

పోస్టుమార్టం నివేదికలో సుమిత్రాను గొంతు నులిమి చంపేశారని వెలుగు చూసింది. మూడు నెలల తరువాత పోలీసులు రంగంలోకిదిగారు. సుమిత్రాకు చాలా మంది మగాళ్లతో అక్రమ సంబంధం ఉందని, ఎంతచెప్పినా పద్దతి మార్చుకోకుండా మా పరువుతీస్తోందని, అందకే నా భర్త సెల్వకుమార్, అల్లుడు సెల్వం కాళ్లు, చేతులు పట్టుకున్నారని, తాను చీరతో గొంతు బిగించి చంపేశానని సుమిత్రా తల్లి రెజీనా పోలీసులకు చెప్పింది.

కామంతో కళ్లుమూసుకుపోయి ?

కామంతో కళ్లుమూసుకుపోయి ?

సుమిత్రా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు రెజీనా, సెల్వకుమార్, భర్త సెల్వంను పోలీసులు అరెస్టు చేశారు. దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్న వివాహిత మహిళ ఆమె కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురికావడం చెన్నైలోని కాసిమేడు ప్రాంతంలో కలకలం రేపింది.

English summary
Wife: Husband arrest after three months in wife murder postmortem report in Chennai city in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X