వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజా రవాణాకు కరోనా ఉరితాడు - లాక్ డౌన్ ముగిసినా స్పందన ఉంటుందా ?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని వ్యవస్దలపై స్పష్టంగా కనిపిస్తోంది. అయితే లాక్ డౌన్ ముగిసిన తర్వాత పరిస్దితులపై ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. వీటిలో ప్రధానమైనది ప్రజా రవాణా. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా మూతపడిన ప్రజా రవాణా వ్యవస్ధలను తిరిగి గాడిలో పెట్టడం సాధ్యమవుతుందా లేక కరోనా సంక్షోభం వీటికి ఉరితాడు వేయబోతోందా అన్న భయాలు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత రవాణా ప్రాధాన్యం కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

 నిలిచిన ప్రజారవాణా..కోలుకుంటుందా ?

నిలిచిన ప్రజారవాణా..కోలుకుంటుందా ?

మే నెల మొదటి వారంలో దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా వైరస్ భయాలు భారీ మార్కెట్ కలిగిన మన దేశాన్ని అతకాకుతలం చేసేస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రజా రవాణా. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులతో రద్దీగా కనిపించే మన బస్సులు, మెట్రో రైళ్లు, పాసింజర్ రైళ్లు, విమానాలు కరోనా కారణంగా ఒక్కసారిగా నిలిచిపోయాయి. వీటిని లాక్ డౌన్ ముగిశాక తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ కరోనా వ్యాప్తిపై స్పష్టత రాకపోవడంతో ఇవి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో ఎవరూ చెప్పలేని పరిస్ధితి.

ప్రజల్లో భయాలు- తిరిగి ఎక్కుతారా ?

ప్రజల్లో భయాలు- తిరిగి ఎక్కుతారా ?

కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ప్రభుత్వాలు ప్రజలకు పెట్టిన భయాలు వారిని ఇళ్లు దాటి బయటకు కదలనీయడం లేదు. కొందరు లాక్ డౌన్ ఉల్లంఘించి బయటికి వస్తున్నా మెజారిటీ జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. వీరిలో దాదాపుగా ప్రతీ ఒక్కరూ ఏదో రకంగా ప్రజా రవాణను వినియోగించుకుంటున్న వారే. కానీ తాజాగా మొదలైన కరోనా వైరస్ భయాలతో గతంలోలా కిక్కిరిసిన బస్సులు, రైళ్లు, మెట్రోల్లో ప్రయాణాలు చేసేందుకు వీరిని అనుమతిస్తాయా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

జనం ఆదరించకపోతే...

జనం ఆదరించకపోతే...

అసలే నష్టాలతో కాలం గడుపుతున్న ప్రజా రవాణా వ్యవస్దలు కరోనా లాక్ డౌన్ తర్వాత తిరిగి ప్రారంభమైనా జనం ఆదరించకపోతే దివాలా తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఏపీలో తాజాగా ప్రజా రవాణా వ్యవస్దలో భాగమైన ఆర్టీసీని ప్రభుత్వం రవాణాశాఖలో విలీనం చేసుకుంది. కానీ నష్టాలతో ఎంతకాలం ప్రభుత్వం దీన్ని భరించే అవకాశం ఉంటుంది, అలా అని తిరిగి ఆర్టీసీ కార్మికులను కార్పోరేషన్ లోనే విలీనం చేస్తారా అంటే ఇప్పుడే సమాధానాలు దొరికే పరిస్దితి లేదు. దీంతో ప్రజా రవాణా వ్యవస్ధలు తిరిగి ప్రయాణికుల ఆదరణ చూరగొనడంలో విఫలం అయితే మాత్రం తీవ్ర సంక్షోభం తప్పకపోవచ్చు.

భారీగా వ్యక్తిగత వాహనాలు...

భారీగా వ్యక్తిగత వాహనాలు...


కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న పరిస్దితులతో ప్రజా రవాణా కంటే ప్రజలు తిరిగి వ్యక్తిగత వాహనాలనే ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనీసం దేశంలో కరోనా ప్రభావం తగ్గిపోయే వరకైనా ఈ పరిస్ధితి తప్పకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే జనం విచ్చలవిడిగా రుణాలు తీసుకుని అయినా సొంత వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అందులోనూ ద్విచక్ర వాహనాలకు బదులుగా కార్లను కొనుగోలు చేయాలనే ట్రెండ్ పెరుగుతుందని రవాణా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Recommended Video

Lockdown : PM Narendra Modi Interacted With Village Panchayats Via Video Conference

English summary
coronavirus outbreak shows severe impact on now and future also. due to coronavirus fears public may avoid public transport systems like train, metro, buses, flights also. at the same time private transport or individual transport system will increase more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X