వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి మార్పింగ్ వీడియో ఇష్యూ : సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రశాంత్ భార్య.. రేపు పిటిషన్ విచారణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మార్ఫింగ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రశాంత్ కనౌజాను అరెస్ట్ చేయడాన్ని ఆయన భార్య తప్పుపట్టారు. తన భర్తను అరెస్ట్ చేసేముందు పోలీసులు ఐటీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టుకు ..
యూపీ పోలీసుల వైఖరిని నిరసిస్తూ ప్రశాంత్ భార్య సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసు విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం .. మంగళవారం విచారిస్తామని స్పష్టంచేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Wife of journalist held for objectionable tweet on Yogi Adityanath moves SC

అందులో ఓ మహిళ తనను పెళ్లి చేసుకోవాలని యోగి ఆదిత్యనాథ్‌ను కోరుతుంది. యోగి ఆదిత్యనాథ్ బ్రహ్మచారి అనే విషయం తెలిసిందే. ఆ మహిళ వీడియో ముందు యోగి ఫోటో మార్పింగ్ చేసి .. ప్రశాంత్ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. దీనిని తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరలవడంతో .. పోస్ట్ పెట్టిన ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలసిందే.

మరో ముగ్గురి అరెస్ట్ ...
ప్రశాంత్ వీడియో పోస్టు చేశాక .. ఈ అంశంపై న్యూస్ చానెల్లో చర్చ కూడా జరిగింది. దీంతో డిబేట్ చేసిన చానెల్ యాజమాన్యంపై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. టీవీ చానెల్ హెడ్ ఇషిక సింగ్, ఎడిటర్ అనూజ్ శుక్లాను ఇప్పటికే నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ షేర్ చేసిన వీడియో ఇష్యూ .. జూన్ 6న జరిగిన టీవీ చర్చల్లో ప్రస్తావన వచ్చింది.

ఓ మహిళ ప్రతినిధి వీడియో అంశాన్ని ప్రస్తావిస్తూ .. యోగి పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారు. ప్రశాంత్, ఇషిక, అనూజ్‌తో పాటు నాలుగో వ్యక్తిని గోరఖ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీవీ చానెల్లో చర్చిస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసుల తీరును ఎడిటర్స్ గిల్డ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే.

English summary
the wife of journalist, Prashant Kanojia moves Supreme Court after he was arrested for allegedly defaming Uttar Pradesh Chief Minister Yogi Adityanath. The Supreme Court will hear the case on Tuesday (June 11). The petition filed by the journalist's wife claimed that police didn't follow the necessary legal guidelines during the arrest and therefore it is illegal. The Noida-based journalist Prashant Kanojia had shared a video on Twitter and Facebook where a woman is seen speaking to media outside the CM's office claiming she had sent a marriage proposal to Yogi Adityanath. The news channel had broadcast a video during a debate on the same issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X