Wife: రాత్రి దుప్పటి కప్పుకుని సీక్రేట్ గా భార్య ?, స్పాట్ లో నరికి చంపేసిన భర్త, ఒకే కంపెనీలో ఆమె !
చెన్నై/తిరుప్పూర్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త పనికి వెలుతున్నాడు, భార్య గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నది. ఫ్యాక్టరీలో పని ఎక్కువగా ఉందని చెబుతున్న భార్య రాత్రి ఎప్పుడంటే అప్పుడు ఇంటికి రావడం మొదలు పెట్టింది. ఒకే చోట ఉద్యోగం చేస్తున్న యువకుడితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలిసిపోయింది. ఇదే సమయంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా భార్య ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడుతున్న విషయం భర్త గమనించాడు. ఈ విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. వేకువ జామున 2. 30 గంటల సమయంలో భార్య దుప్పటి కప్పుకుని లోపల సెల్ ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడుతున్న విషయం గమనించిన భర్త రగిలిపోయాడు. అంతే కోపం తట్టుకోలేని భర్త కొడలి తీసుకుని అతని భార్యను బెడ్ మీద నరికి చంపేయడం కలకలం రేపింది.
Illegal
affair:
ప్రియుడిని
లాడ్జ్
కు
పిలిపించి
బాత్
రూమ్
లో
నరికేశారు.
మరో
లేడీ
ఎంట్రీతో,
ఫినిష్!

కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి
తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాకు చెందిన కుమార్ (32) అనే యువకుడు కూలి పని చేస్తున్నాడు. 12 సంవత్సరాల క్రితం దనలక్ష్మి అనే యువతిని కుమార్ వివాహం చేసుకున్నాడు. కుమార్, దనలక్ష్మి దంపతులకు 9 ఏళ్లు, 7 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు.. ఇద్దరు కొడుకులతో కలిసి కుమార్, ధనలక్ష్మి దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాలం గడిపారు.

గార్మెంట్స్ లో ఉద్యోగం చేస్తున్న భార్య
కుమార్, ధనలక్ష్మి దంపతులు తిరుపూర్ లోని జేజే నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుమార్ తేన్ కాశీలోనే కూలీ పనులు చేస్తున్నాడు. తిరుప్పూర్ లోని ఓ బనియన్ కంపెనీలో కుమార్ భార్య ధనలక్ష్మి ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజు ఉదయం కంపెనీలో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న ధనలక్ష్మి రాత్రి ఇంటికి చేరుకుంటున్నది.

కంపెనీలో పని ఉందని ప్రియుడితో ఎంజాయ్
ఇటీవల కాలంలో ధనలక్ష్మి రాత్రి లేటుగా ఇంటికి రావడం మొదలు పెట్టిందని తెలిసింది. బనియన్ ఫ్యాక్టరీలో పని ఎక్కువగా ఉందని భర్త కుమార్ కు చెబుతున్న ధనలక్ష్మి రాత్రి ఎప్పుడంటే అప్పుడు ఇంటికి రావడం మొదలు పెట్టిందని తెలిసింది. ఈ విషయంలో కుమార్, ధనలక్ష్మి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

భార్య అక్రమ సంబంధం గురించి భర్తకు తెలిసిపోయింది
ఒకే చోట ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడితో తన భార్య ధనలక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త కుమార్ కు తెలిసిపోయింది. బనియన్ కంపెనీలో పని పూర్తి అయిన తరువాత నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అంటూ కుమార్ అతని భార్య ధనలక్ష్మితో రోజూ గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు.

పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్ లో మాట్లాడుతున్న భార్య
ఇదే సమయంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా ధనలక్ష్మి ఎప్పుడంటే అప్పుడు వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతున్న విషయం ఆమె భర్త కుమార్ గమనించాడు. ఈ విషయంలో కుమార్, ధనలక్ష్మి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. దంపతులకు సర్ది చెప్పడానికి వారి కుటుంబ సభ్యులు దగ్గర్లో లేకపోవడంతో గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి.

భార్యను బెడ్ రూమ్ లో నరికి చంపేసిన భర్త
రాత్రి గొడవపడిన కుమార్, ధనలక్ష్మి దంపతులు తరువాత నిద్రపోయారు. వేర్ రూమ్ లో పడుకున్న ధనలక్ష్మి వేకువ జామున 2. 30 గంటల సమయంలో దుప్పటి కప్పుకుని లోపల సెల్ ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడుతున్న విషయం గమనించిన కుమార్ రగిలిపోయాడు. అంతే కోపం తట్టుకోలేని కుమార్ కొడలి తీసుకుని అతని భార్య ధనలక్ష్మిని బెడ్ మీద నరికి చంపేయడం కలకలం రేపింది.