వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ట్విస్ట్: బిజెపికి తలుపులు తెరిచేవున్నాయన్న ఫరూక్

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు చోట చేసుకుంటున్నాయి. తాజాగా, తమ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకుంటుందని తానెప్పుడూ చెప్పలేదని మాజీ కేంద్రమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా అన్నారు. అయితే, బిజెపి నుంచి అలాంటి ప్రతిపాదన వస్తే మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

శనివారం జరిగిన ఓ సమావేశంలో అబ్దుల్లా మాట్లాడుతూ.. బిజెపి నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే.. తమ వర్కింగ్‌ కమిటీ సమావేశమై చర్చిస్తామని.. అందుకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు.

ప్రస్తుతానికి తమకు ప్రజల మద్దతు లేదు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు గురించి తాము నిర్ణయం తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడిందని.. భాజపా, పీడీపీలకు ప్రజల తీర్పు ఉంది కాబట్టి వాళ్లు ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఆయన పేర్కొన్నారు.

Will consider tie-up if BJP offers, says NC patron Farooq Abdullah

కాగా, జమ్మూకాశ్మీర్‌లో పీడీపీతో కలిసి బిజెపితో నిరుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జనవరి 7న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మృతిచెందడంతో ప్రస్తుతం గవర్నర్‌ పాలన అమలవుతోంది.

సయీద్‌ మరణానంతం ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ సీఎం పదవి చేపట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పట్లో సీఎం పదవి చేపట్టలేనని ఆమె చెప్పారు. ఇది ఇలా ఉండగా, బిజెపి కూటమి కొనసాగించడానికి పీడీపీ సుముఖంగా లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఫరూఖ్‌ అబ్దుల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే.. ఆదివారం మెహబూబా ముఫ్తీ పార్టీ నేతలతో మావేశమయ్యారు. కాగా, ఇటీవల మెహబూబా ముఫ్తీతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అవడం కూడా సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీతో జత కలిసి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని కూడా ఊహాగానాలు వెలువడ్డాయి.

English summary
IN A twist to the ongoing stalemate on government formation in Jammu and Kashmir, National Conference (NC) patron and former chief minister Farooq Abdullah Saturday said his party would consider a tie-up with the BJP to form the government if it received any such proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X