వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Wife: నీ ముఖం చూడను, నీతో కాపురం చెయ్యను, తేల్చి చెప్పిన భార్య, అత్తారింటి ముందే విషం తాగిన భర్త !

|
Google Oneindia TeluguNews

అమృత్ సర్/ పంజాబ్: పెళ్లి చేసుకోవడానికి యువతి ఆమె కుటుంబ సభ్యులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్లాడు. అత్తారింటికి వెళ్లిన భార్య నెల రోజులు కూడా కాకుండానే నాకు పని ఉందని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతే అప్పటి నుంచి భార్యను కాపురానికి పిలుచుకురావాలని భర్త అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు, నీతో నేను కాపురానికి రాను అని భార్య ఎదురుతిరిగింది. భార్యను ఎలాగైనా పిలుచుకుని వస్తానని చెప్పిన యువకుడు అత్తారింటికి వెళ్లాడు. పెళ్లి చేసిన మధ్యవర్తి పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అబ్బాయి విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. భార్య, అత్తమామలు అవమానించి ఇంటి ముందే చిత్రహింసలకు గురి చెయ్యడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది. భర్త ఆత్మహత్యకు కారణం అయిన అతని భార్య, ఆమె కుటుంబ సభ్యులు పరారైనారు.

RRR: ఆర్ఆర్ఆర్ కన్నడ పాట రిలీజ్, మీడియా ప్రశ్నలకు ఒకేఒక్క మాట చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి !RRR: ఆర్ఆర్ఆర్ కన్నడ పాట రిలీజ్, మీడియా ప్రశ్నలకు ఒకేఒక్క మాట చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి !

పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యువతి

పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యువతి

పంజాబ్ లోని అమృత్ సర్ సమీపంలోని హమీద్ పురాలో కరంబీర్ కౌర్ (27) అనే యువతి నివాసం ఉంటున్నది. అచింతకోట్ ప్రాంతంలో గురుప్రీత్ సింగ్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గురుప్రీత్ సింగ్, కరంబీర్ కౌర్ కు వివాహం చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. గురుప్రీత్ సింగ్ ను పెళ్లి చేసుకోవడానికి కరంబీర్ కౌర్ ఆమె కుటుంబ సభ్యులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇదే ఏడాది పెళ్లి జరిగింది

ఇదే ఏడాది పెళ్లి జరిగింది

గురుప్రీత్ సింగ్, కరంబీర్ కౌర్ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంతో ఇదే ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి చేసుకున్న గురుప్రీత్ సింగ్ అతని భార్య కరంబీర్ కౌర్ తో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్లాడు. వివాహం జరిగిన వారం రోజులు భర్త గురుప్రీత్ సింగ్ తో అతని భార్య కరంబీర్ కౌర్ సంతోషంగా ఉంది.

 పుట్టింటికి చెక్కేసిన భార్య

పుట్టింటికి చెక్కేసిన భార్య


వివాహం జరిగిన కేవలం రెండు వారాలకే కరంబీర్ కౌర్ తాను పుట్టింటికి వెళ్లి వస్తానని, అక్కడ నాకు పని ఉందని ఆమె భర్త గురుప్రీత్ సింగ్ కు చెప్పింది. పుట్టింటి వాళ్ల మీద మమకారం ఎక్కువ అయ్యిందని, అందుకే వారిని చూడాలని అనుకుంటున్నదని బావించిన గురుప్రీత్ సింగ్ అతని భార్య కరంబీర్ కౌర్ ను పుట్టింటి దగ్గర వదిలిపెట్టాడు.

భర్తకు మాయమాటలు చెప్పి కాలం గడిపేసింది

భర్తకు మాయమాటలు చెప్పి కాలం గడిపేసింది

పుట్టింటికి వెళ్లిన భార్య కరంబీర్ కౌర్ కు ఫోన్ చేసిన గురుప్రీత్ సింగ్ మన ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతూనే ఉన్నాడు. కొన్ని రోజులు రేపు వారం వస్తాను, ఇంకా కొన్ని రోజుల తరువాత వస్తాను అని కరంబీర్ కౌర్ ఆమె భర్త గురుప్రీత్ సింగ్ కు మాయమాటలు చెబుతూ వచ్చింది. అప్పటి నుంచి భార్య కరంబీర్ కౌర్ ను కాపురానికి పిలుచుకురావాలని ఆమె భర్త గురుప్రీత్ సింగ్ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

 నీ ముఖం కూడా చూడాను.... వెళ్లిపో

నీ ముఖం కూడా చూడాను.... వెళ్లిపో

నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు, నీతో నేను కాపురానికి రాను అని భార్య ఎదురుతిరిగింది. నా భార్య కరంబీర్ కౌర్ ను ఎలాగైనా ఇంటికి పిలుచుకుని వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన గురుప్రీత్ సింగ్ అతని అత్తారింటికి వెళ్లాడు. పెళ్లి చేసిన మధ్యవర్తి గురుప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ అబ్బాయి మీ కోడలు ఇంటి ముందు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు.

అవమానంతో ఆత్మహత్య చేసుకున్న భర్త

అవమానంతో ఆత్మహత్య చేసుకున్న భర్త

భార్య కరంబీర్ కౌర్, అత్తమామలు అవమానించి ఇంటి ముందే చిత్రహింసలకు గురి చెయ్యడంతో గురుప్రీత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆత్మహత్య చేసుకునే ముందు తనకు ఫోన్ చేసి విషయం చెప్పాడని అతని అన్న నిర్మల్ సింగ్ ఘరిండా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం కలకలం రేపింది. భర్త గురుప్రీత్ సింగ్ ఆత్మహత్యకు కారణం అయిన అతని భార్య కరంబీర్ కౌర్, ఆమె కుటుంబ సభ్యులు పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Wife: A man committed suicide in Hamidpura village, which falls under the Gharinda police station near Amritsar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X