వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ టీవీ-సీ ఓటరు సర్వే: దేశంలో మళ్లీ మోడీయే కానీ, ఏపీలో జగన్‌దే హవా, బాబుకు దెబ్బ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటికి ఇఫ్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ విజయం సాధిస్తుందని తేలింది. ఆయా రాష్ట్రాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఎన్ని సీట్లు గెలుస్తుందని ఈ సర్వే ద్వారా తెలుసుకుంది.

ఈ సర్వేలో ఎన్డీయేకు గతంలో కంటే సీట్లు తగ్గినా యూపీఏ కంటే మెజార్టీ వస్తుందని తేలింది. యూపీఏ 100 మార్కు సీట్లకు చేరుకోనుందని సర్వేలో వెల్లడైంది. ఎన్డీయేకు కొన్ని సీట్లు తక్కువ పడనున్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

యూపీ, మహారాష్ట్రలలో సర్వే

యూపీ, మహారాష్ట్రలలో సర్వే

ఉత్తర ప్రదేశ్‌లో ఎన్డీయేకు 31 సీట్లు, యూపీఏకు 5 సీట్లు, ఇతరులకు (మహాఘట్‌బందన్‌) 44 సీట్లు వస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది. యూపీఏకు 7.9 శాతం ఓట్లు, ఎన్డీయేకు 43.9 శాతం, మహా ఘట్‌బంధన్‌కు 44.7 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. మహారాష్ట్రలో ఎన్డీయేకు 23, యూపీఏకు 14 సీట్లు, ఎన్సీపీకి 6 సీట్లు, శివసేనకు 5 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఎన్డీయేకు 37.8 శాతం, యూపీఏకు 28.5 శాతం, ఎన్సీపకీకి 11.7 శాతం, శివసేనకు 8.5 శాతం, ఇతరులకు 11.7 శాతం ఓట్లు వస్తాయని తేలింది.

పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడులలో సర్వే

పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడులలో సర్వే

పశ్చిమ బెంగాల్‌లో యూపీఏకు 1 సీటు, ఎన్డీయేకు 9 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు 32 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. బీహార్‌లో ఎన్డీయేకు 34 సీట్లు, యూపీఏకు 6 సీట్లు వస్తాయని తేలింది. తమిళనాడులో ఎన్డీయేకు 1 సీట్లు, యూపీఏకు సున్నా, డీఎంకేకు 29, అన్నాడీఎంకేకు 9 సీట్లు వస్తాయని తేలింది.

మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లలో సర్వే

మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లలో సర్వే

మధ్యప్రదేశ్‌లో ఎన్డీయేకు 22 సీట్లు, యూపీఏకు 7 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కర్ణాటకలో యూపీఏకు 7, ఎన్డీయేకు 18, జేడీఎస్‌కు 3 సీట్లు వస్తాయని తేలింది. గుజరాత్‌లో ఎన్డీయేకు 24 సీట్లు, యూపీఏకు 2 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ హవా, చంద్రబాబుకు షాక్

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ హవా, చంద్రబాబుకు షాక్

ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20, తెలుగుదేశం పార్టీకి 5 సీట్లు వస్తాయన ఈ సర్వేలో వెల్లడైంది. ఎన్డీయే, యూపీఏలకు సీట్లేమీ రావని తేలింది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 41.3 శాతం, తెలుగుదేశం పార్టీకి 31.2 శాతం, ఎన్డీయేకు 11.3 శాతం, యూపీఏకు 9.3 శాతం ఓట్లు వస్తాయని తేలింది. రాజస్థాన్‌లో ఎన్డీయేకు 17 సీట్లు, యూపీఏకు 8 సీట్లు వస్తాయని తేలింది.

ఒడిశా, తెలంగాణలలో సర్వే

ఒడిశా, తెలంగాణలలో సర్వే

ఒడిశాలో ఎన్డీయేకు 12 సీట్లు, యూపీఏకు 3 సీట్లు, ఇతరులకు 6 సీట్లు వస్తాయని తేలింది. కేరళలో యూపీఏకు 16, ఎన్డీయేకు సున్నా, ఎల్డీఎఫ్‌కు 4 సీట్లు వస్తాయని తేలింది. తెలంగాణలో ఎన్డీయేకు 1 సీటు, యూపీఏకు 8 సీట్లు, తెరాసకు 7 సీట్లు, మజ్లిస్ పార్టీకి 1 సీటు వస్తాయని సర్వేలో తేలింది. తెలంగాణలో గత ఎన్నికల్లో తెరాస 11 సీట్లు గెలుచుకుంది. ఈసారి షాక్ తగలనుంది.

అసోం, చత్తీస్‌గఢ్, పంజాబ్‌లలో సర్వే

అసోం, చత్తీస్‌గఢ్, పంజాబ్‌లలో సర్వే

అసోంలో ఎన్డీయేకు 4, యూపీఏకు 9, ఏఐయూడీఎఫ్‌కు 1 సీటు వస్తుందని సర్వేలో తేలింది. జార్ఖండ్‌లో ఎన్డీయేకు 6, యూపీఏకు 7, జేవీఎంకు 1, ఇతరులకు ఒక సీటు వస్తుందని వెల్లడైంది. పంజాబ్‌లో ఎన్డీయేకు 1, యూపీఏకు 12 వస్తాయని తేలింది. చత్తీస్‌గఢ్‌లో ఎన్డీయేకు 10, యూపీఏకు 1 సీటు వస్తుందని వెల్లడైంది. హర్యానాలో ఎన్డీయేకు ఆరు, యూపీఏకు 3, ఇతరులకు 1 సీటు వస్తుందని తేలింది.

ఢిల్లీ సహా ఇతరచోట్ల సర్వే

ఢిల్లీ సహా ఇతరచోట్ల సర్వే

ఢిల్లీలో ఎన్డీయేకు 7 సీట్లు దక్కుతాయని, యూపీఏ, ఇతరులకు ఏమీ దక్కవని సర్వేలో తేలింది. జమ్ము కాశ్మీర్‌లో ఎన్డీయేకు 2, యూపీఏకు రెండు, పీడీపీకి 1 సీటు దక్కనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్డీయేకు రెండు, ఇతరులకు, యూపీఏకు ఏమీ రావని తేలింది. గోవాలో ఎన్డీయేకు ఒకటి, యూపీఏకు 1 వస్తుందని తేలింది. ఉత్తరాఖండ్‌లో ఎన్డీయేకు 5, యూపీఏకు ఏమీ రావని సర్వేలో వెల్లడైంది. డామన్ అండ్ డయ్యులో ఎన్డీయేకు ఒక సీటు, యూపీఏకు ఏమీ రావని తేలింది. దాద్రా నగర్ హవేలీ (ఒక సీటు), చండీగఢ్ (ఒక సీటు), అండమాన్ నికోబర్ దీవులు (ఒక సీటు), త్రిపుర (రెండు సీటు), సిక్కిం (ఒక సీటు), నాగాలాండ్ (ఒక సీటు), మణిపూర్ (2 సీట్లు) ఎన్డీయే గెలుస్తుందని, లక్ష్వద్వీప్‌ (ఒక సీటు), పుదుచ్చేరి (ఒక సీటు) యూపీఏ గెలుస్తుందని తేలింది. మిజోరాంలో ఉన్న ఒక సీటు ఎంఎన్ఎఫ్‌కు వస్తుందని తేలింది. మేఘాలయలో రెండు సీట్లు ఉండగా ఒకటి ఎన్డీయేకు, మరొకటి యూపీఏకు వస్తుందని తేలింది.

English summary
In October's edition, the final tally of the Republic-CVoter National Approval Ratings had shown the NDA retaining a majority, while the UPA had progressed beyond the 100 mark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X