• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Wife plan: విజిట్ వస్తున్నావా ?, ప్రశ్నించిన భర్త ఫినిష్, ఇన్సూరెన్స్, ఆస్తి కోసం భార్య, అత్త స్కెచ్

|

చెన్నై/ అంబూర్ / తిరుపత్తూర్: కాంట్రాక్టు పనులతో పాటు సమాజసేవ చేస్తున్న వ్యక్తి హత్య కేసులో ఆయన భార్య, అత్తతో పాటు ఆరు మందిని అరెస్టు చేశారు. బంధువులు, కిరాయి హంతకులతో కలిసి భర్త హత్యకు అతని భార్య, అత్త స్కెచ్ వేశారని వెలుగు చూడటంతో కలకలం రేపింది. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చి మళ్లీ అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్న భార్యను నువ్వు విజిట్ వస్తున్నావా ? అంటూ ప్రశ్నించిన పాపానికి భర్త హత్యకు గురైనాడని పోలీసులు అన్నారు. మందుపార్టీ ఉందని నమ్మించి ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి పక్కాప్లాన్ తో చంపేసి ఆస్తితో పాటు రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవడానికి భార్య మాస్టర్ ప్లాన్ వేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !

 కాంట్రాక్టర్, నర్సు లవ్ మ్యారేజ్

కాంట్రాక్టర్, నర్సు లవ్ మ్యారేజ్

తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లా అంబూర్ సమీపంలోని అలంగుప్పం ప్రాంతానికి చెందిన రమేష్ బాబు, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న జయంతిమాల ప్రేమించుకున్నారు. ఇద్దరు కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. 10 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించిన రమేష్ బాబు, జయంతిమాల పెళ్లి చేసుకున్నారు. రమేష్ బాబు, జయంతిమాలకు 5 ఏళ్ల కుమార్తె, మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు.

 పక్క ఊరిలో భార్య నర్సు

పక్క ఊరిలో భార్య నర్సు

రమేష్ బాబు కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసి తరువాత ఉద్యోగం నిలిపివేసి ఇప్పుడు సమాజసేవ చేస్తూ చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. అంబూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జయంతిమాల నర్సుగా పని చేసింది. ఇటీవల నివాసం ఉంటున్న ఇంటికి దగ్గరగా ఉంటుందని సోలూర్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రిలో జయంతిమాల నర్సుగా ఉద్యోగంలో చేరింది.

 విజిట్ వచ్చి వెలుతున్నావా ?

విజిట్ వచ్చి వెలుతున్నావా ?

కొత్త ఆసుపత్రిలో నర్సుగా చేరిన తరువాత జయంతిమాల ప్రవర్తనలో మార్పు వచ్చిందని భర్త రమేష్ బాబుకు అనుమానం వచ్చింది. ఆసుపత్రి నుంచి రాత్రి 8 గంటలకు ఇంటికి వెలుతున్న జయంతిమాల కేవలం రెండు గంటలు మాత్రమే ఇంటిలో ఉంటూ రాత్రి 10 గంటలకు మళ్లీ తాను ఉద్యోగానికి వెలుతున్నానని రమేష్ బాబుకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నది. నువ్వు గెస్ట్ గా వచ్చినట్లు ఇంటికి వచ్చి వెలుతున్నావని, ఏమైనా విజిట్ వస్తున్నావా ? అంటూ రమేష్ బాబు కొంతకాలం నుంచి భార్య జయంతిమాలతో గొడవపెట్టుకుంటున్నాడు.

 తల్లితో కలిసి భర్త హత్యకు స్కెచ్

తల్లితో కలిసి భర్త హత్యకు స్కెచ్

రోజు రమేష్ బాబు, జయంతిమాల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తన భర్త రోజు గొడవపడుతున్నాడని, తన మీద అనుమానం ఎక్కువ అవుతోందని జయంతిమాల ఆమె తల్లి సరస్వతికి విషయం చెప్పింది. సమీప బంధువు అయిన రామ్ అనే వ్యక్తికి కిరాయి ఇచ్చి రమేష్ బాబును హత్య చెయ్యాలని జయంతిమాల, సరస్వతి స్కెచ్ వేశారు. రామ్ కూడా అందుకే ఓకే చెప్పాడు. రామ్ స్నేహితులు రంగపురం ధనుష్, విరిజిపురం విఘ్నేష్, గౌతమ్ రంగంలోకి దిగారు. రామేష్ బాబును హత్య చెయ్యడానికి అతని స్నేహితుడు మనోహరన్ సహాయం తీసుకున్నారు.

 జులైలో జస్ట్ మిస్

జులైలో జస్ట్ మిస్

జులై నెలలో రమేష్ బాబు పనిమీద వనియంబాడి వెళ్లి వస్తున్న సమయంలో తిరుపత్తూర్ జాతీయ రహదారిలో అతన్ని చంపడానికి రామ్ తదితరులు విఫలయత్నం చేశారు. అయితే గాయలతో బయటపడిన రమేష్ బాబు ఆసుపత్రిలో చేరి అతని స్నేహితులకు విషయం చెప్పాడు. పోలీసు కేసు పెడితే లేనిపోని సమస్యలు వస్తాయని స్నేహితులు ఉచిత సలహా ఇవ్వడంతో దిక్కుతోచక రమేష్ బాబు సైలెంట్ అయిపోయాడు. రమేష్ బాబును ఎలాగైనా హత్య చెయ్యాలని, తరువాత ఆస్తి, రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ తనకే వస్తుందని, అప్పుడు మీరు అడిగినంత డబ్బులు నేను ఇస్తానని భార్య జయంతిమాల ఆమె బంధువు రామ్ కు చెప్పింది.

మందు పార్టీలో ఫినిష్

మందు పార్టీలో ఫినిష్

ఆగస్టు 27వ తేదీ రాత్రి స్నేహితుడు మనోహరన్ వెళ్లి సుబ్రమణియన్ ఫామ్ హౌస్ లో మందు పార్టీ ఉందని నమ్మించి రమేష్ బాబును తీసుకెళ్లాడు. ఫామ్ హౌస్ లో మందుపార్టీ జరుగుతున్న సమయంలో రామ్, అతని స్నేహితులు విఘ్నేష్, గౌతమ్, రమేష్ కలిసి ఇనుపరాడ్లు తీసుకుని రమేష్ బాబు తలపై దాడి చేసి చంపేశాడు. తరువాత శవాన్ని తీసుకెళ్లి హైవే రోడ్డు సమీపంలోని బ్రిడ్జి కింద విసిరేశారు. రమేష్ బాబు బైక్ తీసుకెళ్లి బ్రిడ్జ్ ను ఢీకొట్టి ఆ బైక్ ను బ్రిడ్జి కిందకు తోసేసి ప్రమాదంలో అతను చనిపోయాడని చిత్రీకరించారు. అంబూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.

  Bigg Boss Telugu 4 : YouTuber Mahathalli & Husband Entry ! || Oneindia Telugu
   ఆస్తి, రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ కోసం !

  ఆస్తి, రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ కోసం !

  పోస్టుమార్టుం రిపోర్టులో రమేష్ బాబు తలపై ఇనుప రాడ్లతో దాడి చెయ్యడం వలన అతని ప్రాణాలు పోయాయని వెలుగు చూసింది. మందుపార్టీకి తీసుకెళ్లిన మనోహరన్ ను రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన పోలీసులు బెండ్ తియ్యడంతో అసలు విషయం మొత్తం బయటకు వచ్చింది. తన తిరుగుడుకు భర్త రమేష్ బాబు అడ్డుపడుతున్నాడని రగిలిపోయిన భార్య జయంతిమాల పక్కా స్కెచ్ ప్రకారం హత్య చేయించిదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రమేష్ బాబు హత్య కేసులో అతని భార్య జయంతిమాల, అత్త సరస్వతి, కిరాయి కోసం హత్య చేసిన రామ్, విఘ్నేష్, గౌతమ్, రమేష్ అనే ఆరు మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

  English summary
  Wife master plan: Police have arrested six people, including a wife and mother-in-law, for killing their husbands by mercenaries by relatives near Ambur in Tirupattur district in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X