వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:పెళ్ళికొడుకును చితకబాదిన భార్య, పెళ్ళికూతురుపై కూడ దాడి...ఎందుకంటే?

తనకు పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి రెండో పెళ్ళికి సిద్దమైన వరుడిని మొదటి భార్య చితకబాదింది.పెళ్ళి మంటపానికి ఊరేగింపుగా వెళ్తోన్న భర్తను ఆమె చితకబాదింది. పెళ్ళికుమార్తెను కూడ చితకబాదాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లూథియానా:మరికొద్ది నిమిషాల్లో అతడికి ఘనంగా వివాహం జరగాల్సి ఉంది.వరుడిని ఊరేగింపుగా వివాహ మండపానికి తరలిస్తున్నారు. అయితే ఓ మహిళ వచ్చి పెళ్ళి కొడును రోడ్డుపైనే పట్టుకొని చితకబాదింది.ఆయన తన భర్త అని, ఈ విషయాన్ని దాచిపెట్టి రెండో పెళ్ళికి సిద్దమయ్యాడని చెప్పింది. వధువుపై కూడ మొదటి భార్య దాడికి పాల్పడింది.ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

వివాహ వేడుక వద్ద పెళ్ళికొడుకును భార్య చితకబాదడంతో వివాహం రద్దైంది. పెళ్ళికొడుకును పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పెళ్ళికొడుకుతో పాటు ఆయన బంధువులను, ఆరోపణలు చేసిన మహిళను పోలీసు స్టేషన్ కు తరలించారు పోలీసులు.

అయితే తమకు 14 ఏళ్ళ క్రితం వివాహమైందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. 13 ఏళ్ళ కొడుకు కూడ ఉన్నాడని బాధితురాలు మహిళా పోలీసులకు చెప్పారు. తనకు విడాకులు ఇవ్వకుండానే తన కంటే 18 ఏళ్ళు చిన్నదైనా అమ్మాయిని పెళ్ళి చేసుకొంటున్నాడని చెప్పింది.

‘Wife’ thrashes groom for attempting second marriage

బావ తరచూ వేధిస్తుండడంతో తన సోదరి పుట్టింటికి వచ్చిందని బాధితురాలి సోదరుడు చెప్పాడు. రెండు రోజుల క్రితం రెండో వివాహం చేసుకొంటున్నాడనే విషయం తెలిసి నిలదీశామని చెప్పారు.

అయితే మొదట్లో ఆమె ఎవరో తెలియదని బుకాయించిన వరుడు తర్వాత తాను ఆమెకు విడాకులు ఇచ్చానని, తన దగ్గర ఆధారం ఉందన్నారు. విడాకులు ఇచ్చినట్టు తమకు చెప్పడంతో పెళ్ళికి అంగీకరించామని వధువు కుటుంబసభ్యులు చెప్పారు. రెండో పెళ్ళి విషయంలో వివాదం ఏర్పడిందని, నివేదిక తయారు చేసి తదుపరి చర్యల కోసం కోర్టుకు పంపిస్తామన్నారు పోలీసులు.

English summary
A high drama was witnessed during a marriage function at a restaurant at Sat Pal Mittal road (famously knows as Malhar road) after a woman, claiming to be wife of the groom, created ruckus and stopped the ceremony on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X