బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటిలో ప్రియుడితో భార్య నగ్నంగా, భర్త చూశాడు, మూడు రోజులకు ఫినిష్, ప్రియుడు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమ సంబంధం బయటపడిందని భయంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్ చేసిన ఘటన బెంగళూరు నగరంలోని జీవన్ భీమా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గీతా, ఆమె ప్రియుడు మొయిబుల్ ఇస్లాంను అరెస్టు చేసి జైలుకు పంపించామని గురువారం పోలీసులు చెప్పారు.

Recommended Video

పెళ్లి గిఫ్టు లో బాంబు, పెళ్లికొడుకు దుర్మరణం, పెళ్లికూతురి పరిస్థితి విషమం
అసోం టూ బెంగళూరు

అసోం టూ బెంగళూరు

అసోంకు చెందిన సంజీబ్, గీతా దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం ఉద్యోగం కోసం బెంగళూరు చేరుకుని జీవన్ భీమా నగర్ లో నివాసం ఉంటున్నారు. గీతా చాక్లెట్లు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. అదే కంపెనీలో మొయిబుల్ ఇస్లాం ఉద్యోగం చేస్తున్నాడు. గీతా ఇస్లాం అక్రమ సంబంధం కొనసాగించారు.

ఇంటిలో ప్రియుడితో

ఇంటిలో ప్రియుడితో

భర్త సంజీబ్ ఇంటిలో లేని సమయంలో గీతా ప్రియుడికి ఫోన్ చేసి పిలిపించుకుని ఇంటిలోనే రోమాన్స్ చేసేది. ఒక రోజు భర్త సంజీబ్ అనుకోకుండా ఇంటికి వెళ్లడంతో ఆ సమయంలో గీతా, మొయిబుల్ ఇస్లాం నగ్నంగా చిక్కిపోయారు.

భార్యకు వార్నింగ్

భార్యకు వార్నింగ్

అక్రమ సంబంధం కొనసాగించరాదని, మర్యాదగా కాపురం చేసుకోవాలని భర్త సంజీబ్ భార్య గీతాను హెచ్చరించాడు. తన భర్తకు అక్రమ సంబంధం గురించి తెలిసిపోయిందని, ఇక వేధింపులకు గురి చేస్తాడని గీతా భయపడింది.

 ప్రియుడితో కలిసి !

ప్రియుడితో కలిసి !

ఫిబ్రవరి 24వ తేదీ జీవన్ భీమా నగర్ లోని ఆనంద నగర్ లో సంజీబ్ హత్యకు గురైనాడు. సంజీబ్ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంజీబ్ మొబైల్ నెంబర్ ఆధారంగా విచారణ చేశారు. అయితే హత్య కేసులో ఒక్క ఆధారం కూడా పోలీసులకు చిక్కలేదు.

 భార్య నిర్లక్షం

భార్య నిర్లక్షం

తన భర్తను పాతకక్షల కారణంగా ఎవరో హత్య చేశారని గీతా పోలీసులకు చెప్పింది. అయితే కేసు విచారణ ఏమైయ్యింది అని ఆమె ఒక్కసారి కూడా పోలీసులను అడగకుండా నిర్లక్షం చేసింది. గీతా మీద పోలీసులకు అనుమానం వచ్చింది.

 ప్రియుడితో జల్సా

ప్రియుడితో జల్సా

గీతా ఇంటికి ఆమె ప్రియుడు మొయిబుల్ ఇస్లాం వచ్చి గంటలు గంటలు ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. గీతా ముఖంలో భర్త హత్యకు గురైనాడని కొంచంకూడా భాద కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గీతాను అదుపులో తీసుకుని విచారించగా ప్రియుడితో కలిసి భర్త సంజీబ్ ను హత్య చేశానని అంగీకరించింది. గీతా, మొయిబుల్ ఇస్లాంను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
Wife killed her husband near jeevan bhima nagar in Bengaluru in karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X