వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకకు కాబోయే సీఎం: హెచ్.డి. కుమారస్వామి భార్య రామనగరలో ఎమ్మెల్యేగా పోటీ, బీజేపీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి ఎమ్మెల్యేగా పోటీ చెయ్యడం దాదాపు ఖరారు అయ్యింది. రామనగర శాసన సభ నియోజక వర్గం నుంచి హెచ్.డి. కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి పోటీ చేస్తారని జేడీఎస్ వర్గాలు తెలిపాయి.

Recommended Video

Kumaraswamy Wife Became A Hot Topic | Oneindia Telugu
కుమారస్వామి స్కెచ్

కుమారస్వామి స్కెచ్

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా హెచ్.డి. కుమారస్వామి రెండు శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేశారు. కర్ణాటక జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి రామనగర, చెన్నపట్టణ శాసన సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు.

ఒక నియోజక వర్గం

ఒక నియోజక వర్గం

హెచ్.డి. కుమారస్వామి మొదట చెన్నపట్టణ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించారు. అయితే చెన్నపట్టణలో బీజేపీ అభ్యర్థి సీపీ. యోగేశ్వర్ నుంచి గట్టి పోటీ ఎదురు కావడంతో జేడీఎస్ నాయకుల సూచనమేరకు హెచ్.డి.కుమారస్వామి చివరి నిమిషంలో రామనగర నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.

జేడీఎస్ కంచుకోట

జేడీఎస్ కంచుకోట

మొదటి నుంచి రామనగర శాసన సభ నియోజక వర్గం జేడీఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. హెచ్.డి. కుమారస్వామి రామనగర నియోజక వర్గం పెట్టుకుని చెన్నపట్టణ నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని భావించారు.

ఆయనతో పోటీ కష్టం

ఆయనతో పోటీ కష్టం

చెన్నపట్టణ శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి సీపీ. యోగేశ్వర్ చాల బలమైన వ్యక్తి. హెచ్.డి. కుమారస్వామి తప్పా ఆ నియోజక వర్గంలో సీపీ. యోగేశ్వర్ మీద ఎవ్వరు విజయం సాధించాలన్నా చాల కష్టం. అందుకే చెన్నపట్టణ నియోజక వర్గం పెట్టుకుని రామనగర నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని హెచ్.డి. కుమారస్వామి నిర్ణయించారు.

ఎమ్మెల్యే గ్యారెంటీ

ఎమ్మెల్యే గ్యారెంటీ

రామనగర శాసన సభ నియోజక వర్గం నుంచి హెచ్.డి. కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి పోటీ చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని, వేరే వ్యక్తులు అయితే కష్టం అవుతోందని జేడీఎస్ నాయకులు భావిస్తున్నారు. హెచ్.డి. కుమారస్వామి భార్య అనితా కుమారస్వామిని గెలిపించడానికి రామనగరలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ చెయ్యకుండా మద్దతు ఇస్తారా, లేక అభ్యర్థిని పోటీకి నిలుపుతారా అనే విషయం వేచి చూడాలి.

English summary
Karnataka election results 2018: Will Anitha Kumaraswamy wife of JDS chief Kumaraswamy, contest from Ramanagar constituency? Some sources said, she will be the JDS candidate for Ramanagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X