వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరవ్ మోడీని చెప్పుతో కొడ్తా: అరెస్టైన అధికారి భార్య ఉద్వేగం

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీపై అరెస్టయిన అధికారి అర్జున్ పాటిల్ భార్ సుజాత పాటిల్ నిప్పులు చెరిగారు. భారీ కుంభకోణంలోని ప్రతి విషయానికీ నీరవ్ మోడీయే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.

తన భర్త గత పదేళ్లుగా నీరవ్ మోడీ కార్యాలయంలో పనిచేస్తున్నాడని, పేపర్ వర్క్ చేస్తూ వచ్చారని ఆమె చెప్పరు. నకిలీ అండర్‌టేింగ్ లెటర్స్‌ను (ఎల్ఓయులను) అర్జున్ పాటిల్ డ్రాఫ్ట్ చేసినట్లు సిబిఐ ఆరోపిస్తోంది.

 అందరి లాగే మా ఆయన

అందరి లాగే మా ఆయన

నీరవ్ మోడీకి చెందిన పైర్‌స్టార్ గ్రూప్‌లో పనిచేస్తున్న తన భర్త త పదేళ్లగా అక్కడ పనిచేస్తున్నాడని, అందరిలాగే ఆయన కూడా పేపర్ వర్క్ చేశారని సుజాత అన్నారు. అతన్ని (నీరవ్ మోడీని) తీసుకురండి చెప్పుతో కొడుతాననని సుజాత పాటిల్ అన్నట్లు ఇండియా టుడే రాసింది.

 ఆమె నమ్మలేదు..

ఆమె నమ్మలేదు..

కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులుగా దాని గురించి సుజాత తన భర్తను అడుగుతూ వచ్చింది. స్కూల్ టీచర్ అయిన సుజాత తన భర్త కుంభకోణంలో పాలు పంచుకున్నాడంటే నమ్మలేకపోతోంది. కుంభకోణంతో తనకు ఏ విధమైన సంబంధం లేదనీ దేశం నుంచి పారిపోయినవారే అంతా చేశారని అర్జున్ పాటిల్ ఆమెకు చెబుతూ వచ్చాడు.

ఒక్క పైసా ఎక్కువ తీసుకోలేదు

ఒక్క పైసా ఎక్కువ తీసుకోలేదు

తన భర్తకు నెలకు 30 వేల రూపాయలు మాత్రమే వచ్చేదని, అంతకు మించి ఒక్క పైసా ఎక్కువ తీసుకోలేదని సుజాత అన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయన (నీరవ్ మోడీ) ఏం చెప్పారో అదే తన భర్త చేశాడని, అక్రమమైన పని ఏదీ చేయలేదని అన్నారు.

 హంతకులూ రేపిస్టులు స్వేచ్ఛగా..

హంతకులూ రేపిస్టులు స్వేచ్ఛగా..

హంతకులు, రేపిస్టులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అమాయకుడైన తన భర్తను అరెస్టు చేశారని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంట్లో సిబిఐ సోదాలు చేసిందని, వారికి ఏమీ లభించలేదని అన్నారు.

 టీవీ సీరియల్ లాగా ఉంది..

టీవీ సీరియల్ లాగా ఉంది..

ప్రస్తుతం జరుగుతున్నందా టీవీ సీరియల్ లాగా కనిపిస్తోందని, దీనికి సిబిఐ, నీరవ్ మోడీ, మీడియా దీనికి కారణమని సుజాత అన్నారు. బుధవారం కోర్టు వద్ద ఆమె ఉద్వేగానికి గురై మాట్లాడారు.

English summary
Sujata Patil, wife of Arjun Patil who has been arrested in the Rs 11,400 crore Punjab National Bank fraud, has vented her anger on Nirav Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X