• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife: అత్తకు అత్యాశ, కోడలికి కోపం, మొగుడు మూర్ఖుడు, వేరే అకౌంట్ పెడుతా, జీవితం నాశం !

|

చెన్నై/ మదురై: ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం కలిసి జీవించాలని ఆమె నిర్ణయించింది. తల్లిదండ్రులను ఒప్పించి ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆమె చక్కగా కాపురం చేసి ఓ పాపకు జన్మనిశ్చింది. అదే సమయంలో భర్తకు బదిలి కావడంతో అత్తగారి ఇంటిలో కాపురం చెయ్యడానికి వెళ్లిన మహిళకు సినిమా కష్టాలు ఎదురైనాయి. అత్తకు ఆశ ఎక్కువ, కోడలికి కోపం ఎక్కువ, వేరే అకౌంట్ పెడుతానని మొగుడు మూర్ఖంగా మాట్లాడటంతో ఇంటి కథ రివర్స్ అయ్యింది. నువ్వు కాకపోతే మరోకటి అంటూ మొగుడు బయట తిరుగుతానని భార్యను హెచ్చరించడంతో ఆమె విరక్తి పెంచుకుంది. పసిబిడ్డను చంపేసి ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

NRI wife: అబ్బా.... ఎంతపని చేసింది, లాడ్జ్ లో ?, నిన్న మొగుడు, నేడు ప్రియుడు, హైటెక్ స్కెచ్ !NRI wife: అబ్బా.... ఎంతపని చేసింది, లాడ్జ్ లో ?, నిన్న మొగుడు, నేడు ప్రియుడు, హైటెక్ స్కెచ్ !

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లా మాయిలాదుత్తరై ప్రాంతంలోని మేలముడుక్కు వీధిలో నివాసం ఉంటున్న పార్థీబన్ అనే వ్యక్తి రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. సెల్వకుమారి అనే యువతితో కొన్ని సంవత్సరాలు ప్రేమలో పడిన పార్థీబన్ చివరికి కుటుంబ సభ్యులను ఒప్పించి రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.

అత్త ఇంటికి కాపురం

అత్త ఇంటికి కాపురం

పార్థీబన్, సెల్వకుమారి దంపతులకు లిపిషా అనే కుమార్తె పెట్టింది. ఇటీవల పార్థీబన్ కు విరూద్ నగర్ కు బదిలి అయ్యింది. భార్య సెల్వకుమారిని తల్లిదండ్రుల ఇంటిలో విడిచిపెట్టిన పార్థీబన్ విరూద్ నగర్ లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. అత్తగారి ఇంటిలో ఉంటున్న సెల్వకుమారి వాళ్లు చెప్పినట్లు నడుచుకుంటున్నది.

 అత్తకు ఆశ ఎక్కువ..... కోడలికి కోపం ఎక్కువ

అత్తకు ఆశ ఎక్కువ..... కోడలికి కోపం ఎక్కువ

పార్థిబన్ తల్లి ధనలక్ష్మికి డబ్బు, బంగారం అంటే ఆశ ఎక్కువ అని తెలిసింది. కన్న కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న కోడులు సెల్వ కుమారిని కట్నం తీసుకుని రావాలని ధనలక్ష్మి వేధించడం మొదలుపెట్టిందని తెలిసింది. ఇప్పటికే తాను పుట్టింటి నుంచి బంగారు నగలు తీసుకు వచ్చానని, ఇక మళ్లీ నేను మా ఇంటి నుంచి బంగారు నగలు తీసుకురానని కోడలు సెల్వకుమారి చాలా కోపంగానే అత్త ధనలక్ష్మికి సమాధానం చెబుతూ వచ్చింది.

ఆ రోజు అర్జెంట్ గా పెళ్లి చేశారు

ఆ రోజు అర్జెంట్ గా పెళ్లి చేశారు

ప్రేమపెళ్లి వెంటనే చెయ్యాల్సి రావడంతో అప్పట్లో సెల్వకుమారి కుటుంబ సభ్యులు మూడు తులాల బంగారం మాత్రమే అమ్మాయికి పెట్టారు, అయితే ఇప్పుడు అత్త ధనలక్ష్మి నాకు 25 తులాల బంగారం కట్నంగా తీసుకురావాలని కోడలు సెల్వకుమారిని టార్చర్ పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి.

ఎవరినైనా చూసుకోవాలా ?

ఎవరినైనా చూసుకోవాలా ?

కట్నం, బంగారు నగలు తీసుకురావాలని మీ అమ్మ నన్ను నిత్యం వేధింపులకు గురి చేస్తోందని భార్య సెల్వకుమారి భర్త పార్థీబన్ కు చెప్పింది. మీరు మీరు ఎక్కడైనా కొట్టుకుని చావాలని, నువ్వు మా అమ్మ మీద ఇలా చాడీలు చెబితే నేను ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుని ఇంటికి రావడం కూడా మానేస్తానని భర్త పార్థీబన్ భార్య సెల్వకుమారి మీద మండిపడ్డాడని తెలిసింది.

టార్చర్ తట్టుకోలేక ఏం చేసిందంటే ?

టార్చర్ తట్టుకోలేక ఏం చేసిందంటే ?

కట్నం విషయంలో అత్త ధనలక్ష్మి, కోడలు సెల్వకుమారి మధ్య మాటామాటా పెరిగిపోయింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన సెల్వకుమారి కుమార్తె బేబి లిపిషాను ఎత్తుకుని ఓ గదిలోకి వెళ్లిపోయింది. తరువాత కుమార్తెను చంపి సెల్వకుమారి ఉరి వేసుకుందని తెలిసిందని ఆమె అత్త అంటోంది.

ఆత్మహత్య కాదు, హత్య ?

ఆత్మహత్య కాదు, హత్య ?

సెల్వకుమారి ఎంతసేపటికి లోపలి నుంచి బయటకు రాకపోవడంతో ఆమె అత్త ధనలక్ష్మి చుట్టుపక్కల వాళ్లను పిలిపించి తలుపులు పగలగొట్టి చూడగా వాళ్లు ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. అయితే సెల్వకుమారిని చంపేసి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని, కట్నం కోసం మా అమ్మాయిని టార్చర్ పెట్టారని సెల్వకుమారి కుటుంబ సభ్యులు విరూద్ నగర్ లో కేసు పెట్టారు.

English summary
Wife: Young woman commits suicide with child due to Dowry issue in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X