• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife sister: కత్తి లాంటి భార్య చెల్లెలు, మరదలి కోసం రూ. 10 లక్షలు డీల్, బావకు బిల్ల మిగిలింది !

|

బెంగళూరు/ చెన్నై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడికి ఓ అందమైన అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకున్న యువకుడు సంతోషంగా భార్యతో కాపురం చేస్తున్నాడు. ఇదే టైమ్ లో మనోడికి మనసు మళ్లింది. భార్యకు అందమైన చెల్లి ఉన్న విషయం ముందే తెలిసినా అంతగా పట్టించుకోని బావ చివరికి విరహంతో మరదలి మీద మోజుపడ్డాడు. ఎర్రగా, సన్నగా, నాజూకుగా ఉన్న మరదలిని చూస్తే బావకు నరాలు అటూఇటు తిరిగిపోయాయి. ఎలాగైనా భార్య సొంత చెల్లి అయిన మరదిలితో ఎంజాయ్ చెయ్యాలని బావ డిసైడ్ అయ్యాడు. మరదలిని లొంగదీసుకోవడానికి బావ ఏకంగా రూ. 10 లక్షలు ఖర్చు పెట్టాడు. చివరికి గ్రహాలు అన్ని ఒకేసారి బావ ఇంట్లో దూరడంతో మనోడికి బిల్ల మాత్రం మిగిలి అతను ఖర్చు చేసిన రూ. 10 లక్షలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.

Illegal affair: రెండో భర్త, ప్రియుడు 10 ఏళ్లు కుర్రాళ్లు, మొగుడు ఫారిన్ లో, ఇంట్లోనే శవం !Illegal affair: రెండో భర్త, ప్రియుడు 10 ఏళ్లు కుర్రాళ్లు, మొగుడు ఫారిన్ లో, ఇంట్లోనే శవం !

 ప్రభుత్వ ఉద్యోగం.... మంచి సంబంధం

ప్రభుత్వ ఉద్యోగం.... మంచి సంబంధం

కర్ణాటకలోని హుబ్బళి-ధార్వాడ జంట నగరాల శిశు సంక్షేమ శాఖ, శిశు సంరక్షణా శాఖ కార్యాలయంలో మక్తం ఆలీ టపేధార్ (35) అనే వ్యక్తి ఎఫ్ డీఐ స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. హుబ్బళిలోని కుందగోళ ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మక్తం ఆలీకి నాజియా బాను అనే యువతిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు.

అందమైన భార్య

అందమైన భార్య

మక్తం ఆలీకి, నజియా బానుకు ఇంతకు ముందే గ్రాండ్ గా వివాహం అయ్యింది. అందమైన భార్య నజియా బానుతో కాపురం చేస్తూ, రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తూ మక్తుం ఆలీ చాలా సంతోషంగా ఉండేవాడు. తన జీవితంలోకి, తన కాపురంలోకి, తన భర్త మక్తుం ఆలీ మనుసులోకి సొంత చెల్లెలు ఎంట్రీ ఇస్తుంది అని నజియా బాను అస్సలు ఊహించలేదు.

 కత్తిలాంటి మరదలు.... తట్టుకోలేకపోయాడు

కత్తిలాంటి మరదలు.... తట్టుకోలేకపోయాడు

భార్య నజియా బానుకు కత్తిలాంటి సొంత చెల్లెలు ఉన్న విషయం మక్తుం ఆలీకి ముందే తెలుసు. ఇంటికి వచ్చి వెలుతున్న మరదలిని మక్తుం ఆలీ పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అయితే భార్య నజియా బాను సొంత చెల్లెలు మీద అనుకోకుండా మక్తుం ఆలీ కన్నుపడింది. ఎర్రగా, సన్నగా, నాజూకుగా ఉన్న కత్తిలాంటి మరదలి మీద బావ మక్తుం ఆలీ కన్ను వీరలెవల్లో పడటంతో కథ మలుపు తిరిగింది.

 సారీ బావా...... ఆ విషయంలో నో

సారీ బావా...... ఆ విషయంలో నో

ఇంటికి వచ్చి వెలుతున్న మరదలిని లొంగదీసుకోవడానికి మక్తుం ఆలీ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే సొంత అక్క కాపురంలో చిచ్చు రేపినట్లు ఉంటుందని బావించిన మరదలు సారీ బావా........... ఆ విషయంలో ?...... దానికి ? నేను ఒప్పుకోను అని తేల్చిచెప్పిందని తెలిసింది. కత్తిలాంటి మరదలు ఎంతకాలానికి లొంగకపోవడంతో బావ మక్తుం ఆలీ విరహం తట్టుకోలేక భలే స్కెచ్ వేశాడు.

 మరదలి కోసం రూ. 10 లక్షలు డీల్

మరదలి కోసం రూ. 10 లక్షలు డీల్

ఇదే సమకంలో మక్తుం ఆలీ మరదలికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆలస్యం అయితే తన మరదులు వేరేవాడికి భార్య అయిపోతుందని, తరువాత తన కోరిక తీరదని మక్తుం ఆలీ అతిగా ఆలోచించాడు. ఎలాగైనా తన మరదలిని కిడ్నాప్ చేసి ఎత్తుకుని వెళ్లిపోయి వారం రోజులు ఎంజాయ్ చేస్తే చచ్చినట్లు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని మక్తం ఆలీ పప్పులో కాలేశాడు.

 రూ. 5 లక్షలు అడ్వాన్స్..... మరదలు కిడ్నాప్

రూ. 5 లక్షలు అడ్వాన్స్..... మరదలు కిడ్నాప్

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పనికిరాని స్కెచ్ వేసిన మక్తుం ఆలీ ఓ ఫ్రెండ్ ద్వారా కిరాయి ముఠా సభ్యులైన ప్రవీణ్ నాయక్ (25), అతని స్నేహితుడు చేతన్ (28) అనే ఇద్దరిని కలిసి తన మరదలిని సేఫ్ గా కిడ్నాప్ చేసి తనకు అప్పగించాలని డీల్ మాట్లాడి రూ. 5 లక్షలు అడ్వాన్ ఇచ్చాడు. ఏప్రిల్ 13వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన మక్తుం ఆలీ మరదలిని కారులో ప్రవీణ్, చేతన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది.

 కిలాడీ బావ ఎక్కడ ?

కిలాడీ బావ ఎక్కడ ?

తన చెల్లిని ఎవరో కిడ్నాప్ చేశారని, మీరు కాపాడాలని నజియా బాను, ఆమె తల్లి ధారవాడలోని షహర పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అనేక కోణాల్లో విచారణ చేసిన పోలీసులు వారి కన్ను యువతి బావ మక్తుం ఆలీ మీదపడింది. మరదలిని కిడ్నాప్ చేసి ధారవాడ సమీపంలోని ఫామ్ హోస్ లో పెట్టి ఎంజాయ్ చేస్తున్న బావ మక్తుం ఆలీ కోసం పోలీసులు గాలించారు.

 బావకు ఉద్యోగం, రూ. 10 లక్షలు పోయింది.... బిల్ల మిగిలింది

బావకు ఉద్యోగం, రూ. 10 లక్షలు పోయింది.... బిల్ల మిగిలింది

భార్య నజియా బానుకు ఫోన్ చేసిన ఆమె భర్త మక్తుం ఆలీ తాను ఉద్యోగం పని మీద బయట ఊరికి క్యాంప్ కు వెళ్లానని, రెండు మూడు రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. నజియా బానుకు ఫోన్ చేసిన మక్తుం ఆలీ ఫోన్ నెంబర్ ట్రేస్ చేసిన పోలీసులు అతన్ని పట్టుకుని యువతిని రక్షించారు. మక్తుం ఆలీ ఇచ్చిన సమాచారం మేరకు యువతిని కిడ్నాప్ చేసిన ప్రవీణ్, చేతన్ ను అరెస్టు చేశారు. మరదిలి మీద మోజుతో రూ. 10 లక్షలు ఇచ్చి కిడ్నాప్ చేయించిన బావ మక్తుం ఆలీని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఉద్యోగం పోయి అరెస్టు అయిన బావ మక్తుం ఆలీకి ఇప్పుడు మరదలు పోయింది, రూ. 10 లక్షలు పోయింది, కేవలం జైల్లో చిప్ప, ఆడుకోవడానికి ఓ బిల్ల మాత్రం మిగిలింది.

English summary
Wife sister: A man gives Rs 10 lakh supari for wife sister kidnap at Hubli and Dharwad in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X