వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్వేగంతో.. జైలులోనే కన్నీటిపర్యంతమైన డేరాబాబా!

అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా మాజీ చీఫ్ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ ను మంగళవారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా మాజీ చీఫ్ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ ను మంగళవారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సభ్యులు కలిశారు.

దీపావళిని పురస్కరించుకుని గుర్మీత్ భార్య హర్జీత్‌ కౌర్‌, కుమార్తె, చరణ్ ప్రీత్, కుమారుడు జస్మీత్ సింగ్, కోడలు సన్మీత్, అల్లుడు అమర్ ప్రీత్ సునారియా జైలుకు వెళ్లి ఆయనను పరామర్శించారు.

కుటుంబ సభ్యులను చూడగానే డేరాబాబా జైలులోనే కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. వారిని చూడగానే ఆయన ఉద్వేగాన్ని అణుచుకోలేక ఏడ్చేశారని సమాచారం.

Wife, other relatives meet Ram Rahim in Rohtak jail

కుటుంబ సభ్యులు ఆయనను ఓదార్చి.. తాము తీసుకొచ్చిన స్వీట్లు, చలికాలంలో వేసుకునే దుస్తులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ డేరా బాబా కుటుంబ సభ్యులు సుమారు గంటన్నరపాటు ఆయనతో మాట్లాడినట్టు తెలిపారు.

వాస్తవానికి జైలు నిబంధనల ప్రకారం సందర్శకులను మధ్యాహ్నం 2 గంటలకు అనుమతించాల్సి ఉండగా, డేరాబాబా భద్రత దృష్ట్యా అయనను చూసేందుకు వారిని 3 గంటలకు అనుమతించినట్లు చెప్పారు.

English summary
Family members of the jailed head of Sirsa-based Dera Sacha Sauda Gurmeet Ram Rahim Singh came to meet him at the Sunaria jail in Rohtak today. The dera chief is currently undergoing 20-year rigorous imprisonment for raping two of his women disciples. The family members of the jailed dera head who came to meet him in jail today included his wife Harjeet Kaur, son Jasmeet Singh, daughter-in-law Sanmeet, daughter Charanpreet and son-in-law Rooh-e-Meet. The cars carrying the dera head’s family members reached the Sunaria jail complex this afternoon. They were allowed to go for the meeting after a thorough security check.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X