వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్య గ్రహణంతో కరోనా మహమ్మారి అంతమైనట్లే? భూమికి దగ్గరగా సూర్యుడు వస్తేనే!

|
Google Oneindia TeluguNews

ఆదివారం(జూన్ 21న పూర్తిస్థాయి సూర్య గ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణ ప్రభావం ఆసియా, ఆప్రికా దేశాల్లోనే ఎక్కువగా ఉంది. ఈ దేశాల్లోని ప్రజలు సూర్య గ్రహణాన్ని తిలకించారు. పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించగా.. మరికొన్ని ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకోవడంతో సూర్య గ్రహణాన్ని చూడలేకపోయారు. ఆసియా, ఆఫ్రికా దేశాలతోపాటు ప్రపంచంలోని అమెరికా, యూరప్ ప్రాంతాల్లో కూడా సూర్యగ్రహణం పాక్షికంగా కనిపించింది.

సూర్య గ్రహణం ఇలా..

సూర్య గ్రహణం ఇలా..

ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు మొదలైన సూర్య గ్రహణం.. మధ్యాహ్నం 12 గంటలా 10 నిమిషాల వరకు కొనసాగనుంది. ఇక మన దేశంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల్లో సూర్య గ్రహణం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుందని శాస్త్రవేత్తలు, జ్యోతిష్కులు చెబుతున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో సంపూర్ణంగా కాకుండా ఉంగరం ఆకారంలో గ్రహణం ఏర్పడింది.

కరోనా మహమ్మారిపై ప్రభావం ఎంత?

కరోనా మహమ్మారిపై ప్రభావం ఎంత?

కాగా, ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సూర్యగ్రహణ ప్రభావం కరోనాపై ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. సూర్య గ్రహణం కారణంగా కరోనా వైరస్ అంతమయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో ఎంత వరకు నిజం ఉంది.. కరోనాను ఈ సూర్య గ్రహణం అంతం చేస్తుందా? అనే అంశాలపై శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు.

డిసెంబర్‌లో ఎంట్రీ.. జూన్‌తో ఎగ్జిట్..

డిసెంబర్‌లో ఎంట్రీ.. జూన్‌తో ఎగ్జిట్..

న్యూక్లియర్, ఎర్త్ సైంటిస్ట్ డాక్టర్ కేఎల్ సుందర్ కృష్ణ ఈ అంశంపై స్పందించారు. ఆదివారం నాడు ఏర్పడిన సూర్య గ్రహణం కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయగలదని అన్నారు. గత సంవత్సరం డిసెంబర్‌లో సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలోనే కరోనా మహమ్మారి ప్రపంచంపై దాడి చేసిందని .. జూన్ 21న ఏర్పడిన సూర్య గ్రహణంతో ఆ వైరస్ క్రియారహితంగా మరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

Recommended Video

#Watch Solar Eclipse 2020 In India మరో గ్రహణం భారత్ నుంచి వీక్షించాలంటే ఒక దశాబ్దం పడుతుందట !
సూర్యుడికి భూమికి మధ్య దూరం తగ్గితేనే..

సూర్యుడికి భూమికి మధ్య దూరం తగ్గితేనే..

రింగ్ ఆకారంలో ఏర్పడిన సూర్య గ్రహణంతో ఉపరితలం మరింత వేడేక్కె అవకాశం ఉందని.. దీంతో కరోనా వైరస్ అంతం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సూర్యుడు, భూమికి మధ్య 152.02 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉండగా.. ఆ దూరంగా కొంత మేర తగ్గితేనే కరోనా అంతం సాధ్యమవుతుందని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary
Nuclear and Earth Scientist Dr KL Sundar Krishna told news agency ANI that the pandemic may have been a result of mutated particle interaction of the first neutron due to fission energy emitted after the solar eclipse in December last year and the upcoming solar eclipse on June 21 could prove to be a turning point and make the coronavirus inactive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X