బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: పెళ్లైన కొత్తలోనే టీచర్ భార్య ?, కేసు క్లోజ్ చెయ్యాలని లక్షలు ఆఫర్ ?, బాండ్ పేపర్లు తెచ్చి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బళ్లారి/ యాదగిరి: ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న యువకుడితో యువతి వివాహం చేస్తే ఆమె జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు బావించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఊర్లు చాలా దూరంలో ఉన్నా కూడా అమ్మాయి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. ఐదు నెలల క్రితం గ్రాండ్ గా వివాహం జరిగింది. జీవితాంతం భర్తతో కలిసి సుఖంగా జీవించాలని ఆ యువతి అత్తారింటిలో అడుగు పెట్టింది. భర్త ఇంటిలో ఉన్న నవవధువు అనుమానాస్పద స్థితిలో మరణించింది. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ప్రముఖ రాజకీయ నాయకులు, స్థానిక పెద్దలు, కొందరు పోలీసులు కలిసి నవవధువు అనుమానాస్పద మృతి కేసు మూసివేయడానికి రూ. 11 లక్షలు డీల్ మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. జీవితంలో ఇక ముందు టీచర్ భర్త మీద కేసు పెట్టమని అమ్మాయి కుటుంబ సభ్యుల దగ్గర బలవంతంగా బాండ్ పేపర్లలో రాపించి సంతకాలు పెట్టడానికి ప్రయత్నించారని వెలుగు చూడటం కలకలం రేపింది.

Illegal affair: భర్త డాక్టర్, పొలిటికల్ లీడర్, భార్య జ్యూస్ పిండేసిన జిమ్ ట్రైనర్, షార్ప్ షూటర్స్ తో !Illegal affair: భర్త డాక్టర్, పొలిటికల్ లీడర్, భార్య జ్యూస్ పిండేసిన జిమ్ ట్రైనర్, షార్ప్ షూటర్స్ తో !

ప్రభుత్వ స్కూల్ టీచర్ ఉద్యోగం

ప్రభుత్వ స్కూల్ టీచర్ ఉద్యోగం

కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలుకు చెందిన రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు ప్రస్తుతం యాదగిరిలో ప్రభుత్వ స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులో నివాసం ఉంటున్న రాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో రాజేష్ పెళ్లి చెయ్యాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 బెంగళూరులో గ్రాండ్ గా పెళ్లి

బెంగళూరులో గ్రాండ్ గా పెళ్లి

ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న రాజేష్ తో రాజేశ్వరి వివాహం చేస్తే ఆమె జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు బావించారు. పెళ్లి కొడుకు రాజేష్ యాదగిరిలో నివాసం ఉండటంతో, పెళ్లి కూతురు ఊరు బెంగళూరుకు చాలా దూరం ఉన్నా కూడా అమ్మాయి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. ఐదు నెలల క్రితం బెంగళూరులో రాజేశ్వరి, రాజేష్ ల వివాహం గ్రాండ్ గా జరిగింది.

నవవధువు అనుమానాస్పద మృతి

నవవధువు అనుమానాస్పద మృతి


జీవితాంతం భర్త రాజేష్ తో కలిసి సుఖంగా జీవించాలని రాజేశ్వరి అత్తారింటిలో అడుగు పెట్టింది. యాదగిరిలోని మాణికేశ్వరి నగర్ లో రాజేశ్వరి, రాజేష్ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త రాజేష్ ఇంటిలో ఉన్న నవవధువు రాజేశ్వరి ఈనెల 23 తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. విషయం తెలుసుకున్న రాజేశ్వరి కుటుంబ సభ్యులు షాక్ అయ్యి యాదగిరికి పరుగు తీశారు.

రూ. 11 లక్షలు ఇచ్చి రాజీ చెయ్యాలని ప్రయత్నం ?

రూ. 11 లక్షలు ఇచ్చి రాజీ చెయ్యాలని ప్రయత్నం ?

ప్రముఖ రాజకీయ నాయకులు, స్థానిక పెద్దలు, కొందరు పోలీసులు జోక్యం చేసుకుని నవవధువు రాజేశ్వరి అనుమానాస్పద మృతి కేసు మూసివేయడానికి ఆమె కుటుంబ సభ్యులు, కొందరు పోలీసులతో రూ. 11 లక్షలు డీల్ మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. జీవితంలో ఇక ముందు టీచర్ రాజేష్ మీద కేసు పెట్టమని రాజేశ్వరి కుటుంబ సభ్యుల దగ్గర బలవంతంగా బాండ్ పేపర్లలో రాపించి సంతకాలు పెట్టడానికి ప్రయత్నించారని వెలుగు చూడటం కలకలం రేపింది. అయితే రాజేశ్వరి అనుమానాస్పద స్థితి కేసు నమోదు చేశామని, విచారణ చేస్తున్నామని, రాజీ చెయ్యడానికి మేము ప్రయత్నించలేదని, ఎవ్వరి ఒత్తిడి చేసినా మేము పట్టించుకోమని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Wife: Money offer to police for Bengaluru women death case close in Yadgiri in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X