వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ దోషులకు ఉరి..? త్వరలోనే అమలు, 28వ తేదీనే సమాచారం..

|
Google Oneindia TeluguNews

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తామని తీహార్ జైలు అధికారులు ప్రకటించారు. నిర్భయపై లైంగికదాడి చేసిన కీచకులు ముఖేశ్, వినయ్, అక్షయ్, పవన్‌కు త్వరలో ఉరిశిక్ష అమలు చేస్తామని పేర్కొన్నది. వారికి ఉరిశిక్ష అమలు చేసే విషయాన్ని ఈ నెల 28వ తేదీన తెలియజేశామని తెలిపింది.

ఏడేళ్లు గడిచింది, ఇంకెప్పుడు : నిర్భయ దోషులకు అమలుకానీ శిక్ష, ఓటేయమంటోన్న పేరెంట్స్ఏడేళ్లు గడిచింది, ఇంకెప్పుడు : నిర్భయ దోషులకు అమలుకానీ శిక్ష, ఓటేయమంటోన్న పేరెంట్స్

నిర్భయ కేసు దేశంలో కలకలం రేపింది. నిర్భయపై కీచకులు దారుణంగా ప్రవర్తించారు. సున్నితమైన ప్రాంతంలో దాడి చేయడంతో.. ఆమె చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దిగువ కోర్టు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే శిక్ష అమలులో జాప్యం జరుగుతుంది. సాధారణంగా ఉరిశిక్ష విధిస్తే.. కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో విచారణకు వస్తోంది. అక్కడ కూడా సానుకూలంగా రాకుంటే గవర్నర్, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరతారు. వారు కూడా కరుణించకుంటే ఉరిశిక్షను అమలు చేస్తారు.

will be hang on nirbhaya Convicts..?

నిర్భయ కేసులో దోషులు ఉరిశిక్షను సవాల్ చేసే అవకాశం ఉంది. కానీ వారెవరే దరఖాస్తు చేయలేదు. గవర్నర్, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరలేదు. ఉరి శిక్షకు సంబంధించి సమాచారం వారికి అందజేశామని తెలిపారు. గడువు తేదీలోగా నిందితులు క్షమాభిక్ష కోరాలని లేదంటే న్యాయస్థానానికి సమాచారం అందజేస్తామని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఉరిశిక్ష అమలు చేస్తామని తీహర్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ తెలిపారు. నిర్భయ దోషుల్లో ముగ్గురు తీహార్ జైలులో ఉండగా మరొకరు మండొలి జైలులో ఉన్నారు.

English summary
nirbhaya four convicts will be hang. tihar jail official told to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X