• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయం: సీజేఐ రమణ హెచ్చరిక -జస్టిస్ బోబ్డే వీడ్కోలు సభలో కీలక వ్యాఖ్యలు -సుప్రీం ఎదుట భారీ సవాళ్లు

|

దేశంలో ఆరోగ్య రంగాన్ని కుదిపేస్తూ, మిగతా వ్యవస్థలన్నిటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న కరోనా విలయంపై నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితులపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టులు ఏకిపారేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. సీజేఐగా జస్టిస్‌ బోబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.దేశంలో ఆరోగ్య రంగాన్ని కుదిపేస్తూ, మిగతా వ్యవస్థలన్నిటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న కరోనా విలయంపై నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితులపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టులు ఏకిపారేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. సీజేఐగా జస్టిస్‌ బోబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఇక జస్టిస్ రమణ చేతికి న్యాయ దండం -బాగా పనిచేశా, సంతృప్తిగా పదవీ విరమణ: జస్టిస్ బోబ్డే భావోద్వేగంఇక జస్టిస్ రమణ చేతికి న్యాయ దండం -బాగా పనిచేశా, సంతృప్తిగా పదవీ విరమణ: జస్టిస్ బోబ్డే భావోద్వేగం

కరోనా విలయం: షాకింగ్ రిపోర్ట్ -మే15 కల్లా పతాక స్థాయికి వైరస్ వ్యాప్తి -35లక్షల కేసులు -తగ్గేదెప్పుడు?కరోనా విలయం: షాకింగ్ రిపోర్ట్ -మే15 కల్లా పతాక స్థాయికి వైరస్ వ్యాప్తి -35లక్షల కేసులు -తగ్గేదెప్పుడు?

బోబ్డేతో మర్చిపోలేని అనుభవం

బోబ్డేతో మర్చిపోలేని అనుభవం

సుప్రీంకోర్టులో జస్టిస్‌ బోబ్డేతో కలిసి పనిచేసిన కాలాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. వీడ్కోలు పలకడం అనేది చాలా కష్టమైన పని అని, అయితే, జస్టిస్‌ బోబ్డే భిన్న అభిరుచులు కలిగిన వ్యక్తి కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలన్నది ఇప్పటికే నిర్ణయించుకుని ఉండొచ్చని, బోబ్డేలోని తెలివి, శక్తి సామర్థ్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని జస్టిస్ రమణ అన్నారు. భవిష్యత్‌లో బోబ్డే చేసే అన్ని ప్రయత్నాల్లో మంచి జరగాలని ఆకాంక్షించారు. కరోనా కాలంలో ప్రజలకు న్యాయం అందించడం కోసం జస్టిస్‌ బోబ్డే ఈ-కోర్టులను, వర్చువల్ విచారణలను ప్రారంభించారని, మహమ్మారి సమయంలోనూ మౌలిక సదుపాయాల కల్పనకు బోబ్డే కృషి చేశారని రమణ కొనియాడారు.

కరోనాపై కఠిన చర్యలు తప్పవా?

కరోనాపై కఠిన చర్యలు తప్పవా?

జస్టిస్ బోబ్డే పదవీ విరమణ సందర్భంలో మాట్లాడుతూ దేశంలో కరోనా పరిస్థితులపై జస్టిస్ రమణ హెచ్చరిక లాంటి వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ప్రస్తుతం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నదని, ఇలాంటి క్లిష్ట సమయంలో కొన్ని బలమైన చర్యలు తీసుకొని వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, చేతులు కడుక్కోవాలని, అవసరమైతే తప్ప బయటికి రావొద్దన్నారు. సుప్రీం, హైకోర్టు జడ్జిలు సైతం వైరస్ బారిన పడటాన్ని గుర్తుచేస్తూ, క్రమశిక్షణతోనే కరోనా మహమ్మారిని ఓడించగలమని, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా కఠిన చర్యలు అవసరమని జస్టిస్ రమణ అన్నారు. శుక్రవారం సీజేఐగా బాధ్యతల చేపడుతోన్న జస్టిస్ రమణ ఎదుట భారీ సవాళ్లెల్లో నిలిచాయి..

జస్టిస్ రమణకు భారీ సవాళ్లు..

జస్టిస్ రమణకు భారీ సవాళ్లు..

కరోనా విలయం, ప్రభుత్వ ఉదాసీనత, రాష్ట్రాల వేడుకోళ్లు, ప్రజల హాహాకారాలు, మరో వారం దాకా ఆక్సిజన్ కొరత తీరని పరిస్థితి, రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాల నమోదు, వ్యాక్సిన్ ధరలపై రగడ, ఆంక్షల వల్ల పని కోల్పోయిన పేదల ఆకలి కేకలు... ఇవన్నీ ప్రస్తుతం దేశం ముందున్న సవాళ్లుకాగా, జస్టిస్ బోబ్డే తన 14 నెలల పదవీ కాలంలో కనీసం ఒక్క జడ్జిని కూడా నియమించకపోవడంతో సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ, కొండలా పేరుకుపోయిన పెండింగ్ కేసులు, వివిధ స్టాయిల కోర్టుల మధ్య సమన్వయలోపం తదితర అంశాలు జస్టిస్ రమణ ముందు సవాళ్లుగా నిలిచాయి. కొవిడ్ విలయానికి సంబంధించిన అన్ని కేసులను సుమోటోగా సుప్రీంకోర్టే విచారిస్తుందని జస్టిస్ బోబ్డే చెప్పినప్పటికీ, అందుకు విరుద్ధంగా రాష్ట్రాల హైకోర్టులు ఇవాళ కూడా కొవిడ్ పిటిషన్లను విచారించడం చర్చకు దారితీసింది. శుక్రవారం నుంచి జస్టిస్ రమణ సారధ్యంలో నడవనున్న సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు వెలువరించబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.

English summary
Justice NV Ramana, who has been appointed as the new CJI, said he will never forget the time he worked with Justice Bobde in the Supreme Court. He was speaking at a farewell function on Friday in the wake of the end of Justice Bobde's tenure as CJI. "Saying goodbye is a very difficult task," said Justice NV Ramana. From farms to Chief Justice of India, CJI-designate NV Ramana and the big challenges ahead of him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X