చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: పక్కరూమ్ లో కూతురు. బెడ్ రూమ్ లో భర్తను గొడ్డలితో నరికి చంపేసిన భార్య !

|
Google Oneindia TeluguNews

చెన్నై/కన్యాకుమారి: వ్యాపారం చేస్తున్న వ్యక్తికి వివాహం అయ్యింది. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి అయ్యింది. దంపతులతో పాటు వారి చిన్న కుమార్తె హ్యాపీగా ఉంటున్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేసిన తరువాత దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రాత్రి చిన్న కూతురు వేరే రూమ్ లో నిద్రపోయింది. దంపతులు మరోరూమ్ లో నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత భార్య గొడ్డలి తీసుకుని ఆమె భర్తను ఇష్టం వచ్చినట్లు నరికేసింది. భర్త గట్టిగా కేకలు వెయ్యడంతో పక్కరూమ్ లో ఉన్న చిన్న కూతురు వచ్చే చూసేసరికి అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Singer: నాలుగు రాష్ట్రాలు, ఆరు మంది భార్యలు, ఈ సింగర్ పోటుగాడు, పైగా సిద్దాంతాలు, ఎలా చేశాడంటే ?Singer: నాలుగు రాష్ట్రాలు, ఆరు మంది భార్యలు, ఈ సింగర్ పోటుగాడు, పైగా సిద్దాంతాలు, ఎలా చేశాడంటే ?

 వ్యాపారం చేస్తున్న భర్త

వ్యాపారం చేస్తున్న భర్త

తమిళనాడులోని కన్యాకుమారిలో చెల్లప్పన్ (56) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 సంవత్సరాల క్రితం చెల్లప్పన్ లూర్ద్ మేరి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. చెల్లప్పన్, మేరీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చెల్లప్పన్ చాలా సంవత్సరాల నుంచి బెల్లం హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు.

 పెద్ద కూతురికి పెళ్లి చేశారు

పెద్ద కూతురికి పెళ్లి చేశారు

చెల్లప్పన్, మేరీ దంపతులు వారి పెద్ద కుమార్తెకు పెళ్లి చేశారు. భర్తతో కాపురం చేస్తున్న పెద్ద కుమార్తె చాలా సంతోంగా జీవిస్తున్నారు. పెద్ద కుమార్తె, ఆమె భర్త పుట్టింటికి వెళ్లి వస్తున్నారు. మేరీ, చెల్లప్పన్ దంపతులతో పాటు వారి చిన్న కుమార్తె కన్యాకుమారిలోని వారి సొంత ఇంటిలో చాలా హ్యాపీగా ఉంటున్నారు.

 దంపతుల మద్య గొడవలు

దంపతుల మద్య గొడవలు

పెద్ద కుమార్తెకు పెళ్లి చేసిన తరువాత చెల్లప్పన్, మేరీ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. బంధువులు, పెద్దలు చెల్లప్పన్. మేరీ దంపతుల మద్య రాజీ చేస్తున్నారు. చిన్న కుమార్తెకు పెళ్లి చెయ్యాలని, మీరు ఇలాంటి సమయంలో గొడవలుపడితే ఎలా అని పెద్దలు చెల్లప్పన్, మేరీ దంపతులకు బుద్దిమాటలు చెబుతూ వస్తున్నారు.

 బెడ్ రూమ్ లో భర్తను నరికి చంపేసిన భార్య

బెడ్ రూమ్ లో భర్తను నరికి చంపేసిన భార్య

ఇదే సందర్బంలో చెల్లప్పన్ కు వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్థిక సమస్యలతో నానా ఇబ్బందులు ఎదర్కొన్నాడు. రాత్రి చిన్న కూతురు వేరే రూమ్ లో నిద్రపోయింది. చెల్లప్పన్, మేరీ దంపతులు మరోరూమ్ లో నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత మేరీ ఇంటి బయటకు వెళ్లి గొడ్డలి తీసుకుని వెళ్లి నిద్రపోతున్న ఆమె భర్త చెల్లప్పన్ నున ఇష్టం వచ్చినట్లు నరికేసింది.

 తల్లిని రూమ్ లో పెట్టి లాక్ చేసిన కూతురు

తల్లిని రూమ్ లో పెట్టి లాక్ చేసిన కూతురు

నొప్పి తట్టుకోలేక చెల్లప్పన్ గట్టిగా కేకలు వెయ్యడంతో పక్కరూమ్ లో ఉన్న చిన్న కూతురు వచ్చే చూసేసరికి అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రక్తపు మడుగులో తండ్రి, చేతిలో గొడ్డలి పట్టుకుని తల్లి మేరీ నిలబడి ఉండటంతో కూతురు హడలిపోయింది. తల్లి మేరీని అదే రూమ్ లో పెట్టి బయట లాక్ చేసిన కూతురు బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు మేరీని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నిద్రపోతున్న భర్తను అతని భార్య గొడ్డలితో నరికి చంపేయడం కన్యాకుమారిలో కలకలం రేపింది.

English summary
Wife: Married woman who killed her husband in Kanniyakumari in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X