• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife: అర్దరాత్రి నడిరోడ్డులో భార్యను చంపేసి ఇంటికి ఫోన్ చేశాడు, సినిమా స్టోరీ చెప్పిన భర్త, విచారణలో !

|

బెంగళూరు/ హాసన్: మూడు సంవత్సరాల క్రితం యువతి, యువకుడు కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి చెయ్యడంతో ఇరు వర్గాలకు చెందిన బంధువులు అందరూ దంపతుల ఇంటికి వెళ్లి వస్తున్నారు. దంపతుల మద్య సంవత్సరం నుంచి గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు అనేకసార్లు పంచాయితీలు చేశారు. పెద్దలు పంచాయితీలు చేసినా కొన్ని రోజులు సంతోషంగా ఉంటున్న దంపతులు మళ్లీ గొడవ పడటం మొదలు పెట్టారు.

దంపతులు గొడవ పడిన ప్రతిసారి పెద్దలు రాజీ చేస్తున్నారు. రెండు వారాల క్రితం భార్యను బైక్ లో పిలుచుకుని వెళ్లిన భర్త తరువాత అర్దరాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. రోడ్డు ప్రమాదంలో బైక్ నుంచి కిందపడిపోయామని, తన భార్య చనిపోయిందని, తనకు గాయాలైనాయని భర్త చెప్పాడు. తలకు గాయాలైన భర్తను ఆసుపత్రికి తరలించారు. భార్య చనిపోవడంతో పోస్టుమార్టం నిర్వహించి ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే తమ కూతురు ప్రమాదంలో చనిపోలేదని, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. చివరికి అర్దరాత్రి భార్యను దారుణంగా చంపేసిన భర్త అది ప్రమాదంగా చిత్రీకరించాడని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

Illegal affair: నా ప్రియురాలు శాడిస్టు, భర్తనే వదల్లేదు, నన్ను టార్చర్ పెట్టి కోరికలు తీర్చుకుంది!Illegal affair: నా ప్రియురాలు శాడిస్టు, భర్తనే వదల్లేదు, నన్ను టార్చర్ పెట్టి కోరికలు తీర్చుకుంది!

 మూడు సంవత్సరాల క్రితం పెళ్లి

మూడు సంవత్సరాల క్రితం పెళ్లి

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని అరకలగూడు తాలుకా అక్కలవాడి ప్రాంతంలో మహేష్ (35) అనే యవకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన ఉప్పరకొప్పుల నివాసి రుక్మిణి అనే యువతిని మహేష్ వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో మహేష్, రుక్మిణి సంతోషంగా వివాహం చేసుకున్నారు.

 పంచాయితీలు చేస్తున్న పెద్దలు

పంచాయితీలు చేస్తున్న పెద్దలు

కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి చెయ్యడంతో ఇరు వర్గాలకు చెందిన బంధువులు అందరూ మహేష్, రుక్మిణి దంపతుల ఇంటికి వెళ్లి వస్తున్నారు. మహేష్, రుక్మిణి దంపతుల మద్య సంవత్సరం నుంచి గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో రుక్మిణి కుటుంబ సభ్యులు, బంధువులు అనేకసార్లు పంచాయితీలు చేశారు.

 రోజూ ఇదే రామాయణం

రోజూ ఇదే రామాయణం

పెద్దలు పంచాయితీలు చేసినా కొన్ని రోజులు మహేష్, రుక్మిణి సంతోషంగా ఉంటున్నారు. తరువాత రుక్మిణి, మహేష్ దంపతులు మళ్లీ గొడవ పడటం మొదలు పెట్టారు. దంపతులు గొడవ పడిన ప్రతిసారి పెద్దలు రాజీ చేస్తున్నారు. ఎన్నిసార్లు పంచాయితీలు చేసినా, రాజీ చేసినా మహేష్, రుక్మిణి మాత్రం వారి తీరు మార్చుకోలేదు.

అర్దరాత్రి ఫోన్ చేసిన భర్త

అర్దరాత్రి ఫోన్ చేసిన భర్త

రెండు వారాల క్రితం భార్య రుక్మిణిని బైక్ లో పిలుచుకుని వెళ్లిన భర్త మహేష్ అదే రోజు అర్దరాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. రోడ్డు ప్రమాదంలో బైక్ నుంచి కిందపడిపోయామని, తన భార్య రుక్మిణి చనిపోయిందని, తనకు గాయాలైనాయని మహేష్ అతని కుటుంబ సభ్యులు, భార్య రుక్మిణి కుటుంబ సభ్యులకు చెప్పాడు. తలకు గాయాలైన భర్త మహేష్ ను హాసన్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

హత్య అని అనుమానం

హత్య అని అనుమానం

మహేష్ భార్య రుక్మిణి చనిపోవడంతో పోస్టుమార్టం నిర్వహించి ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే తమ కూతురు రుక్మిణి ప్రమాదంలో చనిపోలేదని, ఆమెను హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హాసన్ జిల్లా ఎస్పీ శ్రీనివాస గౌడ, పోలీసులు, ఆర్ టీఓ అధికారులు పరిశీలించి వివరాలు సేకరించారు. చివరికి అర్దరాత్రి భార్య రుక్మిణిని దారుణంగా చంపేసిన భర్త మహేష్ అది ప్రమాదంగా చిత్రీకరించాడని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

 బండరాయితో కొట్టి చంపేసిన భర్త

బండరాయితో కొట్టి చంపేసిన భర్త

తన భార్య రుక్మిణి తన కుటుంబ సభ్యులను బాగా చూసుకోవడం లేదని మహేష్ రగిలిపోయాడు. రుక్మిణికి ఇక ముందు పిల్లలు పుట్టరని మహేష్ కు తెలిసింది. ఇదే సమయంలో తన భార్య రుక్మిణిని ఎలాగైనా చంపేయాలని స్కెచ్ వేసిన మహేష్ ఆమెను బైక్ లో బయటకు పిలుచుకుని వెళ్లాడని పోలీసులు అన్నారు. బైక్ లో నుంచి రుక్మిణిని కిందకు దింపిన తరువాత బండరాయి తీసుకుని ఆమె తల మీద దాడి చేసి చంపేశాడని, తరువాత అనుమానం రాకుండా రాయితో అతని తల పగలగొట్టుకుని ప్రమాదం జరిగిందని డ్రామాలు వేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఆసుపత్రిలో చికిత్స పోందిన మహేష్ ను అతని భార్య హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Wife: Man held for wife’s murder near Arkalgud in Hassan in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X