వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు నుంచి మళ్లీ పోరాటంలోకి -బెయిల్‌పై విడుదలైన నొదీప్ కౌర్ -గొంతువిప్పిన అందరికీ థ్యాంక్స్

|
Google Oneindia TeluguNews

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనల్లో పాల్గొని, ఉద్యమంలో కుట్రకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న యాక్టివిస్టులకు వరుసగా కోర్టుల్లో ఊరట లభిస్తున్నది. రెండ్రోజుల కిందట బెంగళూరు పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవి జైలు నుంచి విడుదల కాగా, ఇప్పుడు హక్కుల ఉద్యమ కారిణి నొదీప్ కౌర్ కు కూడా స్వేచ్ఛ లభించింది.

జూ.ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు -కుప్పంలో చంద్రబాబుకు షాక్ -లోకేశ్‌పై భువనేశ్వరి శ్రద్ధ కోరుతూ..జూ.ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు -కుప్పంలో చంద్రబాబుకు షాక్ -లోకేశ్‌పై భువనేశ్వరి శ్రద్ధ కోరుతూ..

రైతుల ఉద్యమంలో కుట్రలకు యత్నించారన్న ఆరోపణలపై అరెస్టయి, నెలన్నరకుపైగా జైల్లో ఉన్న కార్మిక హక్కుల పోరాట కార్యకర్త నొదీప్ కౌర్ శుక్రవారం సాయంత్రం విడుదల అయ్యారు. పంజాబ్-హర్యానా హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, కర్నాల్ జైలు నుంచి ఆమె బయటికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కౌర్ మీడియాతో మాట్లాడుతూ..

Will join farmers’ agitation, says Activist Nodeep Kaur after released from jail on bail

రైతుల పక్షాన నిలబడటం తప్ప తాను ఎలాంటి తప్పు చేయలేదని, త్వరలోనే మళ్లీ పోరాటంలో పాలుపంచుకుంటానని నొదీప్ కౌర్ స్పష్టం చేశారు. సర్కారు ఉద్దేశపూర్వకంగానే తనను జైలులో పెట్టిందని, కొందరు పోలీసు అధికారులు టార్చర్ చేసిన మాట వాస్తమేనని, దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.

దక్షిణాదిలో ఒకే దెబ్బకు - బెంగాల్‌లో మాత్రం 8దశల్లో ఎన్నికలా? -ఈసీ తీరుపై మమత ఫైర్ -మోదీకి షాక్దక్షిణాదిలో ఒకే దెబ్బకు - బెంగాల్‌లో మాత్రం 8దశల్లో ఎన్నికలా? -ఈసీ తీరుపై మమత ఫైర్ -మోదీకి షాక్

హర్యానా కుండలీ ఇండస్ట్రియల్ ఏరియాలో వేతన బకాయిల కోసం పోరాడుతున్న కార్మికులతో కలిసి నొదీప్ కౌర్ నిరసన ప్రదర్శనలు చేయగా, జనవరి 12న ఆమెను పోలీసులు అరెస్టు చేసి కర్నాల్ జైలుకు తరలించారు. నొదీప్ విడుదల గురించి అమెరికా ఉపాధ్యక్షులు కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ సహా ప్రముఖులు ట్వీట్లు చేశారు. నోదీప్ కౌర్ అరెస్ట్ మీద అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమమైంది.

English summary
Nodeep Kaur, the 23-year-old labour rights activist who was released on bail on Friday following global outrage, told that she will visit the Singhu border near Delhi where farmers have been protesting against the centre's agricultural laws for three months and join the demonstration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X