Wife: మొదటి భార్యను నడిరోడ్డులో నిలబెట్టి నరికి చంపేసిన భర్త, పోలీస్ స్టేషన్ లో కొడవలి పెట్టి, స్టోరీ చెప్పి
లక్నో: వివాహం చేసుకున్న దంపతులు మొదట్లో సంతోషంగా కాపురం చేశారు. రానురాను దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల మద్య రాజీ కుదరలేదు. భర్త మరో మహిళను రెండో పెళ్లి చేసుకుని ఆమెతో కూడా కాపురం చేస్తున్నాడు. కొంతకాలం తరువాత భర్త మీద కేసు పెట్టిన మొదటి భార్య అతన్ని జైల్లో పెట్టించింది. బెయిల్ మీద బయటకు వచ్చిన భర్త అతని మొదటి భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు. చివరికి మొదటి భార్యకు దూరంగా ఉంటూ రెండో భార్యతో కలిసి జీవిస్తున్నాడు. మొదటి భార్య మీద నిఘా వేసిన భర్త ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. చివరికి మొదటి భార్యను నడిరోడ్డులో నిలబెట్టి అందరి ముందు బహిరంగంగా నరికేశాడు. మొదటి భార్యను నరికి చంపిన భర్త నేరుగా వేరే పోలీస్ స్టేషన్ కు వెళ్లి రక్తం కారుతున్న కొడవలి టేబుల్ మీద పెట్టి లొంగిపోయి స్టోరీ మొత్తం చెప్పడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
ఉత్తరప్రదేశ్ లోని గోపాల్ గంజ్ ప్రాంతానికి చెందిన గుల్షన్ ఖాటూన్ అనే మహిళ కొన్ని సంవత్సరాల క్రితం షకీల్ అన్సారీ (50) అనే వ్యక్తిని వివాహం చేసుకునింది. షకీల్ అన్సారీ, గుల్షన్ దంపతులు లక్నో చేరుకుని గుడుంబా పోలీస్ స్టేషన్ పరిధిలోని జహీర్ పూర్ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని కొన్ని సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నారు.

ఒకే ఇంట్లో ఉంటున్నా ?
వివాహం చేసుకున్న తరువాత మొదట్లో షకీల్ అన్సారీ, గుల్షన్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రానురాను షకీల్ అన్సారీ, గుల్షన్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా షకీల్ అన్సారీ, గుల్షన్ దంపతుల మద్య రాజీ కుదరలేదు. కొంతకాలం ఒకే ఇంటిలో షకీల్ అన్సారీ, గుల్షన్ ఎవరిపాటికి వాళ్లు దూరంగా ఉన్నారు.

రెండో పెళ్లి...... భర్తను జైల్లో పెట్టించిన మొదటి భార్య
భార్య గుల్షన్ తీరుతో విసిగిపోయిన ఆమె భర్త షకీల్ అన్సారీ రెండు సంవత్సరాల క్రితం లైలా అనే మరో మహిళను రెండో పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేస్తున్నాడు. కొంతకాలం తరువాత తన భర్త షకీల్ అన్సారీ మరో మహిళను వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న అతని మొదటి భార్య గుల్షన్ అతన్ని జైల్లో పెట్టించింది.

మొదటి భార్య మీద పగ
మొదటి భార్య గుల్షన్ దెబ్బతో నెల రోజులకు పైగా జైల్లో ఉన్న షకీల్ అన్సారీ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. జైలు నుంచి విడుదలైన షకీల్ అన్సారీ అతని మొదటి భార్య గుల్షన్ తో మళ్లీ గొడవ పడ్డాడు. చివరికి మొదటి భార్య గుల్షన్ కు దూరంగా ఉంటూ రెండో భార్య లైలాతో కలిసి జీవిస్తున్నాడు. మొదటి భార్య గుల్షన్ మీద నిఘా వేసిన షకీల్ అన్నారీ ఎలాగైనా ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

నడిరోడ్డులో భార్యను నరికేసిన భర్త
కొంతకాలంగా మొదటి భార్య గుల్షన్ ఎక్కడికి వెలుతోంది, ఎప్పుడు తిరిగి వస్తోంది అంటూ షకీల్ అన్సారీ నిఘా వేశాడు. లక్నోలోని వికాస్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాగ్రని క్రాసింగ్ వద్ద వెలుతున్న మొదటి భార్య గుల్షన్ ను అడ్డగించిన షకీల్ అన్సారీ కొడవలి తీసుకుని నడిరోడ్డులో అందరూ చూస్తున్న సమయంలో ఇష్టం వచ్చినట్లు నరికేశాడు.

పోలీస్ స్టేషన్ లో కొడవలి పెట్టి స్టోరీ చెప్పిన భర్త
కుప్పకూలిపోయిన గుల్షన్ ను స్థానికులు, పోలీసులు కలిసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గుల్షన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు చెప్పారని లక్నో నార్త్ ఏడీసీపీ ప్రాచీ సింగ్ మీడియాకు చెప్పారు. మొదటి భార్య గుల్షన్ దారుణంగా నరికి చంపేసిన షకీల్ అన్సారీ నేరుగా గౌడంబా పోలీస్ స్టేషన్ కు వెళ్లి టేబుల్ మీద కొడవలి పెట్టి లొంగిపోయాడని లక్నో నార్త్ ఏడీసీపీ ప్రాచీ సింగ్ మీడియాకు చెప్పారు. మొత్తం మీద నడిరోడ్డులో భార్యను ఆమె భర్త నరికి చంపడం లక్నోలో కలకలం రేపింది.