వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ సవర్కార్ మంటలు:పరువునష్టం దావా వేస్తామంటోన్న వీర్ సవర్కార్ మనమడు, ఉద్దవ్‌తో భేటీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rahul Gandhi 'Rahul Savarkar' Statement : గాంధీ-నెహ్రూ కుటుంబీకులు తప్పులు చేస్తూనే ఉంటారా ?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన రాహుల్ సావర్కార్ వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామ్యపక్షం శివసేన కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో విభేదించింది. బీజేపీ నేతలు రాహుల్ కామెంట్లను తప్పుపడుతున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఒంటికాలిపై లేచారు.

పరువు నష్టం దావా..

పరువు నష్టం దావా..

స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కార్ మనమడు రంజిత్ సావర్కార్ రాహుల్ గాంధీ కామెంట్లపై స్పందించారు. తమ తాత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఆయనపై పరువునష్టం దావా కేసు వేస్తామని చెప్పారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేతో కూడా రంజిత్ సావర్కార్ సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ కామెంట్లపై చర్చించారు.

నెహ్రూ కూడా..

నెహ్రూ కూడా..

సావర్కార్ గురించి రాహుల్ గాంధీ అలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో జవహర్ లాల్ నెహ్రూ కూడా శివాజీని దొంగ అని అన్నారు. తర్వాత క్షమాపణ కూడా చెప్పిన విషయాన్ని రంజిత్ గుర్తుచేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబీకులు తప్పులు చేస్తూనే ఉంటారని పరోక్షంగా ప్రస్తావించారు. రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలని కోరారు.

బయటకు రండి

బయటకు రండి

అంతేకాదు సావర్కార్‌పై వ్యాఖ్యలు చేసిన శివసేన.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగించొద్దని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి, సమయం అయిపోగానే కొత్త ప్రభుత్వం వస్తోంటాయి. కానీ వ్యక్తులపై విమర్శలు మాత్రం సరికాదని రంజిత్ తేల్చిచెప్పారు. అంతేకాదు స్వాతంత్ర్య సమరయోధులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. సావర్కార్‌ను విమర్శించిన కాంగ్రెస్ పార్టీ మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

 రాహుల్ సావర్కార్ కాదు..

రాహుల్ సావర్కార్ కాదు..

శనివారం భారత్ బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో జరిగిన ర్యాలీలో రేప్ ఇన్ ఇండియా అని కామెంట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా లేదని.. అత్యాచార భారత్ అని ఫైరయ్యారు. దీనిపై శుక్రవారం పార్లమెంట్‌లో దుమారం కొనసాగింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. దీనిపై భారత్ బచావో ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. తాను తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పబోనని తేల్చిచెప్పారు. తాను రాహుల్ గాంధీని అని.. రాహుల్ సావర్కార్ కాదని అనడంతో దుమారం రేగింది.

English summary
Rahul Gandhi's "I am not Rahul Savarkar" remark, Ranjit Savarkar, grandson of the Hindutva icon, on Sunday said that he will file a defamation case against the Gandhi scion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X