• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రియుడి కోసం భర్తను 14 సార్లు కాల్చి చంపించిన కాంచనా, లారెన్స్ కాంచనా వేస్ట్, పెళ్లామ్ స్కెచ్ !

|

చెన్నై/ వేలూరు: ప్రియుడితో రొమన్స్ చేస్తున్న భార్యను భర్త గట్టిగా మందలించాడు. అయితే భార్య మాత్రం ఆమె తీరు మార్చుకోలేదు. ఇలా చెబితే వినదని భర్త భార్యను పట్టుకునిచితకబాదేశాడు. ప్రియుడితో సరసాలు ఆడటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య రగిలిపోయింది. తన భర్తను చంపేస్తే మనం సుఖంగా ఉంటామని భార్య ప్రియుడికి చెప్పింది. అంతే సినిమా హీరోలాగా రెచ్చిపోయిన ప్రియుడు తుపాకి తీసుకుని 14 రౌండ్లు కాల్పులు జరిపి భర్తను కాల్చి చంపేశాడు. భర్తను లేపేశామని, ఇక మన రాసలీలలకు ఎవ్వరు అడ్డులేరని భార్య తెగ సంతోష పడిపోయింది. అయితే తుపాకి, బుల్లెట్లు ఎక్కడివి ? అంటూ పోలీసులు ఆరా తియ్యడంతో అసలు కథ మొదలైయ్యింది.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

 హ్యాపీలైఫ్.... అంతలో !

హ్యాపీలైఫ్.... అంతలో !

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపంలోని కొండకిందపల్లి పంచాయితీ పరిధిలోని పోతన్ గుట్ట ప్రాంతంలో గోవిందరాజ్ (53), కాంచనా (38) దంపతులు నివాసం ఉంటున్నారు. గోవిందరాజ్, కాంచనా దంపతుల మద్య 15 ఏళ్ల వయసు తేడా ఉంది. గోవిందరాజ్, కాంచనా దంపతులకు నలుగురు కుమార్తెలు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు హ్యాపీగా సంసారం చేసిన దంపతుల మద్య కొంత కాలం నుంచి రాసలీలల విషయంలో తేడా వచ్చింది.

 ఆంటీతో టచ్ లోకి వచ్చిన ముఠామేస్త్రీ

ఆంటీతో టచ్ లోకి వచ్చిన ముఠామేస్త్రీ

రెండు సంవత్సరాల క్రితం గోవిందరాజ్ కొత్తగా ఇంటిని నిర్మించాడు. కొత్త ఇంటి నిర్మాణం పనుల కోసం గోవిందరాజ్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే నివాసం ఉంటున్న కుప్పుస్వామి (27) అనే మేస్త్రీ వచ్చాడు. కుప్పుస్వామి యువకుడు కావడంతో కాంచనా కళ్లు అతని మీద పడ్డాయి. రోజు ఇంటి పని చెయ్యడానికి వచ్చి వెలుతున్న కుప్పుస్వామికి కాంచనా వల వేసింది.

 గ్రీన్ సిగ్నల్ తో రైట్ రైట్

గ్రీన్ సిగ్నల్ తో రైట్ రైట్

భర్త గోవిందరాజ్ లేని సమయంలో ఇంటి పని చేస్తున్న కుప్పుస్వామిని చిన్నగా లైన్ లో పెట్టిన కాంచనా అతనికి కావలసినంత డబ్బులు ఇస్తూ ఏ వంట కావాలంటే ఆ వంటలు చేసిపెట్టింది. ఆ సమయంలో కాంచనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కుప్పుస్వామి ఆమెతో రాసలీలలు సాగించాడు.

 రెడ్ హ్యాండెడ్ గా భర్తకు చిక్కిపోయారు

రెడ్ హ్యాండెడ్ గా భర్తకు చిక్కిపోయారు

గోవిందరాజ్ కు సొంతంగా టైలర్ షాపు ఉంది. టైలర్ షాపుతో పాటు గోవిందరాజ్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఓ రోజు పనిమీద బయటకు వెళ్లిన గోవిందరాజ్ మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చేశాడు. భర్త పని మీద వేరే ఊరికి వెళ్లాడని కాంచనా ఆమె ప్రియుడు కుప్పుస్వామి ఇంట్లోని బెడ్ రూంలో రాసలీలలు సాగించారు. ఒక్కసారిగా ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్లిన గోవిందరాజ్ భార్య కాంచనాను పరాయి మగాడితో చూడరాని సీన్ లో చూడటంతో మండిపడ్డాడు.

 లేపేస్తే ఓ పనైపోతుంది

లేపేస్తే ఓ పనైపోతుంది

భార్య కంచనాను పద్దతి మార్చుకోవాలని గోవిందరాజ్ హెచ్చరించాడు. అయినా ఆమె పద్దతి మార్చుకోకపోవడం, కుప్పుస్వామిని పదేపదే కలవడంతో రగిలిపోయిన గోవిందరాజ్ ఆమెను చితకబాదడం మొదలుపెట్టాడు. మన రాసలీలలకు భర్త గోవిందరాజ్ అడ్డు వస్తున్నాడని, అతనిని చంపేస్తే మనం సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుందని కాంచనా ప్రియుడు కుప్పుస్వామికి చెప్పింది. ఆంటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రియుడు కుప్పుస్వామి గోవిందరాజ్ హత్యకు ప్లాన్ వేశాడు.

 తుపాకితో 14 సార్లు కాల్చి చంపేశారు

తుపాకితో 14 సార్లు కాల్చి చంపేశారు

ఈనెల 4వ తేదీన గోవిందరాజ్ పని మీద బైక్ లో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో నాట్రంపల్లి సమీపంలోని జయంతిపురం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు గోవిందరాజ్ మీద తుపాకితో 14 రౌండ్లు కాల్పులు జరిపారు. విషయం గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు గోవిందరాజ్ ను సేలం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై గోవింరాజ్ మరణించాడు. నాట్రంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.

 డాన్ కాదు, తుపాకితో ఎందుకు హత్య ?

డాన్ కాదు, తుపాకితో ఎందుకు హత్య ?

గోవిందరాజ్ టైలర్ పని చేస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని, అతను డాన్ కాదని, ఎందుకు 14 రౌండ్లు తుపాకితో కాల్చి చంపారు ? అని పోలీసులు అప్పటి నుంచి ఆరా తీస్తున్నారు. భర్త చనిపోయాడనే కొంచెం కూడా భాదలేకుండా కాంచనా ప్రియుడు కుప్పుస్వామితో ఎంజాయ్ చేస్తున్న విషయం పోలీసుల కంటపడింది. అంతే కాంచనాను, కుప్పుస్వామిని అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో అసలు వియం బయపడిందని పోలీసులు అన్నారు. గోవిందరాజ్ ను తుపాకితో కాల్చి చంపేస్తే ఆ కేసు వేటగాళ్ల మీదకు వెలుతుందని వీరు ప్లాన్ వేశారు. ప్రియుడు కుప్పుస్వామి, అతని స్నేహితుడు వీర అలియాస్ వీరస్వామి కలిసి షికారీలు (వేటగాళ్లు) దగ్గర నాటు తుపాకి, తూటాలు కొనుగోలు చేసి గోవిందరాజ్ ను కాల్చి చంపారని పోలీసులు చెప్పారు. పరారైన వీర అలియాస్ వీరస్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Wife illegal relationship: Taiolr shot 14 times dies, Wife, paramour arrested in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X