వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే నూతన మంత్రిగా.. నితిన్ గడ్కరి!?

రైలు ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నానని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించడంతో కొత్త రైల్వే మంత్రి బాధ్యతలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నానని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించడంతో కొత్త రైల్వే మంత్రి బాధ్యతలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరికి అప్పగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

బుధవారంనాడు సురేష్ ప్రభు ఓ ట్వీట్‌లో.. తాను ప్రధాని మోడీని కలిసి తన రాజీనామా ప్రతిపాదనను ఆయన ముందుంచానని, ప్రధాని వేచి ఉండమని సూచించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రైల్వే బోర్డు చైర్మన్ పదవికి అశోక్ మిట్టల్ చేసిన రాజీనామాను బుధవారం ఆమోదించడం, కొత్త చైర్మన్‌గా ఎయిరిండియా సీఎండీ అశ్వని లోహానిని నియమించడం చకచకా జరిగిపోయాయి.

nitin-gadkari

దీంతో సురేష్ ప్రభు రాజీనామా ప్రతిపాదనపై కూడా ప్రధాని వేగంగానే స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కొద్ది గంటల్లోనే క్యాబినెట్ విస్తరణను మోడీ చేపట్టే అవకాశాలుండటంతో సురేష్ ప్రభు స్థానంలో రైల్వే మంత్రిగా గడ్కరిని నియమించే అవకాశాలున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

అయితే సురేష్ ప్రభు కోరినట్టుగా ఆయన రాజీనామాను ప్రధాని అంగీకరించినప్పటికీ వేరే శాఖను ఆయనకు కేటాయించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. సురేష్ ప్రభు పనితీరు, ఆ శాఖలో సమస్యలు, ఫిర్యాదుల పట్ల ఆయన వేగంగా స్పందించే తీరుపై గతంలో మోడీ పలుమార్లు ప్రశంసించిన సందర్భాలున్నాయి.

English summary
After Railway Minister Suresh Prabhu has taken the moral responsibility of the recent rail accidents, it is being anticipated that he might be replaced by Nitin Gadkari, Union Minister for Road Transport, Highways and Shipping from the position. Prabhu had offered to resign from the position taking the responsibility of accidents when he had been suggested by Prime Minister Narendra Modi, to wait. With a cabinet shuffle already to be conducted, it is highly possible that Gadkari will be handed over additional charges of the Railway ministry, as is being claimed in several media reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X