వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిందగీలో మర్చిపోలేని అనుభూతినిస్తా: ట్రంప్, మెలానియాకు మోదీ ప్రామిస్.. రోడ్డు వెంట 70 లక్షలమంది

|
Google Oneindia TeluguNews

ఈనెల 24, 25 తేదీల్లో చేపటనున్న భారత పర్యటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంతదేశంలో సభలకు మహా అయితే 50వేల మంది జనం వస్తారని, అదే ఇండియాలోనైతే ఎక్కడికెళ్లినా లక్షలాది మంది తారాసపడతారని అన్నారు. అహ్మదాబాద్ లో పాల్గొనబోయే సభకు కనీసం లక్ష మంది వస్తారని మోదీ తెలిపారని, ఎయిర్ పోర్టు నుంచి స్టేడియానికి మధ్య రోడ్డు వెంట 50 నుంచి 70 లక్షల మంది జనం ఉంటారని ఆశిస్తున్నానన్నారు. వాషింగ్టన్ లోని ఓవల్ ఆఫీసులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. భారత పర్యటకు సంబంధించి అనేక విషయాలు పంచుకున్నారు.

వాణిజ్య ఒప్పందంపై సంతకం పెడతా..

వాణిజ్య ఒప్పందంపై సంతకం పెడతా..

చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అమెరికా-ఇండియా వాణిజ్య ఒప్పందంపై ఈ పర్యటనలోనే స్పష్టత రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. అయితే దాని కోసం ఇండియానే కాస్త కసరత్తు చేయాల్సి ఉంటుందని, రెండు దేశాలకూ ప్రయోజనాలు చేకూర్చే డీల్ తయారైతే ఎప్పుడెప్పుడు సంతకం చేయాలాని ఉవ్విళ్లూరుతున్నానన్నారు. మొత్తంగా భారత పర్యటన కోసం చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నానని తెలిపారు.

మోదీ మాటిచ్చారు..

మోదీ మాటిచ్చారు..

‘‘గతేడాది అమెరికాలో పర్యటించనప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నాకు మాటిచ్చారు. ఇండియాలో పాల్గొనే సభలకు లక్షలాదిగా జనం వస్తారని చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి స్టేడియం వరకు 70 లక్షల మందిని చూస్తానని ఆశిస్తున్నా. మోదీ స్వయంగా అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మించారు. ఆయనతో కలిసి ఆ స్టేడియంలో లక్షల మంది ముందు నేను మాట్లాడబోతున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నా''అని ట్రంప్ తెలిపారు.

ట్రంప్ ప్రకటపై మోడీ రియాక్షన్..

ట్రంప్ ప్రకటపై మోడీ రియాక్షన్..


భారత్ లో పర్యటనకు ఆసక్తిగా ఎదురుచుస్తున్నానంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘ప్రెసిడెంట్ తోపాటు ఫస్ట్ లేడీ మెలానియా ఇండియాకు రానుండటం చాలా సంతోషకరం. గౌరవ అతిథులకు చిర్మరణీయంగా భారత్ స్వాగతం పలుకుతుంది. జిందగీలో మర్చిపోలేని అనుభూతిని ఈ పర్యటనలో మీకు అందించే పూచీనాది. రెండు దేశాల సంబంధాలను మరింత పటిష్టం చేసే ఈ పర్యటన చాలా ప్రత్యేకమైంది'' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

న్యూ పటేల్ స్టేడియంలో.. హౌడీ మోదీ తరహాలో..

న్యూ పటేల్ స్టేడియంలో.. హౌడీ మోదీ తరహాలో..

గతేడాది హ్యూస్టన్ లో హౌడీ మోదీ తరహాలోనే ఈనెల 24న అహ్మదాబాద్ లోని న్యూ సర్దార్ పటేల్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. దాదాపు 1.25 లక్షల మంది ప్రేక్షకులు కూర్చునే వీలున్న ఈ స్టేడియం.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్ గా నిలవనుంది. ట్రంప్, మోదీ కలిసి దీన్ని ప్రారంభిస్తారు.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | Trump India Tour | LPG Prices Hiked
ముందుగా సబర్మతి ఆశ్రమానికి..

ముందుగా సబర్మతి ఆశ్రమానికి..

ఈనెల 24న అమెరికా నుంచి నేరుగా అహ్మదాబాద్ రానున్న ట్రంప్, మెలానియాకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికి సబర్మతీ ఆశ్రమానికి తీసుకువెళతారు. గాంధీజీ ఇల్లు, ఆయన నూలు వడికిన రాట్నం, హృదయ్ కంజ్ లను సందర్శిస్తారు. సాయంత్రం పటేల్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు సెలబ్రిటీలూ పాలుపంచుకుంటారు. తర్వాతి రోజు ట్రంప్ దంపతులు ఢిల్లీకి పయనమై పలు చర్చల్లో పాల్గొంటారు.

English summary
Donald Trump has said '5 to 7 Million People from Airport to Ahmedabad Stadium, during his two-day visit on February 24 and 25. PM Modi tweeted saying India will make the tour a memorable one for the US leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X