వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చొరబడితే మృతదేహాలు మోసుకెళ్లాల్సిందే: పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తే చొరబాటుదారుల మృతదేహాలను తీసుకెళ్లేందకు పాకిస్తాన్ అధికారులు రావాల్సి ఉంటుందని హెచ్చరించారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. ఈ మధ్యకాలంలో పాక్ నుంచి చొరబాట్లు తగ్గిపోయాయని చెప్పిన బిపిన్ రావత్... ఇందుకు కారణం భారత సరిహద్దుల్లో జవాన్లు గస్తీ చాలా బలంగా ఉందని కొనియాడారు. ఒకవేల చొరబాటుకు ప్రయత్నిస్తే తమ వారి శవాలను తీసుకెళ్లేందుకు రావాల్సి ఉంటుదన్న సంగతి పాకిస్తాన్‌కు తెలుసని ఆర్మీ చీఫ్ చెప్పారు.

పుల్వామా దాడులకు తాము బాధ్యులం కాదన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఖండించారు. ఇమ్రాన్‌ఖాన్ ఒప్పుకోనంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదని చెప్పారు. పుల్వామా దాడులు ఎలా జరిగాయో అందరికీ తెలుసని చెప్పారు. ఇప్పటికే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పుల్వామాలో ఏం జరిగిందన్న దానిపై సరిపడా సమాచారంను సేకరించారని తెలిపారు.

Will have to carry the mortals: Army Chief Bipin Rawat warns Pak over infiltrations

ఇదిలా ఉంటే పాకిస్తాన్‌కు బిపిన్ రావత్ హెచ్చరికలు జారీ చేయడం ఇది తొలిసారి కాదు. అంతకు ముందు కూడా పాక్ చొరబాటు దారులను ప్రోత్సహిస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పాకిస్తాన్ చీటికీ మాటికీ భారత్‌లోకి చొరబడే యత్నం చేస్తోందన్నారు. అది భారత సైన్యంను రెచ్చగొట్టడం కానీ, ఆ దేశం నుంచి భారత్‌లోకి ఉగ్రవాదులను పంపడం కానీ, లేదా చొరబాట్లను ప్రోత్సహించడం ద్వారా పదేపదే కవ్వింపు చర్యలకు దిగుతోందన్నారు.అయితే భారత భూభాగంను ఎలా కాపాడుకోవాలో మనసైన్యంకు బాగా తెలుసని అన్నారు బిపిన్ రావత్. ప్రస్తుతం పరిస్థితులన్నీ సాధారణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు బిపిన్ రావత్.

English summary
In another warning to the country's neighbours, Army chief General Bipin Rawat on Thursday said Pakistan would have to "take back bodies" if it dares to infiltrate.Alerting Pakistan to not "attempt any misadventure", Rawat said, "Infiltration has come down because of our troops sitting alert at the border. Pakistan knows that if it'll infiltrate, all they will have to do is come back and take mortal remains."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X