• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా మరోసారి కన్నెర్ర చేయనుందా..?ఎయిమ్స్ వైద్యులు చెప్తోందే నిజమా..?వర్షా కాలం వైరస్ విజృంభిస్తుందా

|

ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలో కరోనా మహమ్మారి మరో సారి విలయతాండవం చేయనుందా..? తగ్గుముఖం పడుతున్నట్టే పట్టి మళ్లీ మానవాళి మీద విరుచుకు పడనుందా.. రాబోవు రెండు నెలల్లె జరగబోతోంది అదేనా అంటే అవుననే అంటున్నారు వైద్యులు. సహజంగా చల్లని ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ వర్షాకాలంలో తన ప్రతాపాన్ని చూపబోతుందని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు నిర్థారిస్తున్నారు. అంటే కరోనా వ్యాప్తి కట్టడికి మరింత ముందుజాగ్రత్తలు తీసుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది.

  Coronavirus Cases To Peak In June July : AIIMS
   ముందుంది కరోనా కష్ట కాలం..

  ముందుంది కరోనా కష్ట కాలం..

  కరోనా వైరస్ ప్రజల ఆరోగ్యాలను నాశనం చేయడంతో పాటు, దేశ ఆర్థిక మూలాలను తీవ్రంగా దెబ్బ కొడుతోంది. దీంతో అనేక దేశాలు ఆర్ధిక సమస్యలను అధికమించేందుకు విపరీతంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ఈఎంఐల భారం ఉన్నవాళ్లు ఆర్థికంగా చితికిపోయారు. ఇదిలా ఉండగా కొన్నిరోజులుగా కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కరోనా ప్రభావం తగ్గేదెప్పుడో కూడా అంచనా వేయలేని పరిస్థితులు తలెత్తాయి. రోజురోజుకు మరింత ప్రమాదకరంగా కరోనా పరిణమిస్తోంది. తగ్గాల్సిన పాజిటీవ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరగడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటలీ పాజిటీవ్ కేసుల సంఖ్యలు మన దేశంలోను నమోదవ్వడం భయభ్రాంతులకు గురి చేస్తోంది. కాకపోతే మరణాలు సంఖ్య మాత్రం ఇటలీతో పోన్చుకుంటే తక్కువగా ఉండడం గుడ్డిలో మెళ్లగా మారింది.

   కొంపముంచిన సడలింపులు..

  కొంపముంచిన సడలింపులు..

  భారత దేశంలో రెండు వారాల కిందటి వరకు రోజుకు వెయ్యి కేసులు నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం రోజుకు సుమారు మూడు వేల కరోనా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. దీనిపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందిస్తూ భయంకరమైన వాస్తవాలను విశ్లేషిస్తున్నారు. ఇపుడు చూస్తున్న కరోనా వైరస్ తీవ్రత తారా స్థాయి కాదని, జూన్, జూలై మాసాల్లో కరోనా వైరస్ తీవ్రత తారాస్థాయిలో ఉండబోతోందని స్పష్టం చేసారు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వేసిన అంచనాలు, పెరుగుతున్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండనుందని డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు.

   ఎక్కడ బౌతిక దూరం..

  ఎక్కడ బౌతిక దూరం..

  భౌతిక దూరం కచ్చితంగా పాటిస్తే నెలరోజుల్లో కరోనా అదుపులోకి రావాల్సిన వైరస్ ఎక్కడా జనం అది కఠినంగా పాటించనందున వైరస్ ఉదృతి తగ్గడం లేదని విశ్లేషిస్తున్నారు. అందుకే భారత దేశంలో తీవ్ర స్థాయిలో కరోనా ఉదృతి కనిపిస్తోందన్నారు. ఇతర అంశాలు కూడా ఈ లెక్కలను ప్రభావితం చేయొచ్చని, అయితే అది కాలం మాత్రమే నిర్ధారణ చేయగలదని అన్నారు. లాక్ డౌన్ పొడిగింపు ప్రభావం కూడా ప్రస్తుతానికి కనిపించడం లేదని, జోన్ల విభజన, మినాహాయింపుల వల్ల లాక్ డౌన్ సీరియస్ నెస్ పోయిందని, జనం మళ్లీ విచ్చలవిడిగా సంచరిస్తున్నారని దీని ప్రభావం మరికొన్ని రోజులు గడిస్తే ఒక అంచనాకు రావొచ్చన్నారు డాక్టర్ రణదీప్.

   దేశంలో ప్రస్తుత పరిస్థితి..

  దేశంలో ప్రస్తుత పరిస్థితి..

  ఇదిలా ఉండగా దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 53000 గా ఉంది. దేశవ్యాప్తంగా 1,783 మరణాలు సంభవించాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 35,902 కాగా, 15,266 మంది డిశ్చార్జి అయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా బాగా విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశ ఆర్ధిక రాజధాని ఉన్న మహరాష్ట్రలో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. దేశంలో మూడో వంతు కేసులు అక్కడే నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ తారా స్థాయిలో కనిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లో మూడు వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. అంటే రాబోవు రోజుల్లో ఈ మహమ్మారి ఎంత ప్రమాద ఘంటికలు మోగించబోతోందో అర్ధం చేసుకోవచ్చు.

  English summary
  Approximately three thousand corona positive cases are reported daily. On this, Dr Randeep Guleria, Director of AIIMS, All India Institute of Medical Sciences, responded by analyzing the grim facts. It is clear that the coronavirus virus is currently out of reach, and that the coronavirus intensity is expected to peak in June and July.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X