బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady doctor: రివాల్వర్ తో కాల్చుకుని లేడీ డాక్టర్ ఆత్మహత్య ?, భర్త డాక్టర్, డెత్ నోట్ లో ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చిత్రదుర్గా: డాక్టర్ గా పని చేస్తున్న మహిళ, డాక్టర్ అయిన వ్యక్తి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. డాక్టర్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. లేడీ డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నారు. లేడీ డాక్టర్ భర్త ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు. దంపతులు రాత్రి ఇంట్లో సంతోషంగా ఉన్నారు. ఉదయం లేడీ డాక్టర్ ఇంట్లో శవమై కనిపించడం కలకలం రేపింది. లేడీ డాక్టర్ ఇంటిలో డెత్ నోట్ చిక్కిందని పోలీసులు అన్నారు. డెత్ నోట్ లోని వివరాలు ఇప్పుడే బయటకు చెప్పలేమని జిల్లా ఎస్పీ అన్నారు.

Brothers: ఒకే ఇల్లు, భార్యల మీద డౌట్, వదినతో మరిది, మరదలితో బావ ? కట్ చేస్తే నడిరోడ్డులో, భార్యకు !Brothers: ఒకే ఇల్లు, భార్యల మీద డౌట్, వదినతో మరిది, మరదలితో బావ ? కట్ చేస్తే నడిరోడ్డులో, భార్యకు !

 డాక్టర్ దంపతులు

డాక్టర్ దంపతులు

కర్ణాటకలోని చిత్రదుర్గాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్ట రూపా (50) సీనియర్ డాక్టర్ గా పని ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ రూపా డాక్టర్ కేజీ. రవిని వివాహం చేసుకున్నారు. డాక్టర్ రూపా, డాక్టర్ రవి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. లేడీ డాక్టర్ రూపా చాలా సంవత్సరాల నుంచి చిత్రదుర్గా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నారు.

 ఇంట్లో ఏం జరిగింది ?

ఇంట్లో ఏం జరిగింది ?

లేడీ డాక్టర్ రూపా భర్త డాక్టర్ రవి చిత్రదుర్గాలో గిరికాంత ఆర్థో కేర్ సెంటర్ అనే ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు డాక్టర్ రూపా, డాక్టర్ రవి దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంట్లోని బాత్ రూమ్ లో డాక్టర్ రూపా రక్తపుమడుగులో పడింది. విషయం గుర్తించిన పనిమనిషి వెంటనే రూపా భర్త రవికి సమాచారం ఇచ్చారు.

 డెత్ నోట్ లో ఏముంది ?

డెత్ నోట్ లో ఏముంది ?

వెంటనే రూపాను చిత్రదుర్గాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డాక్టర్ రూపా చనిపోయారని వైద్యులు నిర్దారించారు. పోస్టుమార్టం నివేదికలో రూపా రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని వెలుగు చూసింది. రూపా ఇంటిలో డెత్ నోట్ చిక్కిందని పోలీసులు అన్నారు. రూపా డెత్ నోట్ లోని వివరాలు ఇప్పుడే బయటకు చెప్పలేమని చిత్రదుర్గా జిల్లా ఎస్పీ కే. పరుశురామ్ అన్నారు.

 దానిమ్మతోట.... హోటల్ లో భారీ నష్టాలు

దానిమ్మతోట.... హోటల్ లో భారీ నష్టాలు

అయితే ఇటీవల మేము 25 ఎకరాల్లో దానిమ్మ తోట పెట్టారని, పంట నాశనం కావడంతో సుమారు రూ. 1 కోటి వరకు నష్టం వచ్చిందని డాక్టర్ రవి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల తాము ఓ ప్రైవేట్ హోటల్ కొనుగోలు చేశామని, అందులోనా నష్టం వచ్చిందని. కొంతకాలంగా ఇదే విషయంలో చర్చ జరిగిందని డాక్టర్ రవి సమాచారం ఇచ్చారని పోలీసులు అంటున్నారు.

English summary
Wife: Lady doctor Roopa committed suicide in Chitradurga in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X