వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత విగ్రహం, అమ్మా, చిన్నమ్మా, రచ్చరచ్చ, పళని భార్య పోలికలు, క్లారిటీ, దెబ్బకు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 70వ జయంతి సందర్బంగా చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమ్మ విగ్రహం ఇప్పుడు రచ్చకెక్కింది. అమ్మ స్థానంలో ఎవరిదో విగ్రహం తెచ్చి పెట్టారని, సీఎం పళనిస్వామి భార్య పోలికలు ఉన్నాయని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు జయలలిత విగ్రహం స్థానంలో మరో విగ్రహం తెచ్చి పెడుతామని అన్నాడీఎంకే నాయకత్వం క్లారిటీ ఇచ్చింది. మొత్తం మీద జయలలిత మొదటి విగ్రహం ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే నాయకత్వం ఇప్పుడు నాలుక కరుచుకుంది.

Recommended Video

Jayalalithaa Birth Anniversary : AIADMK unveils Her Statue
అమ్మ జయంతి

అమ్మ జయంతి

అన్నాడిఎంకే వర్గాలు అమ్మ జయలలిత జయంతి వేడుక సందర్బంగా శనివారం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో అమ్మ నిలువెత్తు విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆవిష్కరించారు.

విగ్రహం ఎవరిది ?

విగ్రహం ఎవరిది ?

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్న విగ్రహం అమ్మ జయలలిత దేనా ? కాదా ? అనే అనుమానం ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్లో మొదలైయింది. జయలలిత ముఖ పోలికలు ఆ విగ్రహంలో ఏ మాత్రం లేవని, అమ్మ స్థానంలో ఎవరిదో విగ్రహం తెచ్చి పెట్టారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

సోషల్ మీడియా

సోషల్ మీడియా

సోషల్ మీడియాలో జయలలిత విగ్రహం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్కడ ఉన్నది అమ్మనా ? చిన్నమ్మనా ? అని ప్రశ్నిస్తున్నారు. కొందరు అయితే ఏకంగా జయలలిత విగ్రహంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సతీమణి పోలికలు ఉన్నాయని తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు.

మంత్రి అసహనం

మంత్రి అసహనం

జయలలిత విగ్రహం విషయంలో తమిళనాడు మత్స్య శాఖ మంత్రి జయకుమార్‌ను మీడియా ప్రశ్నించగా, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నది అమ్మ విగ్రహమే, అసలు మీకు ఎందుకు ఆ అనుమానం వచ్చింది అంటూ అసహనం వ్వక్తం చేశారు.

చేతకాని ప్రభుత్వం

చేతకాని ప్రభుత్వం


జయలలిత విగ్రహం విషయంలో అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు టీటీవీ దినకరన్ మాట్లాడుతూ అమ్మ విగ్రహం సక్రమంగా తయారు చేయించలేని వారు పార్టీని, ప్రభుత్వానికి ఎలా ముందుకు నడిపిస్తారు అని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వంను తీవ్రస్థాయిలో విమర్శించారు.

రచ్చరచ్చ

రచ్చరచ్చ

జయలలిత విగ్రహంలో అమ్మ పోలికలు ఏమాత్రం లేవని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శించడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరగి రచ్చరచ్చ కావడంతో ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం, మంత్రులు తలలు పట్టుకున్నారు.

నాయకత్వం క్లారిటీ

నాయకత్వం క్లారిటీ

అన్నాడీఎంకే పార్టీ శాస్వత ప్రధాన కార్యదర్శి జయలలిత విగ్రహం మార్చాలని చివరికి ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. తమిళనాడు మత్స్యశాఖ మంత్రి జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ అమ్మ జయలలిత విగ్రహం స్థానంలో మరో విగ్రహం పెడుతామని వివరణ ఇచ్చారు.

English summary
Tamil Nadu minister Jayakumar slams the criticisers of Jayalalithaa statue unveiled at AIADMK head office. He also added that AIADMK will do some changes in Jayalalithaa statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X