• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏప్రిల్ 15 లోపు కరోనా కంట్రోల్ అవుతుందా ? లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుందా?

|

కరోనా వైరస్ పేరు వింటే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. అగ్ర దేశాలు సైతం గడగాదలాడుతున్న పరిస్థితి . డ్రాగన్ కంట్రీ అయిన చైనాలో పుట్టిన ఈ వైరస్ దేశాలన్నింటినీ చుట్టేస్తోంది. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది.

  India Lock Down : Will It End on April 15 Or Extended For Several More Days

  ఇక భారత్ పైన కూడా పంజా విసిరిన ఈ మహమ్మారి నుండి భారత దేశ ప్రజలను కాపాడుకోవటం కోసం ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.ప్రధాని మోదీ ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. అయితే లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్తున్న నేపధ్యంలో అప్పట్లోగా వైరస్ కంట్రోల్ అవుతుందా ? లేకా మరోమారు లాక్ డౌన్ కొనసాగుతుందా ? అనేది అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న .

  ఏప్రిల్ 15 వరకూ ఇంటి నుంచి బయటకు రాకుండా లాక్ డౌన్

  ఏప్రిల్ 15 వరకూ ఇంటి నుంచి బయటకు రాకుండా లాక్ డౌన్

  కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్న నేపధ్యంలో ఏప్రిల్ 15 వరకూ ఇంటి నుంచి బయటకు రావడానికి వీలు లేదని , బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులను ఇప్పటికే బంద్ చేసింది సర్కార్ . ఇక కరోనా వైరస్‌కి అడ్డుకట్ట వేయడానికి ఇదే మంచి మార్గమని, దీంతో అందరూ ఇళ్లకే పరిమితమవుతారు కాబట్టి వైరస్ తక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని మోదీ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు ఎక్కడి ప్రజలు అక్కడే ఉండాలని పేర్కొన్న సర్కార్ ప్రజా జీవనం సాఫీగా సాగేలా భారీ ప్యాకేజ్ ను కూడా ప్రకటించింది.

  పరిస్థితి కంట్రోల్ లోకి రాకుంటే లాక్ డౌన్ కొనసాగే అవకాశం

  పరిస్థితి కంట్రోల్ లోకి రాకుంటే లాక్ డౌన్ కొనసాగే అవకాశం

  అయితే ఇప్పుడు ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తుందా అంటే అనుమానమే అనే భావన వ్యక్తం అవుతుంది. ఇక లాక్ డౌన్ ను ఆపై కూడా మరిన్ని రోజులు పొడిగించే అవకాశాలున్నాయని భావిస్తున్న నేపధ్యంలో అందుకు తగ్గట్టుగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ 21 రోజుల్లో వైరస్ వ్యాప్తికి అరికట్టే విషయంలో ఇండియా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో ఓ అవగాహన వస్తుందన్నారు.

  మౌలిక వైద్య సదుపాయాలు లేకనే లాక్ డౌన్

  మౌలిక వైద్య సదుపాయాలు లేకనే లాక్ డౌన్

  అమెరికా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లో మాదిరిగా పెద్ద ఎత్తున మరణాలు సంభవించకుండా చూడాలన్న ఉద్ధేశంలో ఉన్న ప్రధాని తీసుకున్న చర్యలు సరైనవని ఆయన పేర్కొన్నారు. ఇక భారత్ లో కావాల్సిన వైద్య సదుపాయాలూ లేవు కాబట్టి వైరస్ బాధితుల సంఖ్య వేలల్లోకి, లక్షల్లోకి చేరితే కనీస మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందించే స్థితిలో భారత్ లేదని.. అందుకే ముందుగానే ప్రధాని పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు.

  ఇప్పటికే స్తంభించిన ప్రజా జీవనం

  ఇప్పటికే స్తంభించిన ప్రజా జీవనం

  ఇక ఈ లాక్‌డౌన్ కరోనా వ్యాప్తి తగ్గటానికి ఉపకరిస్తుందని అన్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ కేసులు కనుగ పెరిగితే.. మరికొన్ని రోజులు ఈ లాక్‌డౌన్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించటంతో వర్తక , వ్యాపారాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రజా జీవనం కష్టంగా సాగుతుంది.. ఇక మరింత పొడిగిస్తే పరిస్థితి ఊహించటానికే కష్టంగా ఉంది .

  English summary
  It is now doubtful whether this lockdown will end on April 15. A Drugs Controller General's Office official said that the lockdown is expected to be extended for several more days. In these 21 days, there is an understanding of how far India will succeed in preventing the spread of the virus.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X