వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికొన్నిగంటల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష, విచక్షణ మేరకే రూలింగ్ అన్న స్పీకర్..

|
Google Oneindia TeluguNews

మరికొన్ని గంటల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉంది. గవర్నర్ లాల్జీటాండన్ ఆదేశం మేరకు స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి నడుచుకోవాల్సి ఉంది. కానీ తాను సోమవారం ఏ సమాధానం ఇస్తానో చూడాలని ప్రజాపతి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ ప్రజాపతి ఏం చేయనున్నారు.

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో ముసలం నెలకొన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ క్రమంలో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ లాల్జీ టాండన్ సీఎం కమల్ నాథ్‌ను కోరారు. దీనిపై స్పీకర్ ప్రజాపతిని వివరణ కోరగా.. సోమవారం బలపరీక్ష ఏమీ లేదే అని బాంబ్ పేల్చారు. దీంతో సోమవారం బలపరీక్ష ఉంటుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చ జరుగుతుందనే అంశంపై హై టెన్షన్ నెలకొంది.

 Will give my ruling on Monday: Madhya Pradesh Speaker on floor test..

Recommended Video

Coronavirus In AP : No Biometric Attendance To Emplyoees In Govt Offices

అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని ఎవరూ ఆదేశించారు. సభ ఏం చేయబోతుందనే అంశంపై సోమవారం క్లారిటీ వస్తోందని ప్రజాపతి పేర్కొన్నారు. సభలో తన పాత్రపై అప్పుడే నిర్ణయం తీసుకుంటానని..ముందుగా ఆలోచించనని ప్రజాపతి పేర్కొన్నారు. ఏ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా వ్యవహరించబోనని పేర్కొన్నారు. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామా చేయగా స్పీకర్ ప్రజాపతి కేవలం ఆరుగురివి మాత్రమే ఆమోదించారు. మిగిలిన 18 మందివి సస్పెన్స్‌లో ఉంచారు. దీంతో రాష్ట్రంలో 230 సీట్లు ఉండగా ఆ సంఖ్య 222కి పడిపోయింది. అంటే మెజార్టీ మార్క్ 112కి చేరింది. బీజేపీకి 107 సీట్లు ఉండటంతో ఐదు సీట్ల దూరంలో ఉంది. ఇండిపెండెంట్ మద్దతు ఇచ్చిన ఆ పార్టీ అధికారం చేపట్టడం కష్టమే అవుతోంది.

English summary
Madhya Pradesh Speaker NP Prajapati on Sunday refused to commit whether he will order a floor test in the Legislative Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X