వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ఛాన్స్ ప్లీజ్: డెవలప్ టు బీ కంటిన్యూ.. ర్యాలీలో నితీశ్, తేజస్వీ యాదవ్‌పై నిప్పులు

|
Google Oneindia TeluguNews

బీహర్ ప్రజలు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ కోరారు. తమ కూటమిని గెలిపించాలని విన్నవించారు. సోమవారం ముజఫర్ నగర్‌లో గల సక్రా అసెంబ్లీ నియోజకవర్గంలో నితీశ్ కుమార్ ర్యాలీలో పాల్గొన్నారు. అభ్యర్థి అశోక్ కుమార్ చౌదరీ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్‌పై నిప్పులు చెరిగారు.

Recommended Video

Bihar Polls 2020 : మరోసారి Nitish Kumar కు పట్టం కట్టబోతున్న బీహర్ ప్రజలు.. ABP సర్వే వెల్లడి!

బీహర్ ఫస్ట్ ఫేజ్‌లో కోటీ శ్వరులు వీరే.. మొత్తం 375 మంది.. వీరిలో టాప్-3బీహర్ ఫస్ట్ ఫేజ్‌లో కోటీ శ్వరులు వీరే.. మొత్తం 375 మంది.. వీరిలో టాప్-3

తన లక్ష్యంగా విమర్శలు చేసి తేజస్వీ యాదవ్ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కొందరు తనపై ఆరోపణలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. కానీ తాను అలా కాదని చెప్పారు. బీహర్ అభివృద్ది కోసం కంకణం కట్టుకున్నానని చెప్పారు. దానిని కంటిన్యూ చేస్తానని.. మరో అవకాశం ఇవ్వాలన కోరారు.

Will give momentum to growth in Bihar, if voted to power:Nitish Kumar

ఆర్జేడీ హయాంలో గుండారాజ్ అధికారంలో ఉండేదని చెప్పారు. కుమారులు, కూతుళ్లు అందరూ కలిసి రాష్ట్రాన్ని ఏలేవారని పేర్కొన్నారు. కానీ తన కుటుంబమే రాష్ట్రం అని నితీశ్ కుమార్ స్పష్టంచేశారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు కంటిన్యూ కావాలన్న.. సంక్షేమ పథకాలు రూపుదాల్చుకోవాలన్న తమ పార్టీని గెలిపించాలని నితీశ్ కుమార్ కోరారు.

రాష్ట్రంలో రహదారులను నిర్మించామని, మంచినీరు అందించామని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి కూడా అనేక రెట్లు పెరిగిందన్నారు. మరో చాన్స్ ఇస్తే సోలార్ వెలుగులతో వీధి దీపాలను అందిస్తామని చెప్పారు. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన తొలి రాష్ట్ర ప్రభుత్వం తమదేనని చెప్పారు. తొలుత బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశామని.. తర్వాత బాలురకు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. వేలాది పాఠశాల భవనాలు నిర్మించామని.. వైద్యారోగ్య సేవలను పెంచామని తెలిపారు.

English summary
Bihar chief minister Nitish Kumar on Monday exhorted voters to bring him back to power so that the development initiatives taken by his government in the past 15 years could be continued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X