Wife: లవ్ మ్యారేజ్, పెళైన 8 నెలలకే భర్త ఏంచేశాడంటే ?, పుట్టింటిలోని బెడ్ రూమ్ లో భార్య ? !
చెన్నై/టీ నగర్: కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి బుద్దిగా చదువుకుంటున్నది. ఆ సమయంలో కాలేజ్ అమ్మాయికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అప్పటికే సొంతంగా స్టూడియో పెట్టుకుని డబ్బులు సంపాధిస్తున్న యువకుడు, కాలేజ్ అమ్మాయి ప్రేమలోపడ్డారు. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమికులు గుడిలో పెళ్లి చేసుకుని అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. పెళ్లి జరిగిన రెండు నెలలకు భర్త మద్యంకు బానిస అయ్యాడని, ఇంతకు ముందు ఆ విషయం తన దగ్గర దాచిపెట్టాడని భార్యకు తెలిసిపోయింది. రోజూ మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భర్త అతని భార్య మీద అనుమానంతో టార్చర్ పెట్టాడు. భర్త తీరుతో విసిగిపోయిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను మోసం చేశాడని, తన జీవితం నాశనం చేశాడని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల దగ్గర ఆమె విచారం వ్యక్తం చేసింది. పుట్టింటిలో ఉంటున్న యువతి లవ్ మ్యారేజ్ చేసుకున్న 8 నెలలకే ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు.
Illegal
affair:
ప్రియురాలితో
ఎంజాయ్
చేసి
అక్కడే
చంపేశాడు,
11
ఏళ్ల
క్రితం
భార్యను
చంపి
తీహార్
జైల్లో!

కాలేజ్ అమ్మాయి
చెన్నై సిటీలోని తాంబరం సమీపంలోని పాత పెరుంగళత్తూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న మురుగన్, అముద దంపతులకు మేఘలయ అలియాస్ లయా (22) అనే కుమార్తె ఉంది. చెన్నైలోని కాలేజ్ లో బీకామ్ చదువుతున్న సమయంలో లయ ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వచ్చేది. కాలేజ్ కు వెళ్లే సమయంలో లయా బుద్దిగా చదువుకునింది.

ప్రేమలో పడిన కాలేజ్ అమ్మాయి
కాలేజ్ కు వెళ్లే సమయంలో లయాకు యువరాజ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అప్పటికే సొంతంగా స్టూడియో పెట్టుకుని డబ్బులు సంపాధిస్తున్న యువరాజ్, కాలేజ్ అమ్మాయి లయా ప్రేమలోపడ్డారు. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న ప్రేమికులు లయా, యువరాజ్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

ఉద్యోగంలో చేరిన ప్రియురాలు
కాలేజ్ లో బీకామ్ పూర్తి చేసిన లయా చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తున్న లయా ప్రతిరోజు ఆమె ప్రియుడు యవరాజ్ ను కలిసేది. ఇద్దరూ డబ్బులు సంపాధిస్తుండటంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమికులు యువరాజ్, లయా 8 నెలల క్రితం చెన్నైలోని గుడిలో పెళ్లి చేసుకుని అద్దె ఇంటిలో కాపురం పెట్టారు.

అనుమానంతో టార్చర్ పెట్టిన భర్త
పెళ్లి జరిగిన రెండు నెలలకు భర్త యువరాజ్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడని, ఇంతకు ముందు ఆ విషయం తన దగ్గర దాచిపెట్టాడని లయాకు తెలిసిపోయింది. రోజూ మద్యం సేవించి ఇంటికి వెలుతున్న యువరాజ్ అతని భార్య లయా క్యారెక్టర్ మీద అనుమానంతో ఆమెను టార్చర్ పెట్టాడు.

లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్త మోసం చేశాడు
భర్త యువరాజ్ తీరుతో విసిగిపోయిన అతని భార్య లయా నెల రోజుల క్రితం చెన్నైలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త యువరాజ్ తనను మోసం చేశాడని, తన జీవితం నాశనం చేశాడని, తాను తల ఎత్తుకుని తిరగలేకపోతున్నానని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల దగ్గర లయా విచారం వ్యక్తం చేసింది.

లవ్ మ్యారేజ్ చేసుకున్న 8 నెలలకే ఆత్మహత్య
పుట్టింటిలో ఉంటున్న లయా బెడ్ రూమ్ లోకి వెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్న 8 నెలలకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు. లయా కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో యువరాజ్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.